డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్- 'రాజాసాబ్' ఓల్డ్ మ్యాన్ సీన్స్ వచ్చేస్తున్నాయోచ్!
సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ 'రాజా సాబ్'- సోషల్ మీడియాలో 'ఓల్డ్ మ్యాన్ లుక్' పై పెద్ద చర్చ- గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మాత

Published : January 10, 2026 at 3:43 PM IST
|Updated : January 10, 2026 at 4:38 PM IST
Rajasaab Prabhas Old Look : పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన 'ది రాజా సాబ్' సంక్రాంతి సందడిని మొదలుపెట్టింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ప్రమోషన్లలో చూపించిన స్పెషల్ లుక్ సినిమాలో మిస్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. రిలీజ్‌కు ముందు ఫుల్ హైప్ తీసుకొచ్చిన ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్ సినిమాలో లేకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యారు. దీనిపై నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
సినిమాలో ఆ లుక్ మిస్ అవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎట్టకేలకు స్పందించారు. రీసెంట్గా జరిగిన ప్రెస్మీట్లో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రభాస్‌కు సంబంధించిన దాదాపు నాలుగు నిమిషాల నిడివి గల 'ఓల్డ్ అవతార్' సీన్లు సర్వర్ సమస్యల కారణంగా మొదట అప్ లోడ్ చేయలేకపోయామని ఆయన వివరించారు. టెక్నికల్ ఇష్యూస్ వల్లే ఆ కీలకమైన భాగాన్ని థియేట్రికల్ వెర్షన్లో చేర్చలేకపోయామని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!
అయితే మిస్ అయిన ఓల్డ్ మ్యాన్ లుక్కు సంబంధించిన సీన్స్ ఇకపై యాడ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫుటేజ్ థియేటర్లకు పంపినట్లు వివరించారు. అయితే సినిమా ఓవరాల్ రన్‌టైమ్ మారకుండా పలు సీన్లను ట్రిమ్ చేసి ఎక్స్ట్రా పుటేజ్‌ను టాడ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ కొత్త సీన్లు ఇవావ ఫస్ట్ షో లేదా సెకండ్ షో నుంచి అందుబాటులో ఉంటాయని అన్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
THE ONE YOU ALL HAVE BEEN WAITING FOR 🔥🔥
— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026
OLD GETUP SEQUENCE is finally adding from today’s evening shows onwards 🤙🏻🤙🏻#TheRajaSaab#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/aOz3n9XsqE
రియల్ శ్వాగ్ చూస్తారు : మారుతి
ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు సినిమా సెకండ్ హాఫ్‌ను మరింత షార్ప్ చేసి ఆ మిస్సింగ్ ఓల్డ్ మ్యాన్ లుక్కు సంబంధించిన సీన్స్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటల షో నుంచి యాడ్ చేస్తున్నట్లు దర్శకుడు మారుతి స్పష్టం చేశారు. ముఖ్యంగా రూఫ్‌పై జరిగే సుమారు 8 నుంచి 9 నిమిషాల నిడివి గల ఒక అదిరిపోయే ఫైట్ ఎపిసోడ్‌ను ఇప్పుడు సినిమాలో చూడవచ్చని ఆయన తెలిపారు. ఈ అదనపు ఫుటేజ్‌తో అభిమానులు కచ్చితంగా సంతృప్తి చెందుతారని, రియల్ 'రాజాసాబ్' శ్వాగ్ను వెండితెరపై ఎంజాయ్ చేయవచ్చని మారుతి పేర్కొన్నారు.
ఆ లుక్ వెనుక పెద్ద హైపే ఉంది
సినిమా రిలీజ్‌కు ముందు మేకర్స్ వదిలిన పోస్టర్లు, టీజర్లు సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన ఓల్డ్ మ్యాన్ ఉన్న పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ గెటప్‌లో ప్రభాస్ లుక్ చాలా ఇంటెన్సిటీగా ఉండటంతో సినిమాలో ఆ క్యారెక్టర్ హై రేంజ్లో ఉంటుందని అందరూ ఊహించారు. ట్రైలర్లో కూడా ఆ లుక్‌ను కొంత హైలైట్ చేయడంతో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరిగింది. తీరా థియేటర్లలో సినిమా చూశాక ఆ లుక్ ఎక్కడా కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
From Nizam to Overseas,#TheRajaSaab takes control of the box office with a full on rampage 💪🏼🔥
— The RajaSaab (@rajasaabmovie) January 9, 2026
Book your tickets now and have a blasting experience ❤️
— https://t.co/GywlMDvZ6P…#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/qnmdLSYNMm
డే 1 రూ.112 కోట్లు
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలను మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. రాజాసాబ్ వరల్డ్‌వైడ్‌గా తొలి రోజు రూ.112 కోట్లు (ప్రీమియర్స్‌తో కలిపి) వసూల్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ హార్రర్ ఫాంటసీ ఫిల్మ్‌కు ఇంత భారీ రేంజ్లో ఓపెనింగ్స్ దక్కడం ఇదే తొలిసారి అని మేకర్స్ పేర్కొన్నారు.
'రాజాసాబ్'లో ఆ లుక్ మిస్సింగ్- మేకర్స్ డెసిషన్‌తో ఫ్యాన్స్ డిసప్పాయింట్

