ETV Bharat / entertainment

ప్రభాస్‌ ఫ్యాన్స్​కు బిగ్​ అప్​డేట్​- 'ది రాజాసాబ్‌' టికెట్‌ ధరల పెంపు- ఎంతంటే?

జనవరి 9న ఈ సినిమా విడుదల కానున్న ది రాజాసాబ్​- జనవరి 8న రాత్రి స్పెషల్‌ ప్రీమియర్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

Raja Saab
Raja Saab (Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 6:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Raja Saab Movie Tickets Price Hike : సంక్రాతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'ది రాజాసాబ్'. ప్రభాస్​ కథానాయకుడిగా తెరుకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పుడు విడుదల అవుతుందా అని అభిమానుల్లో ఎదురు చూస్తున్నారు. ఇక ధరల పెంపు విషయంలో మూవీ టీమ్​ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించగా ఊరట లభించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపు కోసం అనుమతి ఇచ్చింది. ముందురోజు అంటే జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 లోపు వేసే స్పెషల్ షో కోసం ఏకంగా రూ.1000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో విడుదల చేసింది.

పెరిగిన టికెట్‌ ధరలు ఇలా!
జనవరి 9వ తేదీ నుంచి పదిరోజుల పాటు సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధరపై రూ.150 (పన్నులతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.200 (పన్నులతో కలిపి) పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే, రోజుకు ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతి కూడా లభించింది. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ నేపథ్యంగా భారీ బడ్జెట్‌తో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. ప్రభాస్‌ సరసన మాళవిక మోహనన్‌, రిద్ధికుమార్‌, నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. సంజయ్‌దత్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. కాగా, తమన్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే యువతను ఆకట్టుకుంటున్నాయి.

స్టోరీ ఇది!
ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్ తాతగా నటిస్తున్నారు. తాత మరణించిన తర్వాత అతను ప్రేతాత్మగా మారి ఒక భవనంలో తిరుగుతుంది. అయితే ప్రభాస్ తన తాత గురించి వివరాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఒకవైపు నవ్వు పుట్టిస్తూనే, మరోవైపు భయపెట్టేలా ఉన్నాయి. రెండో ట్రైలర్​ను బట్టి చూస్తే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీని మారుతి చాలా సస్పెన్స్ తో తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది.

సినిమా విడుదల కోసం రోజులు లెక్కపెడుతోన్న ఫ్యాన్స్​
మరోవైపు ఈ సినిమా రన్​టైం విషయానికొస్తే టికెట్​ బుకింగ్​ పోర్టల్​ ప్రకారం 195 నిమిషాలుగా చూపిస్తుంది. అంటే దాదాపు 3 గంటల 15 నిమిషాలు. కానీ సినిమా నిడివిపై అఫిషియల్​గా ఎటువంటి సమాచారం ఇంకా రాలేదు. రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ఓవర్సీస్​లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్​ అయ్యాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ రోజులు లెక్కపెడుతున్నారు.

2026 రానున్న ప్రభాస్​ సినిమాలు!
ఇదిలా ఉండగా 2026లో డార్లింగ్​ మూవీస్​ వరుసగా ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న చిత్రం 'ఫౌజీ'. ఇది పిరియాడిక్​ యాక్షన్​ థిల్లర్​గా తెరకెక్కనుంది. దీంట్లో ప్రభాస్​ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా 2026లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డైరెక్టర్​ సందీప్​రెడ్డి వంగా, హీరో ప్రభాస్​ కాంబోలో రూపొందుతున్న మరోచిత్రం 'స్పిరిట్'​. ఈ మూవీలో డార్లింగ్​ పోలీస్​ పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. హీరోయిన్​గా త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు. దీంట్లో ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సలార్'​. ఫుల్​ యాక్షన్​తో సాగే ఈ సినిమా ఓ లెవెల్​లో హైప్​ సంపాదించుకుంది. అయితే దీని సిక్వెల్​ 2026 చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఎపిక్​ సైన్స్​ ఫిక్షన్​​గా థియేటర్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్​ను అందుకుంది. ఈ చిత్రానికి సిక్వెల్​ రూపొందిస్తామని మూవీ టీమ్ ఇంతకు ముందే ప్రకటించింది.

భయం, హాస్యం, విజువల్​ ఫీస్ట్- అదిరిపోయిన రాజాసాబ్ 2.0 ట్రైలర్

రాజాసాబ్ 'యువరాజే' సాంగ్ రిలీజ్ - ఫ్యాన్స్​కు ప్రభాస్ వరుస సర్​ప్రైజ్​లు