'తిరుమల గుడిలోకి చెప్పులతో వెళ్లే సీన్‌పై సెన్సార్ బోర్డుతో యుద్ధమే చేశా'- ఆర్జీవీ
సెన్సార్ బోర్డ్‌తో వైల్డ్‌గా గొడవ - తిరుమలలో దొంగతనం సీన్ కోసమే

Published : November 28, 2025 at 10:51 AM IST
Ram Gopal Varma Argument : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీ ఎవరైన ఉన్నారంటే కచ్చితంగా అందులో మొదటి పేరు రామ్‌గోపాల్ వర్మదే. ఆయన ఎప్పుడు ఏం ట్వీట్ చేస్తారో, ఎవరిపై ఎలాంటి కామెంట్ చేస్తారో ఎవరూ ఊహించలేరు. సమయం, సందర్భం ఏదైనా తన స్టైల్‌లో రిప్లై ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారతారు. తాజాగా 'రంగీల' రీ-రిలీజ్ ఇంటర్యూలో మాట్లాడిన అతను, 'గోవిందా గోవింద' సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అవేంటంటే!
CBFCతో మొదటి వివాదం ఎప్పుడు?
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్ ఊర్మిళా మటోండ్కర్ నటించిన 'రంగీలా' (1995), నవంబర్ 28, 2025న 4K నాణ్యతతో తిరిగి థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ ఇంటర్యూలో పాల్గొన్నారు. అందులో సెన్సార్ బోర్డుతో తనకు జరిగిన తొలి వివాదం గురించి యాంకర్ రామ్‌గోపాల్ వర్మను యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా 1994లో వచ్చిన 'గోవిందా గోవింద' సినిమా విషయంలో CBFCతో తనకు జరిగిన మొదటి వాగ్వాదం గురించి తెలిపారు.
వైల్డ్‌గా జరిగిన గొడవ
"నేను గోవిందా గోవింద అనే తెలుగు సినిమా తీశాను. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ గురించి. అక్కడ వారు ఆభరణాలను దొంగిలించడానికి ప్రయత్నించడం గురించి ఉంటుంది. అయితే గుడిలోకి దొంగలు బూట్లు ధరించి ఆలయంలోకి ఎలా వస్తారు అంటూ ప్రశ్నించారు. అదే విషయంపై సెన్సార్ బోర్డుతో తీవ్రమైన వాదనలు జరిగాయి" అని అన్నారు.
Here’s Aamir talking about RANGEELA re release on NOVEMBER 28 th https://t.co/pwRVpfdd2g pic.twitter.com/GnyYORYTHv
— Ram Gopal Varma (@RGVzoomin) November 26, 2025
తీసేయించేశారు
తాను అప్పట్లో దాని గురించి వివరించానని, అయినా సెన్సార్ బోర్డు వాళ్లు ఒప్పుకోలేదన్నారు. అలాంటి సన్నివేశాలన్నింటినీ సినిమా నుంచి తొలగించాలంటూ బలవంతం చేశారని వర్మ వెల్లడించారు. "దొంగలు వచ్చింది ఆలయాన్ని దోచుకోడానికి మాత్రమే. ఆ సమయంతో వారు బూట్లు ఎందుకు గుడి బయట వదిలేసి వస్తారు? దీనిపై చాలా సేపు అధికారులతో నాకు వాదన జరిగింది. కానీ వారు ఏ మాత్రం ఒప్పుకోలేదు. చివరికి ఈ సినిమాలో చాలా సీన్స్ కట్ చేసేలా చేశారు" అని రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు.
లీడ్ రోల్స్‌లో నాగార్జున, శ్రీదేవి
వైజయంతి మూవీస్ గోవిందా గోవింద సినిమాను నిర్మించింది. రామ్ గోపాల్ వర్మ- అక్కినేని నాగార్జున కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది. అంతకుముందు ఈ ఇద్దరూ శివ (1989), అంతం (1992) సినిమాలకు కలిసి పనిచేశారు. ఇక ఈ సినిమాలో ఇందులో నాగార్జున - శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. వారితో పాటు పరేశ్ రావల్, కోట శ్రీనివాసరావు, మాస్టర్ అనిల్ రాజ్ కూడా నటించారు. అరుణ్ గోవిల్ ఈ చిత్రంలో విష్ణువు పాత్రలో కనిపించారు. 1994లో విడుదలైన ఈ దోపిడీ చిత్రం బాక్సాఫీస్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో ది గ్రేట్ రాబరీ అనే పేరుతో డబ్ చేశారు.
దేశంలో ఒక్కరోజే దీపావళి, గాజాలో రోజూ దివాళీనే: రామ్ గోపాల్ వర్మ

