'ఇలా జరుగుతుందని నాకు రెండేళ్ల కిందటే తెలుసు'- విజయ్ పాలిటిక్స్‌పై ప్రముఖ నటుడు!
విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్ - ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరికొంత కాలం పట్టే అవకాశం

Published : May 7, 2026 at 1:37 PM IST
Prakash Raj Comments On Thalapathy Vijay : ప్రతిక్షణం మారుతున్న తమిళ రాజకీయాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిణామాలపై నటుడు ప్రకాశ్ రాజ్ పోస్ట్ పెట్టారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విజయ్‌కు ప్రజల అండ ఉందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునే హక్కు ఆయనకు ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విజయ్ గవర్నర్‌ను కలిసి తనకున్న ఎమ్మెల్యేల మద్దతును వివరించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రకాశ్ రాజ్ తన పోస్ట్‌తో మద్దతు తెలిపారు.
మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నాలు
మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వెలువడిన తమిళనాడు ఫలితాల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. ఈలోపు ఏం జరుగుతుందా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కమల్‌హాసన్ కూడా విజయ్‌కు సపోర్ట్‌గా నిలిచారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది మునుపెన్నడూ లేని అసాధారణ, చరిత్రాత్మక ఫలితమని కమల్ అన్నారు. టీవీకే ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం సామాన్యమైన విషయం కాదని పేర్కొన్నారు.
This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ
— Prakash Raj (@prakashraaj) May 7, 2026
నాకు ముందే తెలుసు
విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుంది. దీనిపై నటుడు శ్యామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని తనకు ముందే తెలుసంటూ నటుడు శ్యామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ విజయాన్ని తాను రెండేళ్ల క్రితమే ఊహించానంటూ చెప్పుకొచ్చారు.
రాజకీయ సింహాసనం దళపతికే
'వారసుడు' సినిమాలో విజయ్ సోదరుడి పాత్రలో అలరించిన శ్యామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. విజయ్ వెనక దైవశక్తి ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు."నిజం చెప్పాలంటే, విజయ్ గెలుపును నేను 2024లోనే ఊహించాను. ఒక రోజు ఉదయం ఆయనకు ఫోన్ చేసి 'అన్నా మీరు ముఖ్యమంత్రి అయినట్లు, ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తున్నట్లు నాకు కల వచ్చింది' అని చెప్పాను. ఇటీవల మే 3న కూడా 'నా కల నిజం కాబోతోంది' అని ఆయనకు మెసేజ్ చేశాను. నా ఆలోచనలు రాత్రికి రాత్రే వచ్చినవి కాదు. ఆయనను దైవ శక్తి నడిపిస్తోందని నేను నమ్ముతున్నా. ఆ రాజకీయ సింహాసనం ఆయనకే చెందుతుందని నాకు నమ్మకం ఉంది. విజయ్ స్థానంలో ఎవరున్నా సినిమా కెరీర్‌ను వదులుకుని ఇలా వచ్చేవారు కాదు" అని శ్యామ్ అన్నారు.
தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது.
— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026
என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…
నిజాయతీకి విజయ్ మారు పేరు
విజయ్‌తో తనకున్న అనుబంధం గురించి శ్యామ్ ఇలా షేర్ చేసుకున్నారు." విజయ్ అన్న ఎంతో నిబద్ధత గల వ్యక్తి. నిజాయితీకి మారు పేరు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి అభిమానులే కారణమని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఆ ప్రేమను తిరిగి ఇవ్వడానికే తాను ఏదైనా చేయాలనుకుంటున్నట్లు ఎన్నోసార్లు చెప్పారు. ఒకసారి నేను 'మీరు ఇంతటి స్టార్ అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా?' అని అడిగితే, 'నేను హీరో అయితే చాలు అనుకొని వచ్చాను. ఇంతటి ప్రేమాభిమానాలు పొందుతానని అనుకోలేదు' అని అన్న చెప్పారు" అని శ్యామ్ అన్నారు.
ఖుషిలో చిన్న పాత్రతో అరంగేట్రం చేసిన శ్యామ్ 12బీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో 'కిక్', 'కిక్ 2', 'రేసుగుర్రం' సినిమాలతో ప్రేక్షకులని అలరించారు. ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం'తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
తమిళనాడులో విజయ్ 'విజిల్ మోత'- సినిమాల్లోనే కాదు పాలిటిక్స్‌లోనూ సూపర్ హిట్
తమిళనాడు ఎన్నికలు: రెండు చోట్ల దళపతి విజయ్ పోటీ- TVK అభ్యర్థుల జాబితా విడుదల

