డార్లింగ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్- లేట్‌నైట్‌లో 'స్పిరిట్' ఆడియో గ్లింప్స్ రిలీజ్
ప్రభాస్ స్పిరిట్ నుంచి సర్ప్రైజ్- మిడ్‌నైట్‌లో ఆడియో గ్లింప్స్ రిలీజ్

Published : October 24, 2025 at 9:27 AM IST
Spirit Audio Glimps : రెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కనున్న 'స్పిరిట్' సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినా, ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే గురువారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. లేట్‌నైట్ సినిమా నుంచి ఓ ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.
'సౌండ్ స్టోరీ' (Sound Story) పేరుతో తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఆడియో గ్లింప్స్ వదిలారు. గ్లింప్స్ 1 నిమిషం 31 సెకండ్ల నిడివి ఉంది. అందరిలా కాకుండా డిఫరెండ్గా ఆలోచించిన స్పిరిట్ డైరెక్టర్ ఆడియో గ్లింప్స్‌తో సినిమా అప్డేట్ ఇచ్చారు. ఇది నటుడు ప్రకాశ్ రాజ్ వాయిస్‌తో ప్రారంభమైంది. చివర్లో ప్రభాస్ డైలాగ్ పెట్టారు. 'చిన్నప్పటి నుంచి నాకు ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది' అనే ఒకే ఒక్క డైలాగ్ ప్రభాస్ చెప్పారు. ఇది గ్లింప్స్‌లో హైలైట్‌గా మారింది. ఒక్క డైలాగ్‌తో ప్రభాస్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుందో అర్థం అవుతోంది.
'ఇది నీ పరేడ్ గ్రౌండ్ కాదు. ఇక్కడ ఏబీసీజీలు ఉండవ్. నెంబర్లే ఉంటాయి. వీడి గురించి విన్నాను. యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్‌లో తేడా ఉండదని విన్నాను. ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా ఉంటాడో చూద్దాం. నా కాంపౌండ్‌లో ఖాకీ లేదా ఖైదీ రెండే కాస్యూమ్స్ ఉండాలి. వీడి బట్టలు ఊడదీసి మెడికల్ టెస్ట్‌కి పంపించండి' అంటూ ప్రకాశ్ రాజ్ డైలాగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీనికి బదులుగా 'మిస్టర్ సూపరింటెండెంట్ చిన్నప్పటి నుంచి నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది' అనే ప్రభాస్ రిప్లైతో గ్లింప్స్ ముగిలింది. వాయిస్‌తోనే సందీప్ ట్రెండ్ సృష్టించారు. ప్రకాశ్ రాజ్, ప్రభాస్ గొంతులో ఇంటెన్సిటీ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.
Happy Birthday Prabhas anna 🍾🤗😘 Presenting a 'SOUND-STORY' in five Indian languages straight from the heart, for every fan who’s felt his 🔥
— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 23, 2025
Telugu - https://t.co/kqGr2COt9w
Hindi - https://t.co/4nVpo6y9Wf
Tamil - https://t.co/EI8fQT0z8r
Kannada - https://t.co/ONrwCNQkO6… pic.twitter.com/tzcQVML6nX
అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ప్రకటించినా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ సినిమాలు కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత నేరుగా స్పిరిట్ ప్రారంభం కానుంది. కంటిన్యూగా షూటింగ్ చేయాలని డైరెక్టర్ సందీప్ భావిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ లుక్ బయటకు రివీల్ కాకూడదనే ఉద్దేశంతోనే గ్యాప్ లేకుండా వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల లేదా డిసెంబర్లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈ తర్వాత మరిన్ని అప్డేట్లు వస్తాయి.
కాగా, ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటిదాకా ఈ ఇద్దరినే మేకర్స్ అధికారికంగా కన్ఫార్మ్ చేశారు. కానీ, గ్లింప్స్‌తో ఇందులో ప్రకాశ్ రాజ్, వివేజ్ ఒబెరాయ్ లాంటి సీనియర్లు కూడా ఇందులో ఉన్నారని కన్ఫార్మ్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, భద్రకాళీ పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆఖర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రభాస్ 'స్పిరిట్'లో విలన్‌గా బాలీవుడ్ నటుడు? సినిమాకు మరింత హైప్ వచ్చేలా!
'స్పిరిట్' షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్!- ప్రభాస్‌కు సందీప్‌రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్

