'ప్యారడైజ్'లో మరో విలన్!- మోస్ట్ వైలెంట్‌గా 'ఛోటా మాలిక్'- జడల్తో యాక్షన్ సీన్స్‌కు విజిల్స్ పక్కా!
'ప్యారడైజ్' నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో గ్లింప్స్ రిలీజైన - పవర్ఫుల్ పాత్రలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్- వేరే లెవెల్ ఎలివేషన్ బాస్!

Published : June 20, 2026 at 1:09 PM IST
Raghav Juyal As Vikram Maalik in Paradise : ప్యారడైజ్ చిత్రంలోని ఒక్కొక్క పాత్రల పరిచయం గురించి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. చిత్ర కథా ప్రపంచాన్ని, పాత్ర తీరును వీడియో గ్లింప్స్ రూపంలో చాలా క్లారిటీగా చెప్పారు. సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న నానిని జడల్‌గా, మోహన్‌బాబును శికంజ మాలిక్‌గా పరిచయం చేశారు. ఈ క్రమంలో తాజాగా మరొక నటుడి పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ వీడియో రిలీజ్ చేశారు. నాని, మోహన్ బాబు పాత్రలకు ఏ మాత్రం తగ్గకుండా ఆ రేంజ్‌లోనే విక్రమ్ మాలిక్ అనే ఓ నెగిటివ్ రోల్‌ను రిలీజ్ చేశారు.
మోస్ట్ డెంజరస్గా
బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన విక్రమ్ మాలిక్ అనే శక్తిమంతమైన పాత్రలో అలరించనున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదల చేశారు. అందులో ఆయన పాత్ర మోస్ట్ వైలెంట్‌గా ఉంది. మెడలో భారీగా బంగారం గొలుసులను ధరించి, అందులో దున్నపోతు ఆకారం గల ఒక లాకెట్‌ను వెనక్కి తిప్పుతూ చూపించిన సీన్స్ ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. అంతేకాకుండా మాలిక్ పాత్రకు బ్యాగ్రౌండ్లో తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో ఎలివేషన్ ఇవ్వడం హైలైట్‌గా ఉంది. 'ఇప్పుడు ఎవడొస్తున్నడో ఎర్కేనా? ఖాందాన్ కా షాన్- దోస్తోంకా కా జాన్ విక్రమ్ మాలిక్‌కు స్వాగతం - సుస్వాగతం' అంటూ ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంది.
ఈ డైలాగ్ కంప్లీట్ అవ్వగానే ఆయన ఫుల్ ఫైర్‌లో కారులోంచి దిగిన శ్వాగ్ ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో ఈ సీన్లో నానిని చూపించారు. 'వెల్కమ్ టు జడల్ జమానా' అంటూ నాని చెప్పిన డైలాగ్‌తో గ్లింప్స్ ముగుస్తుంది. అయితే గ్లింప్స్‌ను సరిగ్గా గమనిస్తే, బీజీఎమ్‌లో 'ఛోటా మాలిక్' అంటూ వినిపిస్తోంది. అంటే శఖంజ మాలిక్ కొడుకు విక్రమ్ మాలిక్ అన్నమాట!ఇక ఓవరాల్‌గా రాఘవ్ పాత్ర ఇందులో ఎంత వైలెంట్‌గా ఉంటుందో క్లూ ఇచ్చారన్నమాట!
స్క్రీన్‌పై విధ్వంసమే
చివర్లో నాని చెప్పే డైలాగ్ సినిమా అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పటి వరకు జడల్- శిఖంజ మాలిక్‌ల మధ్యే అసలైన వార్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు విక్రమ్ మాలిక్ క్యారెక్టర్‌ను పరిచయంతో నెగిటివ్ రోల్స్ ఇంకా ఉన్నాయని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పకనే చెప్పారు. దీంతో తెరపై జడల్ శిఖంజ మాలిక్‌తోపాటు ఛోటా మాలిక్ మధ్య జరగబోయే పోరు కూడా సినిమాపై ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ప్యారడైజ్ చిత్రంలో నాని మునుపెన్నడూ పోషించని మాస్ అవతారంలో అభిమానులను అలరించనున్నారు. ఇప్పటికే దీని నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ యావత్ సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. అదే విధంగా శికంజ మాలిక్‌గా డైలాగ్ కింగ్ మోహన్‌బాబు వెండితెరపై విధ్వంసాన్ని సృష్టించనున్నారని ఇప్పటికే విడుదల చేసిన వీడియో గ్లింప్స్ ద్వారా స్పష్టత వచ్చింది.
అందుకే ఆలస్యం!
ఈ సినిమా ఔట్పుట్ విషయంలో డైరెక్టర్ శ్రీకాంత్ అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. కాస్త ఆలస్యం అయినా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించాలన్న టార్గెట్‌తోనే పని చేస్తున్నారు. చిన్న సన్నివేశమైనా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా నాని సంబంధించిన సీన్స్‌కు సంబంధించి మునుపెన్నడూ చూడని లుక్‌లో ఇందులో చూపిస్తున్నారు. అంతేకాకుండా పాన్ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నందున నార్త్ ఆడియెన్స్‌ను కూడా మెప్పించేలా కంటెంట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
అదే స్థాయిలో యాక్షన్ సీన్స్, నాని లుక్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ పక్కాగా కుదరాలి. అందుకే ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికైతే మూవీ టీమ్ సినిమాను వీలైనంత త్వరగానే కంప్లీట్ చేసేలా టార్గెట్ పెట్టుకుంది. మరి చెప్పిన తేదీన సినిమా రిలీజ్ అవుతుందా? లేదంటే మరోసారి వాయిదా పడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో కయాదు లోహర్ నటిస్తుండగా, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది.
నాని ప్యారడైజ్ మళ్లీ వాయిదా!- ఈసారి OTT డీల్‌పై ఎఫెక్ట్!- సినీ వర్గాల్లో కొత్త ప్రచారం
నాని 'ప్యారడైజ్' వాయిదా- కొత్త రిలీజ్ డేట్ ఇదే- అఫీషియల్ అనౌన్స్మెంట్

