'రాజాసాబ్‌కు రూ.100కోట్ల ఓపెనింగ్స్ పక్కా'- నార్త్ USలో అప్పుడే రూ.8.3 కోట్లు!
మరికొన్ని గంటల్లో రాజా సాబ్- అడ్వాన్ బుకింగ్స్ ద్వారా భారీ వసూళ్లు- ఓపెనింగ్స్‌పై మేకర్స్ ధీమా!

Published : January 8, 2026 at 12:29 PM IST
Rajasaab Openings Prediction : ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సినిమా ది రాజాసాబ్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2026 జనవరి 9న దేశవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. గురువారం రాత్రి ప్రీమియర్స్ కూడా ఉండనున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ అవ్వగా, ఫుల్ జోష్‌లో జరిగాయి.
అయితే రాజాసాబ్ మేకర్స్ బాక్సాఫీస్ వసూళ్లపై నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రమోషన్ల సందర్భంగా, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ 'ది రాజా సాబ్' చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు. దాటుతుందని నమ్మకంగా పేర్కొన్నారు. చిత్రంలోని చివరి 40 నిమిషాలు ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందిస్తాయని ఆయన తెలిపారు.
కేవలం ప్రీమియర్ల ద్వారానే
అదే సమయంలో, నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద విడుదల కాకముందే రాజాసాబ్ భారీ రికార్డులను సృష్టిస్తోంది. కేవలం ప్రీమియర్ల ద్వారానే మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.3 కోట్లు) వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అయితే రాజాసాబ్ మిలియన్ డాలర్లను కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వసూలు చేయడం విశేషం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, మొదటి రోజు భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది. నార్త్ అమెరికాలో దాదాపు 1,400 పైగా షోలతో భారీ స్థాయిలో విడుదలవుతుందని వార్తలు బయటికి వస్తున్నాయి.
ఇక రాజాసాబ్ విషయానికొస్తే, హారర్ కామెడీ ఫాంటసీ ఎంటర్టైనర్గా మారుతి తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. వారితోపాటు మరికొందరు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్ అందించారు.
ఇక ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న రాజాసాబ్ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ హీరో విజయ్ చిత్రం జన నాయగన్ కూడా రాజా సాబ్తోపాటే విడుదల కావాల్సి ఉంది. దీంతో ఈ రెండు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటి ఉంటుందేమో అనే అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ జన నాయగన్ సినిమా వాయిదా పడటంతో రాజాసాబ్‌కు లైన్ క్లియర్ అయ్యిందనే చెప్పవచ్చు. దీనివల్ల మరిన్ని థియేటర్లు, స్క్రీన్లు ఈ సినిమాకు దక్కాయి.
2026 రానున్న ప్రభాస్ సినిమాలు!
ఇదిలా ఉండగా 2026లో డార్లింగ్ మూవీస్ వరుసగా ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న చిత్రం 'ఫౌజీ'. ఇది పిరియాడిక్ యాక్షన్ థిల్లర్‌గా తెరకెక్కనుంది. దీంట్లో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా 2026లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా, హీరో ప్రభాస్ కాంబోలో రూపొందుతున్న మరోచిత్రం 'స్పిరిట్'. ఈ మూవీలో డార్లింగ్ పోలీస్ పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. హీరోయిన్గా త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు.
ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సలార్'. ఫుల్ యాక్షన్‌తో సాగే ఈ సినిమా ఓ లెవెల్లో హైప్ సంపాదించుకుంది. అయితే దీని సిక్వెల్ 2026 చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా థియేటర్లోకి అడుగుపెట్టిన ఆ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తామని మూవీ టీమ్ ఇంతకు ముందే ప్రకటించింది.
డార్లింగ్ ఫ్యాన్స్ గెట్‌రెడీ- హైదరాబాద్‌లోనే 'రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్

