ETV Bharat / entertainment

'జైలర్ 2' రిలీజ్​కు డేట్ ఫిక్స్- థియేటర్లకు వచ్చేది ఎప్పుడంటే?

రజనీకాంత్ జైలర్ 2 సినిమా నుంచి సాలిడ్ అప్డేట్- విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం

Jailer 2
Jailer 2 (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : July 2, 2026 at 6:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Jailer 2 Movie Release Date : సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్​కు కిక్కిచ్చే న్యూస్ బయటకు వచ్చింది. ఆయన లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమా విడుదల తేదీని మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను అక్టోబర్ 15న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను ఎక్స్​లో షేర్ చేసుకున్నారు. 'అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా జైలర్ 2 థియేటర్లలోకి రానుంది' అని పేర్కొన్నారు.

మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో ఆసక్తిగా ఉంది. తొలి భాగం క్లైమాక్స్​లో విగ్రహాల స్మగ్లర్ వర్మ చెప్పిన డైలాగ్​తో ఈ వీడియో ప్రారంభమైంది. 'నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు జైలర్. నా వెనక ఒక పెద్ద ప్రపంచం ఉంది. ఇది పెద్ద నెట్‌వర్క్‌, ఇందులోకి ఎప్పుడెప్పుడు, ఎవరెవరు వస్తారో నీకు తెలీదు. నీ జీవితం నరకం అవుతుంది' అని విలన్​ వర్మ, ముత్తువేల్ పాండియన్ (జైలర్​)తో చెబుతాడు. ఆ డైలాగ్​తో ఈ వీడియో షురూ అయ్యింది. ఇక సీక్వెల్​లోని సీన్స్​ను ఫ్లాష్ చేస్తూ వీడియోలో చూపించారు. చివర్లో 'అక్టోబర్ 15న వరల్డ్​వైడ్ రిలీజ్' అంటూ ముగుస్తుంది.

దసరా బరిలో
ఈ ఏడాది అక్టోబర్ 20న దసరా పండగ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది బాక్సాఫీస్ సీజన్​గా పేర్కొంటారు. సంక్రాంతి, దసరా సీజన్లలో బాక్సాఫీస్ పోటీ ఉంటుంది. సెలవుల సీజన్​ కూడా కావడంతో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, కలెక్షన్లు కూడా బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేకర్స్ దసరా సీజన్​ ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. అలాగే తెలుగు టాప్ హీరో నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని మాస్ యాక్షన్ సినిమా 'NBK 111' (వర్కింగ్ టైటిల్) కూడా దసరా సమయంలోనే థియేటర్లకు వస్తుందని ప్రచారంలో ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి విజువల్ వండర్ విశ్వంభర సైతం అక్టోబర్​లోనే రానుందని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే 2026 దసరాకు బాక్సాఫీస్ వద్ద సీనియర్లు పోటీతో థియేటర్లు కళకళలాడయం ఖాయం!

సినిమాలో హృతిక్ రోషన్!
కాగా, తొలి పార్ట్​లో కన్నడ స్టార్ శివకుమార్, మోహన్​లాల్ లాంటి పెద్ద నటుడు అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే సీక్వెల్​కు కూడా అదే విధానాన్ని కంటిన్యూ చేస్తూ మరికొందకు పెద్ద స్టార్లను నెల్సన్ ఈ సినిమాలో దింపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించినట్లు ప్రచారం జరుగుతోంది. రీసెంట్​గా ఆయన చెన్నైలో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. జైలర్ 2 షూటింగ్ కోసమే ఆయన చెన్నైకు వచ్చారని ఇన్​సైడ్ టాక్ వినిపించింది. కానీ దీనిపై మేకర్స్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే రిలీజ్​కు ఇంకా మూడు నెలల సమయం ఉంది. కాబట్టి ఇందులో నటించిన ఒక్కో స్టార్ పాత్రను ఒక్కో స్పెషల్ గ్లింప్స్​లాగా పరిచయం చేసే అవకాశం లేకపోలేదు!

కాగా, 2023లో బ్లాక్​బస్టర్​ జైలర్​కు ఇది సీక్వెల్​గా రానుంది. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ మాఫియా, యాక్షన్ డ్రామా జాన్రాలో తెరకెక్కించారు. ఇది రూ.500+ కోట్ల కలెక్షన్లు వసూల్ చేసింది. దీనికి సీక్వెల్​గా జైలర్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లు మేకర్స్ రీసెంట్​గానే ప్రకటించారు. తొలి భాగం ఎక్కడైతే పూర్తయ్యిందో అక్కడ్నుంచే ఈ సీక్వెల్ ప్రారంభం కానుంది. ఇందులో పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులు కనిపించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్​పై నిర్మించారు.

'మా నాన్న అభిమాని నన్ను కిడ్నాప్ చేయాలని ట్రై చేశాడు'- జేసన్ సంజయ్ కామెంట్స్

'నాకే కాదు, ఏ హీరోయిన్​కు కూడా వెనుక నుంచి ఫొటోలు తీయొద్దు- అవన్నీ బంద్ చేయండి'- ఫొటోగ్రాఫర్లపై స్టార్ హీరోయిన్ ఫైర్