కలెక్షన్స్‌లో 'రాజాసాబ్' రికార్డ్- హార్రర్ ఫాంటసీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇవే!
థియేయటర్లలో 'రాజాసాబ్' సందడి- తొలి రోజు వసూళ్ల లెక్కలు వెల్లడించిన మేకర్స్- వరల్డ్‌వైడ్‌గా ఎన్ని కోట్లంటే?

Published : January 10, 2026 at 2:43 PM IST
Rajasaab Day 1 Collections : రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. మారుతి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న రిలీజై హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రాజాసాబ్ వరల్డ్‌వైడ్‌గా తొలి రోజు రూ.112 కోట్లు (ప్రీమియర్స్‌తో కలిపి) వసూల్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ హార్రర్ ఫాంటసీ ఫిల్మ్‌కు ఇంత భారీ రేంజ్లో ఓపెనింగ్స్ దక్కడం ఇదే తొలిసారి అని మేకర్స్ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వివరాలిలా
ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి రూ.11+కోట్లు కలెక్షన్లు రాబట్టింది. శుక్రవారం రోజు అన్ని షోలు కలిపి మరో రూ.63.9 కోట్లు వసూలు చేసింది. రాష్ట్రాల వారీగా చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా రూ. 57.6కోట్లు, తమిళనాడులో రూ. 1.56 కోట్లు, కర్ణాటకలో రూ. 8.08 కోట్లు, కేరళలో రూ.0.15 కోట్లు, ఇక మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలపి రూ.7.51కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక నుంచి సంక్రాంతి సెలవులు, ఉద్యోగులకు వీకెండ్ కావడంతో కలెక్షన్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ వీకెండ్లోనే రూ.200 కోట్ల మార్క్ అందుకునే ఛాన్స్ ఉందని ట్రైడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
A new benchmark has been set with KING SIZE BOX OFFICE domination across every fort 🔥🔥#TheRajaSaab 𝐃𝐚𝐲 𝟏 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐬𝐭𝐚𝐧𝐝𝐬 𝐚𝐭 𝟏𝟏𝟐𝐂𝐫+ 💥
— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026
Biggest start ever for a horror fantasy film ❤️🔥#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi… pic.twitter.com/vonsA0Nj53
ఆ సీన్స్ యాడింగ్
సినిమాలో ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ మిస్ అవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో మేకర్స్ అలర్ట్ అయ్యారు. ఆ 'ఓల్డ్ అవతార్' సీన్లు సర్వర్ సమస్యల కారణంగా అప్లోడ్ చేయలేకపోయామని వివరించిన మేకర్స్, ఇవాళ్టి నుంచి ఆ సీన్స్‌ను యాడ్ చేయనున్నట్లు చెప్పరు. అదనంగా 8 నిమిషాల నిడివి గల ఒక అదిరిపోయే ఫైట్ ఎపిసోడ్‌ను సినిమాలో యాడ్ చేశామని చెప్పారు. ఈ అదనపు ఫుటేజ్‌తో అభిమానులు కచ్చితంగా సంతృప్తి చెందుతారని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ప్రభాస్‌కు ఐదోసారి
తొలి రోజు వసూళ్లతో ప్రభాస్ తన కెరీర్లో అరుదైన ఘనత సాధించారు. ఇప్పటిదాకా తొలి రేజే రూ.100 కోట్లు మార్క్ అందుకోవడం ఆయన కెరీర్లో ఇది ఐదోసారి. ఇదివరకు బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్ పార్ట్ 1, కల్కి- 1 సినిమాలు తొలి రోజే వరల్డ్‌వైడ్‌గా రూ.100+ కోట్లు (గ్రాస్) వసూల్ సాధించాయి. అలాగే వరుసగా నాలుగోసారి ప్రభాస్ రూ.100 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్నారు. టాలీవుడ్లో మరే ఇతర హీరోకు కూడా ఐదు రూ.100 కోట్ల ఓపెనింగ్ సినిమాలు లేవు.
From Nizam to Overseas,#TheRajaSaab takes control of the box office with a full on rampage 💪🏼🔥
— The RajaSaab (@rajasaabmovie) January 9, 2026
Book your tickets now and have a blasting experience ❤️
— https://t.co/GywlMDvZ6P…#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/qnmdLSYNMm
కాగా, డైరెక్టర్ మారుతి ఈ సినిమాను హార్రర్ ఫాంటసీగా తెరకెక్కించారు. ఇందులో మాళవికా మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ సీనియర్ నటులు బొమన్ ఇరానీ, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్- 'రాజాసాబ్' ఓల్డ్ మ్యాన్ సీన్స్ వచ్చేస్తున్నాయోచ్!
'రాజాసాబ్'లో ఆ లుక్ మిస్సింగ్- మేకర్స్ డెసిషన్‌తో ఫ్యాన్స్ డిసప్పాయింట్

