గ్లోబ్‌ట్రాటర్ అప్డేట్లు- ఇక మిగిలింది 'బాబు' పోస్టరే
SSMB రెండు రోజుల్లోనే ఈవెంట్- ఈలోగా పోస్టర్ల అప్డేట్లు- ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్న మేకర్స్

Published : November 13, 2025 at 9:40 AM IST
|Updated : November 13, 2025 at 10:45 AM IST
Globe Trotter Mahesh Babu : సినీ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడచూసినా గ్లోబ్‌ట్రాటర్ పేరే వినిపిస్తుంది. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇందుక్కారణం ఈనెల 15న ఈ చిత్రం ఈవెంట్ జరగనుండమే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇందుకు వేదిక కానుంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రల ఫస్ట్ లుక్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే ఇందులో నెగిటివ్ రోల్లో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్టర్ రిలీజ్ చేయగా, తాజాగా ఫీమేల్ లీడ్ చేస్తున్న ప్రియాంక చోప్రా పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ అదిరిందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి పోస్టర్లు వచ్చేశాయి. ఇక మిగిలింది హీరో మహేశ్ బాబు ఫస్ట్ లుక్ మాత్రమే. రిలీజైన ఈ రెండు పోస్టర్లు బాగానే ఉన్నా, అభిమానుల ఎదురుచూపులన్నీ మహేశ్ లుక్ కోసమే. దీంతో ఎప్పుడెప్పుడు మహేశ్ పోస్టర్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.
And now she arrives…
— Mahesh Babu (@urstrulyMahesh) November 12, 2025
Meet MANDAKINI 💥💥💥@priyankachopra#GlobeTrotter @ssrajamouli @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts @SBbySSK @thetrilight @tseries pic.twitter.com/8XhqsdFL1R
అయితే ఇందుకు ఎక్కువ సమయం పట్టదు. రెండు రోజుల్లో ఈవెంట్ ఉంది. దాదాపు అదే ఈవెంట్లో మహేశ్ లుక్ రివీల్ చేయడం పక్కా! కానీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ట్రీట్‌గా అంతకుముందే అంటే ఇవాళ, రేపు ఈ మధ్యలోనే పోస్టర్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఫ్యాన్స్‌కు ఇలాంటి సర్ప్రైజ్లు ఇవ్వడం జక్కన్నకు కొత్తేం కాదు. మరి, మహేశ్ పోస్టర్ ఈవెంట్ కంటే ముందే ఇచ్చేస్తారా? లేదంటే ఈవెంట్లోనే రివీల్ చేస్తారా అనేది చూడాలి! ఎలాగైనా ఈ రెండు రోజుల్లోనే సూపర్ స్టార్ పోస్టర్ రావడం మాత్రం పక్కా. దీంతో అభిమానులు ఫుల్ ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు.
మందాకిని పోస్టర్
ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా మందాకిని పాత్రలో సందడి చేయబోతోంది. ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంక పసుపు రంగు చీరలో, గన్ ఎక్కు పెట్టినట్లు కనిపిస్తుంది. అలాగే ఆమె వైపునకు కూడా తూటాలు దూసుకొస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ సెట్ కనిపిస్తుంది. మొత్తానికి రాజమౌళి ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమైపోయింది. ఇక ప్రియాంక పోస్టర్ రిలీజ్ చేస్తూ రాజమౌళి, ప్రపంచ వేదికపై భారతీయ సినిమాని పునర్నిర్వచించిన మహిళ, మన దేశీ అమ్మాయి అంటూ ప్రియాంకకు స్వాగతం పలికారు, అలాగే మందాకిని పాత్రలో లెక్కలేనన్ని ఛాయలు ఉంటాయని అన్నారు.
Stood on the other side…
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2025
time to meet you head-on KUMBHA… @PrithviOfficial#GlobeTrotter@ssrajamouli @priyankachopra @mmkeeravaani @SriDurgaArts @SBbySSK pic.twitter.com/29TS5G4pDY
పవర్ఫుల్ కుంభ
బాహుబలి నుంచి రాజమౌళి విలన్ పంథా మార్చేశారు. ఇదివరకులా విలన్ అంటే కండలు తిరిగే బాడీ కాకుండా, బుద్ధి బలంతో హీరోను దెబ్బకొట్టగలిగే విలన్ పాత్రలు రాస్తున్నారు. ఇందులోనూ అలాగే విలన్ పాత్రను డిజైన్ చేశారు. ఇటీవల నెగిటివ్ రోల్లో చెస్తున్న పృథ్వీరాజ్ పోస్టర్ చూస్తే అది తెలిసిపోతుంది. రెండు చేతులు సరిగ్గా లేని దివ్యాంగుడిగా కనిపించిన పృథ్వీ వీల్‌చైర్‌లో కూర్చొని ఉన్నాడు. ఈ వీల్ చైర్ పోస్టర్ బాగానే హైలెట్ అయ్యింది. వీల్ చైర్‌కు టెక్నాలజీతో కూడిన చేతులు ఉండడం కిక్ ఇచ్చింది. కేవలం తన మైండ్ పవర్‌తో, తన కమాండింగ్ ప్రెజెన్స్‌తోనే భయాన్ని పుట్టిస్తాడని అంటున్నారు.
'బిజ్జలదేవ నుంచి కుంభ దాకా'- టాలీవుడ్లో కొత్త ట్రెండ్- ఈ విలన్లు మోస్ట్ పవర్ఫుల్ బాబోయ్!

