పెద్ది ప్రీమియర్ షోలు- పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
థియేటర్లలో పెద్దితో రామ్ చరణ్ సందడి- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్- టాక్ ఎలా ఉందంటే?

Published : June 3, 2026 at 11:06 PM IST
Peddi Public Talk : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ లేటెస్ట్ సినిమా పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో 3వ తేది రాత్రే ప్రీమియర్స్ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు పెద్ది గురించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. సినిమా బాగుందని, ముఖ్యంగా రామ్‌చరణ్ నటన అదిరిపోయిందని అంటున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులు షేర్ చేస్తున్నారు.
పెద్ది ప్రీమియర్స్‌తో మెగా ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. ఇక సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. చెర్రీ నటనలో మరో మెట్టు ఎక్కేశారని, ఈ సినిమా ఆయన కెరీర్లో ఇంకో మైలురాయి అని అంటున్నారు. తండ్రికి మించిన తనయుడిగా నటనలో జీవించేశారని కితాబిస్తున్నారు. రంగస్థలం సినిమాకు జాతీయ అవార్డు మిస్ అయినా, ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డు దక్కుతుందని కామెంట్ చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఎమోషనల్ సీన్స్ బాగా తెరకెక్కించారని కామెంట్ చేస్తున్నారు. పెద్ది ప్రీమియర్లలో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన థియేటర్లలో సందడి చేశారు. చెర్రీ ఎంట్రీ సీన్లో చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
#Peddi Show Start 🔥💥#PeddiPremiere #Vijayawada pic.twitter.com/KG1OivNIFm
— G0AT TFI (@G0ATTFI) June 3, 2026
What a wholesome video!! Upasana garu is throwing papers for RC’s entry 😭❤️#Peddi pic.twitter.com/VwpGh40YQ0
— Legend Prabhas Fan 🇮🇳 (@CanadaPrabhasFN) June 3, 2026
💗Song rampage @AlwaysRamCharan #peddi pic.twitter.com/PZCCrVKPdZ
— PEDDI JUN 04 (@TharunramV) June 3, 2026
గంట వ్యవధిలోనే 40 వేల టికెట్లు
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'పెద్ది' చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలకు నిదర్శనంగా బుక్‌మైషోలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కేవలం గంట వ్యవధిలోనే 40 వేలకు పైగా టికెట్లు విక్రయమైన నాలుగో తెలుగు సినిమాగా 'పెద్ది' నిలిచింది. 2023లో బుక్‌మైషో 'హవర్‌లీ ట్రెండింగ్' ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రాల జాబితాలో 'కల్కి 2898 AD', 'సలార్', 'పుష్ప 2' సరసన 'పెద్ది' చేరింది.
విదేశీ మార్కెట్‌లో విశేష ఆదరణ
మరోవైపు, విదేశీ మార్కెట్‌లోనూ ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రత్యంగిర సినిమాస్, హోంబలే ఫిల్మ్స్ సంయుక్తంగా విదేశాల్లో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. అనేక హాలీవుడ్, అంతర్జాతీయ చిత్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1,250కిపైగా లొకేషన్లలో 'పెద్ది' విడుదల కానుండటం విశేషం. ఉత్తర అమెరికా ప్రీమియర్ షో ప్రీ-సేల్స్ ఇప్పటికే 1.25 మిలియన్ డాలర్లను దాటినట్లు సమాచారం. అలాగే యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రీమియర్ ప్రదర్శనల కోసం 25 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఆస్ట్రేలియాతో పాటు ఇతర విదేశీ మార్కెట్లలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా కొనసాగుతున్నాయి.
కథేంటంటే
1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు ఉంటుంది. అక్కడ 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా ఆ ఊరికి గుర్తింపు ఉండదు. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలి నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది( రామ్ చరణ్ ) కూలీ పని చేస్తూ డబ్బుల కోసం క్రికెట్ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్‌లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్ అయిన పెద్ది ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. గౌర్నాయుడు(శివరాజ్‌కుమార్) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్ వరకు వెళ్తాడు. మరి నేషనల్ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను ఎందుకు వదుకోవాల్సి వచ్చింది? కుస్తీ, క్రికెట్‌తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పెద్ది రివ్యూ: ఆట కాదు పోరాటం- రామ్ చరణ్ మూవీ ఎలా ఉందంటే?
పెద్దిలో మూడు ఆటలు- తెలుగు ప్రేక్షకులకు కిక్ ఇచ్చిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలివే!

