ETV Bharat / entertainment

రాజాసాబ్ 'యువరాజే' సాంగ్ రిలీజ్ - ఫ్యాన్స్​కు ప్రభాస్ వరుస సర్​ప్రైజ్​లు

ఫ్యాన్స్ కొత్త సంవత్సరం సంబురాలను రెట్టింపు చేసిన రెబల్ స్టార్ ప్రభాస్- 'రాజాసాబ్' మూవీ నుంచి యువరాజే సాంగ్ రిలీజ్

Audio song from The Raja Saab
Audio song from The Raja Saab (movie poster)
author img

By ETV Bharat Telugu Team

Published : January 1, 2026 at 10:03 AM IST

3 Min Read
Choose ETV Bharat

Audio song from The Raja Saab: నూతన సంవత్సరం వేళ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​లు ఇస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రాజాసాబ్' మూవీ నుంచి మరోసాంగ్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'రాజే యువరాజే' అంటూ సాగే ఈమెలోడిని న్యూఇయర్ స్పెషల్​గా విడుదల చేశారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన స్పిరిట్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ రెండు సర్​ప్రైజ్​లతో ఫ్యాన్స్ కొత్త సంవత్సరం సంబురాలను ప్రభాస్ రెట్టింపు చేశారు.

ఈ సాంగ్​కు​ క్రిష్టకాంత్​ లిరిక్స్​ రాయగా, అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన పాడారు. సాంగ్​ మొత్తం ఫుల్​ మెలోడియస్​గా సాగుతుంది. కాగా ఈ సినిమాకు మ్యూజిక్​ డైరెక్టర్ ఎస్​ఎస్​ తమన్​​ సంగీతం అందించారు.

నటీనటులు: ఈ చిత్రాన్ని పీపుల్​ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్స్​పై టీజీ విశ్వప్రసాద్​, ఇషాన్​ సక్సేనా నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్​ను వింటేజ్ లుక్​లో ప్రేక్షకులు చూడనున్నారు.

ప్రమోషన్ల స్పీడ్​: ఇటీవల హైదరాబాద్​లో ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తన స్పీచ్​తో అభిమానులను అలరించారు. విడుదల సమయం దగ్గర పడుతున్న వేళ మూవీ మేకర్స్​ ప్రమోషన్ల స్పీడ్​ పెంచారు. దాంట్లో భాగంగానే ది రాజా సాబ్​ ట్రైలర్​ 2.0ను విడుదల చేశారు. భయం, హాస్యంతో మిక్స్​ అయ్యి ఉన్న ఈ ట్రైలర్​ ఫ్యాన్స్​లో ఆసక్తి పెంచింది. ఈ రెండో ట్రైలర్​ను బట్టి చూస్తే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీని మారుతి చాలా సస్పెన్స్​తో తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది.

రన్​టైం?
విడుదల తేదీ దగ్గర పడుతున్న వేళ సినిమాపై ఒక్కో అప్​డేట్​ బయటకు వస్తుంది. అయితే సినిమా రన్​టైం విషయానికొస్తే టికెట్​ బుకింగ్​ పోర్టల్​ ప్రకారం 195 నిమిషాలుగా చూపిస్తుంది. అంటే దాదాపు 3 గంటల 15 నిమిషాలు. కానీ సినిమా నిడివిపై అఫిషియల్​గా ఎటువంటి సమాచారం రాలేదు. రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ఓవర్సీస్​లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్​ అయ్యాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. దీని విడుదల కోసం ఫ్యాన్స్ డేస్​ కౌంట్​ చేసుకుంటున్నారు.

అప్​కమింగ్​ ప్రాజెక్ట్స్​: మరోవైపు ఈ 2026లో డార్లింగ్​ మూవీస్​ వరుసగా ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న చిత్రం 'ఫౌజీ'. ఇది పిరియాడిక్​ యాక్షన్​ థిల్లర్​గా తెరకెక్కనుంది. దీంట్లో ప్రభాస్​ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా 2026లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

డైరెక్టర్​ సందీప్​రెడ్డి వంగా, హీరో ప్రభాస్​ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'స్పిరిట్'​. ఈ మూవీలో డార్లింగ్​ పోలీస్​ పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్​గా నటిస్తున్నారు. దీంట్లో ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సలార్'​. ఫుల్​ యాక్షన్​తో సాగే ఈ సినిమా ఓ లెవెల్​లో హైప్​ సంపాదించుకుంది. అయితే దీని సిక్వెల్​ 2026 చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఎపిక్​ సైన్స్​ ఫిక్షన్​​గా థియేటర్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా భారీ రెస్పాన్స్​ను అందుకుంది. ఈ చిత్రానికి సిక్వెల్​ రూపొందిస్తామని మూవీ టీమ్ ఇంతకు ముందే ప్రకటించింది.

స్పిరిట్ సర్ప్రైజ్​- అదిరిపోయిన ప్రభాస్ లుక్​- చేతిలో మందు బాటిల్‌తో!

భయం, హాస్యం, విజువల్​ ఫీస్ట్- అదిరిపోయిన రాజాసాబ్ 2.0 ట్రైలర్