ఆ సీన్ కోసం అక్షయ్ ఖన్నాను 7సార్లు చెంపదెబ్బ కొట్టిన నటి- ఎందుకో తెలుసా?
బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తున్న ధురంధర్- ఈ సినిమాలోని కీలక విషయాలు షేర్ చేసుకున్న యాక్టర్ సౌమ్య

Published : December 18, 2025 at 6:22 PM IST
Dhurandhar Slap Scene : బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో ప్రతినాయకుడు పాత్రలో రెహమాన్ డకైత్‌గా అక్షయ్ ఖన్నా నటించారు. ఆయన మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టేశారు. రెహమాన్ డకైత్ భార్య పాత్రలో సౌమ్య టాండన్ కనిపించారు. అయితే 'ధురంధర్' సినిమాలోని ఓ సీన్ కోసం అక్షయ్‌ను టాండన్ ఏకంగా ఏడు సార్లు చెంపదెబ్బ కొట్టారట.
ధురంధర్ సినిమాలో రెహమాన్ డకైత్ చిన్న కుమారుడు చనిపోతాడు. ఆ సమయంలో డకైత్ భార్య అతన్ని నిలదీస్తుంది. ఆ సమయంలో భర్తపై కోపం, అసహనంతో చెంపదెబ్బ కొడుతుంది. ఈ సీన్‌ను డైరెక్టర్ ఆదిత్య ధర్ అద్భుతంగా చూపించారు. భావోద్వేగం, కోపం మేళవింపుగా తెరకెక్కించారు. అయితే ఈ సీన్లో రెహమాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా), ఆయన భార్యలో పాత్రలో నటించిన సౌమ్య టాండన్ జీవించేశారు. దీంతో థియేటర్లలో ఆ సీన్‌ను చూసి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ సీన్ గురించి సోషల్ మీడియా వేదికగా సౌమ్య టాండన్ పంచుకున్నారు.
Both the female leads legit slap men and they don't even react. This woman wouldn't have even watched Dhurandhar but as usual making lame points to play woman card which has no relation with the movie https://t.co/ZRtRQYbBm2 pic.twitter.com/kUTrXAyt4f
— feryy (@ffspari) December 8, 2025
ఆయనొక సూపర్ యాక్టర్
"అక్షయ్ ఖన్నా ఒక అద్భుతమైన నటుడు. షూటింగ్ సమయంలో అక్షయ్-నేను మాట్లాడుకోవడానికి పెద్దగా అవకాశం లభించలేదు, కానీ కెమెరా రోల్ అయిన క్షణంలోనే మా మధ్య కెమిస్ట్రీ ఏర్పడేది. అక్షయ్ లాంటి సహనటుడు ఉండటం నా కల. ఆయన చాలా మంచి యాక్టర్. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా అంతటి స్థాయి నటుడితో కలిసి యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో మేము మళ్లీ జోడీగా నటించాలని కోరుకుంటున్నాను. అందుకోసం ప్రార్థిస్తున్నాను" అని సౌమ్య టాండన్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
"ధురంధర్ సినిమాలో నా ఎంట్రీ సీన్ రెహమాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా) ను కొట్టడంతోనే ప్రారంభమవుతుంది. ఆ సన్నివేశానికి మంచి ఆదరణ లభించింది. ఈ సీన్‌కు అంత స్పందన వస్తుందనుకోలేదు. ఆ సన్నివేశాన్ని అంత అందంగా రాశారు ఆదిత్యధర్. ఆదిత్య ఒక మంచి కళాఖండాన్ని సృష్టించారు. నటీనటుల ఎంపిక అనేది ఎవరు ఏ స్థాయి వారనే దాని గురించి కాదు. పాత్రకు ఎవరు సరిగ్గా సరిపోతారు, ఆ పాత్రకు ఎవరు న్యాయం చేయగలరనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆదిత్యధర్ నిరూపించారు. మంచి కంటెంట్ ఎల్లప్పుడూ గెలుస్తుందనే నమ్మకాన్ని మీ నిజాయితీ బలపరుస్తుంది "
#Durandhar crossed 500 cr
— Matt murdock🚀 (@mattmurock123) December 15, 2025
⚡It clearly shows which side the Gen z of india stands ❤️⚡ pic.twitter.com/YeQVAoML5O
సౌమ్య టాండన్, ధురందర్ నటి
"నా కొడుకు మరణానికి కారణమైనందుకు నా భర్తపై కోపం, నిరాశ, భావోద్వేగం, బాధ అన్నింటిని ఒక్క సీన్లో కనబర్చాను. దర్శకుడు ఆదిత్య అది సహజంగా ఉండాలని పట్టుపట్టారు. ఆ షాట్ పర్ ఫెక్ట్ రావడానికి నేను పలు టేక్‌లు తీసుకున్నాను. అక్షయ్‌ను క్లోజప్‌లో ఒకసారి నిజంగానే చెంపదెబ్బ కొట్టాను" అని సౌమ్య వెల్లడించారు.
సినిమా విషయానికొస్తే
కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ధురంధర్ సినిమా. డిసెంబరు 5న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.550 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకులు ఆదరించారు. రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి యాక్టర్స్ ఈ సినిమాలో మంచి నటనను కనబర్చారు. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే ఇందులో అక్షయ్ భార్యగా నటించిన సౌమ్య టాండన్‌కు మంచి మార్కులే పడ్డాయి. వీరిద్దరి మధ్య ఉన్నవి కొన్ని సీన్లే అయినా తమ అభినయంతో ఇద్దరూ ప్రేక్షకులను కట్టిపడేశారు.
No social media.
— जेंटल मैन 🪷 (@gentleman07_) December 7, 2025
No press conferences.
No movie or music launches.
Just arrives in theatres.
Delivers an absolute performance.
And then vanishes.
That’s Akshaye Khanna for you —
one of the best performers in Indian cinema. 👏🏻 pic.twitter.com/O4wUQ3nctm
సంచలనం సృష్టిస్తున్న 'ధురందర్' - 'బాహుబలి- 2' రికార్డ్ బ్రేక్
ఆస్కార్ అవార్డ్స్ వేడుక- 2029 నుంచి యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్

