ETV Bharat / entertainment

'ధురంధర్' దూకుడు- వసూళ్లలో హిందీ ఇండస్ట్రీ రికార్డు బ్రేక్- ఆ రికార్డు మాత్రం బన్నీదే!

రణవీర్ సింగ్ 'ధురంధర్' మూవీ వసూళ్ల సునామీ - విడుదలైన రెండు వారాల్లోనే రూ.500కోట్ల క్లబ్‌లోకి - హిందీ ఇండస్ట్రీని రికార్డులు బ్రేక్

Dhurandhar Records
Dhurandhar Records (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : December 21, 2025 at 7:31 AM IST

3 Min Read
Choose ETV Bharat

Dhurandhar Records : రణ్​వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వసూళ్లలో కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచే బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. రిలీజైన 15 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి, బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. దీంతో రూ.500 కోట్లను అత్యంత వేగంగా వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది.

వాస్తవానికి ఈ రికార్డు షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' పేరిట ఉండేది. ఆ సినిమా విడుదలైన 18 రోజుల్లో రూ.505.95 కోట్లు వసూలు చేసింది. అలాగే రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ నటించిన కామెడీ-హారర్ చిత్రం 'స్త్రీ 2' 2024లో 22 రోజుల్లో రూ.503.25 కోట్లు సాధించింది. కానీ 'ధురంధర్' ఈ రెండు సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ, కేవలం 15 రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్​ అందుకోవడం విశేషం.

పాన్-ఇండియా రికార్డు మాత్రం బన్నీదే
అయితే, పాన్ ఇండియా సినిమాల పరంగా చూస్తే మాత్రం అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రంగా ఇప్పటికీ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' పేరిట రికార్డు కొనసాగుతోంది. పాన్-ఇండియా స్థాయిలో విడుదలైన ఈ తెలుగు సినిమా విడుదలైన కేవలం 11 రోజుల్లోనే రూ.552.1 కోట్లు వసూలు చేసింది. పాన్ఇండియా పరంగా రెండో స్థానంలో ధురంధర్, మూడో స్థానంలో జవాన్ నిలించింది. నాలుగో స్థానంలో స్త్రీ-2 ఉంది. ఇంది 22 రోజుల్లో రూ.500కోట్ల క్లబ్‌లో చేరింది.

15వ రోజు రూ.23.70 కోట్లు
'ధురంధర్' బాక్సాఫీస్ కలెక్షన్లకు సంబంధించిన తాజా అప్‌డేట్లను నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టో చేస్తోంది. తాజాగా రూ.500 కోట్ల మైలురాయిని విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమా శుక్రవారానికి 15 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. శుక్రవారం ఒక్కరోజులోనే రూ.23.70 కోట్లు వసూలు చేయడం ద్వారా 'ధురంధర్' ఈ ఫీట్‌ను సాధించింది. కేవలం రెండు వారాల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించిన ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను కొల్లగొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'ధురంధర్' ఒక శక్తివంతమైన స్పై థ్రిల్లర్. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ 'హంజా' అనే పాత్రలో కనిపిస్తారు. కరాచీలోని గ్యాంగ్‌లు, ఉగ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొరబడి పనిచేసే భారత గూఢచారి పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. 'హంజా' అనే గూఢచారి పాత్రలో రణవీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఆయనతో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం ఉన్నారు.

భారత్-పాక్ సరిహద్దు ఘర్షణలు, 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబయి దాడుల వంటి వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న లియారీ ప్రాంతంలో క్రిమినల్ గ్యాంగ్‌లు, ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించడానికి జరిగిన వాస్తవ సంఘటనల నుంచి దర్శకుడు ఈ కథను తీసుకున్నారు. ఆర్. మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర, ప్రస్తుత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ స్ఫూర్తితో రూపొందించినట్లు కనిపిస్తుంది. అక్షయ్ ఖన్నా పాత్ర పాకిస్థాన్‌కు చెందిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డకైట్ ఆధారంగా ఉంటుంది. రణవీర్ సింగ్ పోషించిన హంజా పాత్ర వీరమరణం పొందిన మేజర్ మోహిత్ శర్మ జీవితాన్ని పోలి ఉంటుంది.

ఆ సీన్ కోసం అక్షయ్​ ఖన్నాను 7సార్లు చెంపదెబ్బ కొట్టిన నటి- ఎందుకో తెలుసా?

'ఇలాంటి స్టోరీతో ఇప్పటిదాకా ఏ సినిమా రాలేదు'- 'ధురంధర్​'పై ఆర్జీవీ రివ్యూ