ETV Bharat / entertainment

అనిల్ రావిపూడి మూవీకి పోటీగా రవితేజ మల్టీస్టారర్! - ఈసారి సంక్రాంతికి అంత ఈజీ కాదా?

2027 సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలు- ఈసారి పండగకు రానున్న అనిల్​కు కాంపిటీషన్​గా మరో మల్టీస్టారర్!

Anil Ravipudi _ Raviteja
Anil Ravipudi _ Raviteja (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 9, 2026 at 4:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sankranthi Box office Clash : సంక్రాంతి బరిలో నిలిచిన అనిల్ రావిపూడి సినిమాలన్నీ వరుస విజయాలందుకుంటున్నాయి. తక్కువ సమయంలోనే సినిమాలను తీస్తూ, అందరినీ ఎంటర్టైన్ చేసే అతి తక్కువ డైరెక్టర్లలో అనిల్ ఒకరిగా నిలుస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తుందనగానే అది తప్పకుండా హిట్​ అనే భావనలో ఆడియెన్స్​ను బ్లైండ్​గా ఫిక్సపోతున్నారు. అంతలా తన మార్క్​ను చూపిస్తున్న అనిల్​కు ఈసారి ఓ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్​తో అరుదైన పోటీ తప్పేలా లేదు.

అనిల్ డైరెక్ట్ చేసిన ఎఫ్​2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్​గారు ఇలా ఈ నాలుగు చిత్రాలూ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్​బస్టర్లుగా నిలిచాయి. దాంతో అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది డెఫినెట్​గా హిట్​ అనే భావన అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో సెంటిమెంట్​గా మారింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్ - నందమూరి కల్యాణ్​రామ్​ కాంబోలో మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అనిల్ చిత్రంతో మరో మల్టీస్టారర్ మూవీ పోటీ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రవితేజ - శ్రీవిష్ణుతో శ్వాగ్ ఫేం యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి ఓ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. హసిత్ గోలి చెప్పిన కథకు హీరోలు రవితేజ, శ్రీవిష్ణు గ్రీన్​సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. 'వీరాధి వీరులంట' అనే టైటిల్​ను కూడా దీనికి ఫిక్స్ చేసినట్లు వినిపిస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించి సంక్రాంతి సీజన్​లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సమయంలో రిలీజ్ ప్లాన్ చేస్తే పండగ అడ్వాంటేజ్ కూడా సినిమాకు కలిసొస్తుందని దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్​రాజు నిర్మించే అవకాశాలున్నట్లు తెలిసింది. దాంతో ఈ రెండు మల్టీస్టారర్ల మధ్య పోటీ ఉండేలా ఉంది.

ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పుడో లెక్క అని మిర్చి సినిమాలో ప్రభాస్​ చెప్పిన డైలాగ్ మాదిరిగా ఇప్పటి వరకూ సంక్రాంతి సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడటం చూసుంటాం, లేదా మిడ్ రేంజ్ హీరోలు పోటీ పడటం చూసుంటాం, కానీ రెండు మల్టీస్టారర్ సినిమాలు పోటీ పడటం చాలా అరుదు. ఒకవేళ ఇదే జరిగితే పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఫ్యామిలీ ఎమోషన్స్​కు ఫన్ ఎలిమెంట్స్​ను జోడించి తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించే అనిల్ రావిపూడి ఓ పక్క, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్​తో శ్వాగ్ లాంటి మూవీస్​తో ఆడియెన్స్​ను అలరించే హసిత్ గోలి మరోవైపు, సంక్రాంతి బరిలో నిలుస్తారనే సంకేతాలు వినిపిస్తుండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు హసిత్ గోలి డైరెక్షన్​లో రవితేజ - శ్రీవిష్ణు సినిమాపై మేకర్స్ నుంచి అధికారికంగా అనౌన్స్​మెంట్ ఇంకా రాలేదు. కానీ ప్రచారం మాత్రం జోరుగా నడుస్తోంది. ఇది మాత్రం నిజమైతే సంక్రాంతి సీజన్​లో వచ్చిన రెండు మల్టీస్టారర్ సినిమాలుగా ఇవి అరుదుగా నిలవనున్నాయి. ఇందులో అనిల్ రావిపూడి సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్​ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతుండగా, హసిత్ గోలి చిత్రం సైతం ఆ తరహా కథతోనే తెరకెక్కే ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో సంక్రాంతి బరిలో నిలిచిన అనిల్ రావిపూడి చిత్రాలన్నీ కూడా మంచి విజయాలందుకున్నాయి. దాంతో ఈసారి వచ్చే చిత్రంతో కూడా అనిల్ రావిపూడి కలెక్షన్లతో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఎలా చూసినా రవితేజ - శ్రీవిష్ణు మల్టీస్టారర్ సంక్రాంతి బరిలో నిలిచినట్లైతే అనిల్​కు కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే హసిత్ గోలి ప్రాజెక్టు పై మేకర్స్ స్పష్టత ఇవాల్సి ఉంది.

అనిల్ రావిపూడి-వెంకటేశ్- కల్యాణ్​ రామ్ కొత్త సినిమా షురూ- హీరోయిన్లు కన్ఫర్మ్

'ఈ ప్రయాణంలో ఎన్నో మర్చిపోలేని అనుభవాలు'