ETV Bharat / entertainment

'ధురంధర్' OTT అప్డేట్ - తెలుగు వెర్షన్​ కూడా!- రిలీజ్ ఎప్పుడంటే?

తెలుగు వెర్షన్​లో అందించే అవకాశాలు - రానున్న రోజుల్లో భారీ వసూళ్లకు ఆస్కారం - అవతార్​ రిలీజైనా బాక్సాఫీస్​ వద్ద తగ్గని దూకుడు

Dhurandhar Movie Into OTTs
Dhurandhar Movie Into OTTs (Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : December 22, 2025 at 3:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

Dhurandhar Movie Into OTTs: ఆదిత్య ధర్​ దర్శకత్వంలో రణ్​వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురంధర్' మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. డిసెంబర్​ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. రిలీజ్​ అయిన 15 రోజుల్లోనే jరూ.500 కోట్లను కొల్లగొట్టి బాలీవుడ్​లో తక్కువ కాలంలో ఈ ఫీట్ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం భారత సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న ఈ స్పై థ్రిల్లర్ ​ఓటీటీ స్ట్రీమింగ్​కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది.​

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ ఈ మూవీ డిజిటల్ రైట్స్​ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే బ్లాక్ బస్టర్ సినిమాను నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే 2026 జనవరి 30న ఈ ధురంధర్ మూవీ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ధురంధర్ ఓటీటీ రిలీజ్​పై అటు మూవీ మేకర్స్ కానీ, నెట్​ఫ్లిక్స్​ కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, ఈ మూవీ ఓటీటీ రిలీజ్​లో తెలుగు వెర్షన్ కూడా ఉండనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజమనేది విడుదల అయితేగానీ తెలియదు.

వసూళ్లు పెరిగే ఛాన్స్: మూడు రోజుల క్రితం భారత్​లో 'అవతార్​: ఫైర్​ అండ్​ యాస్'​ సినిమా థియేటర్లలో రిలీజ్​ అయినా ఈ మూవీ క్రేజ్​ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ధరంధర్ మూవీ బాకాఫీస్​పై తన ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. అవతార్​కు మిశ్రమ స్పందన దక్కడం ధురంధర్​కు అడ్వాంటేజ్ అవుతోంది! దీంతో క్రిస్మస్​, నూతన సంవత్సరం హాలీడేస్ వేళ ఈ మూవీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారీస్థాయిలో తారాగణం : జియో స్టూడియోస్​, బి62 స్టూడియోస్​ నేతృత్వంలో ఈ సినిమాను ఆదిత్య ధర్, లోకేష్​ ధర్​లు నిర్మించారు. శాశ్వత్​ సచ్​దేవ్​ సంగీతం అందించారు. వికాస్​ నౌలాఖా సినిమాటోగ్రఫీ, శివకుమార్​.వి పనికర్​ దీనికి ఎడిటింగ్ అందించారు. దీంట్లో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్​ ఖన్నా, టాలెంటెడ్ యాక్టర్ ఆర్​ మాధవన్​, అర్జున్​ రాంపాల్​, సంజయ్​ దత్​, సారా అర్జున్​, రాకేష్​ బేడీ, మానవ్​ గోహిల్​ భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించారు.

మూడో వీకెండ్​లోనూ డామినేషన్
కాగా, ఈ సినిమా మూడో వీకెండ్​ కూడా బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తూ డీసెంట్ వసూళ్లు సాధించింది. ధురంధర్ శనివారం రూ.34.25 కోట్లు వసూల్ చేయగా, ఆదివారం రూ.38.50 కోట్ల కలెక్షన్ రాబట్టింది. దీంతో వరల్డ్​వైడ్ ఓవరాల్ గ్రాస్ వసూళ్లు రూ.555.75 కోట్లకు చేరాయి.

రూ.1000 కోట్లు సాధ్యమేనా?
రానున్న వీకెండ్​లో పెద్ద సినిమాలేవీ రిలీజ్​కు లేకపోవడంతో ధురంధర్ హవా ఇంకొన్ని రోజులు సాగడం పక్కా! అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా రూ.1000 కోట్లు చేరుకుంటుందా? అని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ ఈ సినిమా వెయ్యి కోట్లు మార్క్ అందుకుంటే రణ్​వీర్ 15ఏళ్ల కెరీర్​లో ఇదే అత్యధికం అవుతుంది. ఆయన కెరీర్​లో ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పద్మావతి (రూ.585 కోట్లు) టాప్​లో ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది.

సినిమా విషయానికొస్తే ఇది వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించిన కథనం. దీంట్లో భారత్​- పాక్​ సరిహద్దు ఘర్షనలతోపాటు 2001 పార్లమెంట్​ దాడి, 26/11 ముంబయి దాడుల వంటివి దీంట్లో ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్​లోని క్రిమినల్ గ్యాంగ్‌ల స్థావరమైన కరాచీలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించడం చుట్టే ఈ సినిమా కథ నడుస్తుంది. అలాగే దీనిని ప్రస్తుత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ స్ఫూర్తితో రూపొందించినట్లు తెలుస్తుంది.

'ధురంధర్' దూకుడు- వసూళ్లలో హిందీ ఇండస్ట్రీ రికార్డు బ్రేక్- ఆ రికార్డు మాత్రం బన్నీదే!

'ఇలాంటి స్టోరీతో ఇప్పటిదాకా ఏ సినిమా రాలేదు'- 'ధురంధర్​'పై ఆర్జీవీ రివ్యూ