ETV Bharat / entertainment

'కొడువ' పద్ధతిలో విజయ్- రష్మిక మళ్లీ పెళ్లి- ఈ సంప్రదాయంలో వధూవరులకు కఠిన పరీక్ష!

సాయంత్రం మరోసారి 'విరోష్'​ వివాహం -కర్ణాటక సంప్రదాయం పెళ్లి -అసలు ఈ వివాహ పద్ధతి ఏంటి?-ఎలా చేసుకుంటారో తెలుసా?

Rashmika Kodagu Style Wedding
Rashmika Kodagu Style Wedding (Film Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 4:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rashmika Kodava Wedding Style : విజయ్​ దేవరకొండ, రష్మిక మంధన్నా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా గురువారం ఉదయం 10.10 గంటలకు వివాహం చేసుకున్నారు. తెలుగు సంప్రదాయం ప్రకారం వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఇదే రోజు సాయంత్రం రష్మిక కుటుంబ సంప్రదాయం 'కొడువ' పద్ధతి ప్రకారం కూడా వీళ్లు పెళ్లి చేసుకోనున్నారు. అయితే ఈ పెళ్లి తెలుగు ట్రెడిషన్​కు భిన్నంగా ఉంటుంది. మరి ఈ కొడువ సంప్రదాయం ప్రకారం వివాహం ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

'మంగళ' వివాహ వేడుక
కొడువ వివాహం కర్ణాటకలోని కొడుగు (కూర్గ్​) ప్రాంతం వాళ్లు చేసుకుంటారు. రష్మిక కూడా అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడంతో ఈ కొడువ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటుంది. అయితే అక్కడి పెళ్లి సంప్రదాయం చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వివాహ వేడుకను వాళ్లు 'మంగళ' అని పిలుస్తారు. ఈ పెళ్లిలో హిందూ సంప్రదాయంలాగా పురోహితులు ఉండరు. అగ్ని సాక్షిగా ఏడు అడుగులు ఉండవు. ఇది అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుందట.

సంప్రదాయ దుస్తులతో
ఈ పెళ్లిలో వధూవరులు ఇద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు 'కుప్య' (నల్లని కోటు), 'చేలే' (నడుముకు కట్టే పట్టీ), 'పీచే కత్తి' (చిన్న కత్తి) ధరిస్తాడు. పెళ్లి కూతురు వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కొడవ చీరను ధరిస్తుంది.

అరటి చెట్టు నరికి - పరాక్రమాన్ని నిరూపించి
పెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అడ్డుగా ఉన్న అరటి చెట్టు కాండాలను వరుడు నరకడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. వధూవరులు పెళ్లి పీటలపై కూర్చున్నప్పుడు, కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. పంతులు లేని కారణంగా ఇక్కడ ఎటువంటి మంత్రాలు ఉండవు. కేవలం పెద్దల దీవెనలతోనే ఈ పెళ్లి జరుగుతుంది. మన వధువుకు ఒడిబియ్యం ఇచ్చినట్లుగానే ఇక్కడ నాణేల మూట అందిస్తారు. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతం.

వధువు సహనానికి పరీక్ష
పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా, కొడవ పెళ్లిళ్లలో మాంసాహారం (ముఖ్యంగా పంది మాంసం), మద్యం ఉంటుందట!

వధువు చీరకట్టు ఇలా!
సాధారణంగా తెలుగు వారు చీరను ముందు నుంచి వెనక వైపునకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీరను వెనుక నుంచి ముందుకు వేస్తారు. ఈ వేడుకలో వలగ డ్రమ్​ బీట్స్​, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే విధంగా డ్యాన్సులు చేస్తారు. అలాగే ఈ వేడుకలో గన్ సెల్యూట్‌లు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు దానిని అనుసరించడం క్రమంగా తగ్గుతోంది.

చిన్నారులకు స్వీట్స్​తో ట్రీట్
ఈ వివాహ వేడుక సందర్భంగా రష్మిక, విజయ్​ల బంధువులు కలిసి ఉదయ్‌పుర్‌ హోటల్‌ సమీపంలో ఫొటోగ్రాఫర్లు, జర్నలిస్టులకు స్వీట్లు పంచారు. అంతేకాకుండా వివాహం జరిగిన ఐటీసీ హోటల్స్‌ ప్రాంగణంలో ఉన్న చిన్నారులకు కాజు బర్ఫీలు ఉన్న మిఠాయి బాక్స్‌లను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు తదితరులకు విరోష్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

'విజయ్​ దేవరకొండ నా ప్రాణాలు కాపాడాడు'- బ్రిటీష్​ నటుడు ఎమోషనల్

రష్మికకు అత్తవారింటి స్పెషల్ గిఫ్ట్- ఉదయపుర్‌లో 'విరోష్' వెడ్డింగ్ సందడి!