ETV Bharat / entertainment

రూ.1000 కోట్ల క్లబ్​లో 'ధురంధర్'- 2025లో బిగ్గెస్ట్​ హిట్​గా రికార్డ్

బ్లాక్​బస్టర్ ఆఫ్ ది ఇయర్​గా ధురంధర్- రూ.1000 కోట్లు వసూల్ చేసిన బాలీవుడ్ సినిమా- ఈ ఏడాది అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగానూ రికార్డ్

Dhurandhar Collections
Dhurandhar Collections (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : December 26, 2025 at 1:14 PM IST

2 Min Read
Choose ETV Bharat

Dhurandhar Collections : బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ 'ధురంధర్' రూ.1000 కోట్ల క్లబ్​లో చేరిపోయింది. స్టార్ హీరో రణ్​వీర్ సింగ్ - ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 05న రిలీజై భారీ విజయం దక్కించుకుంది. గత మూడు వారాలుగా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను కొల్లగొడుతున్న ఈ సినిమా తాజాగా రూ.1000 కోట్ల మార్క్ దాటింది. ఈ సినిమా​ ఇప్పటిదాకా వరల్డ్​వైడ్​గా ​రూ.1,006.70 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో 2025లో ఈ మార్క్ అందుకున్న ఏకైక భారతీయ సినిమాగా ధురంధర్ నిలిచింది.

ఇక ఈ సినిమా భారత్​లో రూ.668 కోట్ల వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో భారత్​లో అత్యధిక వసూళ్లు సాధించిన రీసెంట్ సినిమాలు ఛావా (రూ. 601 కోట్లు), స్త్రీ 2 (రూ.598 కోట్లు)ను అధిగమించింది. అలాగే హీరో రణ్​వీర్ సింగ్ కెరీర్​లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ధురంధర్ నిలిచింది.

కాగా, ఈ సినిమా వాస్తవిక సంఘటనల ఆధారంగా దర్శకుడు అదిత్య ధర్ తెరకెక్కించారు. ఇందులో భారత్​- పాక్​ సరిహద్దు ఘర్షనలతోపాటు 2001 పార్లమెంట్​ దాడి, 26/11 ముంబయి దాడుల వంటివి దీంట్లో ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్​లోని క్రిమినల్ గ్యాంగ్‌ల స్థావరమైన కరాచీలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించడం చుట్టే ఈ సినిమా కథ నడుస్తుంది.

ఇందులో రణ్​వీర్ సింగ్​తోపాటు బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్​ ఖన్నా, టాలెంటెడ్ యాక్టర్ ఆర్​ మాధవన్​, అర్జున్​ రాంపాల్​, సంజయ్​ దత్​, సారా అర్జున్, రాకేష్​ బేడీ, మానవ్​ గోహిల్​ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. శాశ్వత్​ సచ్​దేవ్​ సంగీతం అందించగా, జియో స్టూడియోస్​, బి62 స్టూడియోస్​ బ్యానర్లపై ఆదిత్య ధర్, లోకేష్​ ధర్​ సంయుక్తంగా నిర్మించారు. ఇక వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాకు సీక్వెల్​గా ధురంధర్ 2 రానుంది.

2025 ఏడాదిలో అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన ఇండియన్ సినిమాలు (సుమారు)

  • ధురంధర్ - హిందీ- రూ.1000+ కోట్లు
  • కాంతార - కన్నడ- రూ.850 కోట్లు
  • ఛావా- హిందీ- రూ.800 కోట్లు
  • సైయారా- హిందీ- రూ.580 కోట్లు
  • కూలీ- తమిళ్ - రూ. 550 కోట్లు
  • మహావతార నరసింహ- పాన్ఇండియా - రూ. 330 కోట్లు
  • వార్ 2- హిందీ- రూ.310 కోట్లు
  • కొత్త లోక ఛాప్టర్ 1 - మలయాళం - రూ.305 కోట్లు
  • ఓజీ - తెలుగు- రూ.300 కోట్లు
  • ఎంపురాన్ ఎల్ 2- మలయాళం- రూ.275 కోట్లు

గమనిక : పైన చెప్పిన వసూళ్లు ట్రేడ్​ విశ్లేషకుల ట్వీట్లు ఆధారంగా రాసినవి.

ధురంధర్ OTT
కాగా, ఈ సినిమా డిజిటల్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ సినిమాను నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే 2026 జనవరి 30న ధురంధర్ మూవీ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ధురంధర్ ఓటీటీ రిలీజ్​పై అటు మూవీ మేకర్స్ కానీ, నెట్​ఫ్లిక్స్​ కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, ఈ మూవీ ఓటీటీ రిలీజ్​లో తెలుగు వెర్షన్ కూడా ఉండనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజమనేది విడుదల అయితేగానీ తెలియదు.


ఐటమ్ సాంగ్స్ నమ్ముకునే మేకర్స్​కు 'ధురంధర్' హర్రర్ సినిమాలాంటింది!: ఆర్జీవీ సంచలన పోస్ట్

సమ్మర్​లో 'ధురంధర్'​ సీక్వెల్- 'పెద్ది', 'ప్యారడైజ్'​ సినిమాలకు పోటీ తప్పదా?