ETV Bharat / entertainment

ఓవర్సీస్​లో 'పెద్ది' అంత మొత్తంలో రాబట్టాలా? అప్పుడే డీల్ ఫిక్స్ అయిందా?

రామ్ చరణ్ కెరీర్​లో ఆల్​ టైమ్ హై టార్గెట్- ఓవర్సీస్ మార్కెట్​లో పెద్ది వసూళ్లపై అందరి ఫోకస్

Ram Charan Setting Records
Ram Charan Setting Records (Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : February 10, 2026 at 7:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ram Charan Setting Records : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2026 ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు సహా టీమ్ మొత్తం ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత కీలకమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'చికిరి' పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. గతేడాది మిలియన్ల వ్యూస్‌తో రికార్డు స్థాయిలో ఆదరణ పొందిన ఈ పాట సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఇదిలా ఉండగా, రామ్ చరణ్ ఈ సినిమాతో తన కెరీర్‌లోనే కొత్త ఆల్‌టైమ్ హై టార్గెట్‌ను సెట్ చేసుకున్నట్లు సమాచారం. అదేంటంటే?

ప్రమోషన్ల్​కంటే ముందే భారీ హైప్​
'పెద్ది' థియేట్రికల్ డీల్స్ దాదాపు ఖరారైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ప్రమోషన్లు ప్రారంభం కాకముందే డిస్ట్రిబ్యూటర్లలో పాజిటివ్ బజ్ క్రియేట్ కావడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రానికి 100 శాతం సహకారం అందించేందుకు రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'పెద్ది'పై భారీ చర్చ కొనసాగుతోంది.

'పెద్ది' బ్రేక్​ ఈవెన్​ టార్గెట్​
ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్​ను సుమారు 7 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఇది రామ్ చరణ్ సోలో హీరోగా అత్యధిక లక్ష్యంగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అంతర్జాతీయంగా భారీ విజయాల్లో భాగమైన రామ్ చరణ్, ఈసారి మాత్రం తన సింగిల్​ పవర్‌తో ఈ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఇది ఆయన గ్లోబల్ క్రేజ్‌ను, అలానే బాక్సాఫీస్​ కలెక్షన్స్​పై ఉన్న డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

కొత్త బెంచ్​ మార్కును సెట్​ చేయనున్న పెద్ది
అయితే, ఇంత పెద్ద టార్గెట్ అంటే ఒత్తిడి కూడా అంతే స్థాయిలో ఉంటుంది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సినిమాకు పవర్‌ఫుల్ ఓపెనింగ్‌తో పాటు, నిలకడైన కలెక్షన్లు, పాజిటివ్ మౌత్ టాక్ కీలకంగా మారనున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే, కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, 'పెద్ది' ఓవర్సీస్ మార్కెట్‌లో రామ్ చరణ్‌కు కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విడుదలకు ముందు ఈ సినిమా ఎలా రూపుదిద్దుకుంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

ఏప్రిల్​ 30న థియేటర్లో గ్రాండ్​ రిలీజ్​
ఇదిలా ఉండగా, మార్చిలో అనుకున్న 'పెద్ది' సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఏప్రిల్ 30న గ్రాండ్​గా విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్​కు కొంత నిరాశ ఎదురైయినా, మార్చిలో పవన్​ చిత్రం విడుదల అవుతున్నందుకు జోష్​లో ఉన్నారు. అయితే నిర్మాణ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున 'పెద్ది' మరింత వాయిదా పడవచ్చని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్నే నిజం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు పెద్ది సినిమా పోస్ట్​పోన్​ను అధికారికంగా కన్ఫర్మ్ చేసేశారు. ఈ గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్స్ కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది.

ఇక సినిమా విషయానికొస్తే, రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.

సమ్మర్ రిలీజ్​లపై నో క్లారిటీ- 'ప్యారడైజ్', 'పెద్ది'​తో 'ఉస్తాద్ భగత్​సింగ్​'పై ఎఫెక్ట్!

మెగా ఫ్యామిలీలోకి వారుసుడొచ్చాడు- రామ్​చరణ్, ఉపాసన దంపతులకు కవలలు