ప్రభాస్ ట్రిపుల్ ధమాకా- ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్‌కు ప్లాన్!
ఒకే ఏడాదిలో మూడు భారీ సినిమాలు రిలీజ్ చేయనున్న ప్రభాస్ - ఈ ఏడాది డిసెంబర్ నాటికి థియేటర్లలోకి రానున్న ఫౌజీ - స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా రెబల్ స్టార్ రికార్డ్

Published : June 17, 2026 at 12:55 PM IST
Prabhas Upcoming Movies Lineup : పాన్ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యంత బిజీ హీరోగా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ గ్లోబల్ స్టార్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మరో ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం, అంతా అనుకున్నట్లు జరిగితే ఒక ఏడాది వ్యవధిలో ప్రభాస్ నటించిన మూడు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో నుంచి ఇంత తక్కువ గ్యాప్‌లో ఇన్ని పాన్ఇండియా సినిమాలు రావడం టాలీవుడ్‌లో చాలా అరుదు.
ఈ ఏడాదే ఫౌజీ
ఈ లైనప్‌లో ముందుగా రాబోయే సినిమా ఫౌజీ. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్రేక్స్ లేకుండా జరుగుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం 1940 నాటి కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ నాటికి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ టీజర్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది.
पद्मव्यूह विजयी पार्थः
— Hanu Raghavapudi (@hanurpudi) October 23, 2025
पाण्डवपक्षे संस्थित कर्णः।
गुरुविरहितः एकलव्यः
जन्मनैव च योद्धा एषः॥
Happy Birthday to our dearest #Prabhas garu ❤️🔥
Taking pride in presenting you as #FAUZI, this journey so far has been unforgettable and only promises to get bigger from here!
FAUZI -… pic.twitter.com/uLHVBEH7ib
మార్చిలో రాబోతున్న మోస్ట్ వైలెంట్ స్పిరిట్
ఫౌజీ తర్వాత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ స్పిరిట్ కూడా లైనప్‌లో రెడీగా ఉంది. అర్జున్ రెడ్డి, యానిమాల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వాయిదాలు లేకుండా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందట. త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్ లాంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
డిసెంబర్‌కు కల్కి సెకండ్ పార్ట్
ఈ మూడు సినిమాల లైనప్‌లో చివరిగా రాబోయే మరో బిగ్ సినిమా కల్కి 2. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక దానికి కొనసాగింపుగా వస్తున్న సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ 2027 డిసెంబర్ నెలలో కల్కి 2 థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ వస్తోంది. అదే జరిగితే ప్రభాస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ ట్రీట్ దొరికినట్లే.
ఇది మామూలు రికార్డ్ కాదు
ఒకవేళ ఈ షెడ్యూల్ అంతా పక్కాగా వర్కవుట్ అయితే ఈ రోజుల్లో మరో రికార్డ్ అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఒక్కో సినిమా పూర్తి చేయడానికి ఏళ్ల తరబడి టైమ్ తీసుకుంటున్నారు. అలాంటిది పన్నెండు నెలల గ్యాప్‌లోనే మూడు భారీ పాన్ఇండియా ప్రాజెక్టులను విడుదల చేయడం మామూలు విషయం కాదు. ఇలాంటి రికార్డ్ సెట్ చేయడం ద్వారా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ తన స్టామినాను మార్కెట్ సత్తాను మరోసారి దేశం మొత్తం తెలిసేలా నిరూపించుకోనున్నారు.
రెబల్ స్టార్ అభిమానులకు మాత్రం ఈ లైనప్ ఒక బిగ్గెస్ట్ ట్రీట్ లాంటిది. ఎందుకంటే ఒక్కో సినిమా ఒక్కో జోనర్లో రాబోతోంది. యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండనున్నాయి. ఈ మూడు సినిమాల బిజినెస్ ద్వారా ప్రభాస్ 5 వేల కోట్ల మార్క్‌ను టచ్ చేసే అవకాశం కూడా ఉంది. దీంతో టాలీవుడ్ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి ఏ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
కల్కి సీక్వెల్లో సాయి పల్లవి, ఆలియా భట్- అసలు నిజమెంత?
స్పిరిట్ షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ప్రభాస్ కూడా పాల్గొంటున్నారా?

