ETV Bharat / entertainment

'నా భర్త మిస్టర్ విజయ్ దేవరకొండ'- పెళ్లి ఫొటోలు షేర్ చేసిన రష్మిక మంధన్నా

Rashmika - Vijay Devarakonda Wedding Photos- పెళ్లి ఫొటోలు షేర్ చేసుకున్న రష్మిక మంధన్నా- ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో అట్రాక్షన్​గా కొత్త జంట!

Rashmika Mandanna Vijay Devarakonda
Rashmika Mandanna Vijay Devarakonda (Source : Rashmika Mandanna Insta)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 7:02 PM IST

1 Min Read
Choose ETV Bharat

Rashmika Mandanna - Vijay Devarakonda Wedding Photos : విజయ్ దేవరకొండ- రష్మిక మంధన్నా పెళ్లి ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా గురువారం ఉదయం 10.10 గంటలకు హిందూ సంప్రదాయంలో వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 'నా భర్త, మిస్టర్ విజయ్ దేవరకొండను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను' అని క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఈ ఫొటోల్లో విజయ్- రష్మిక సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు. రష్మిక రెడ్ కలర్ శారీలో కనిపించడగా, విజయ్ సంప్రదాయ పంచకట్టులో ఉన్నారు. రాజసం ఉట్టిపడేలా విజయ్ కాళ్లు, చేతులకు కడియాలు, మెడలో బంగారు హారంతో కనిపించారు. ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్​గా మారాయి. సెలబ్రిటీలు, ఫ్యాన్స్​ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.