ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ అప్డేట్- ఇక మిగిలింది యుద్ధమే!- ఈ ఏడాదే రిలీజ్‌కు ప్లాన్!
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ క్రేజీ అప్జేట్- సోషల్ మీడియాలో చక్కర్లు - కీలకమైన పార్ట్ పూర్తి!

Published : February 8, 2026 at 4:19 PM IST
Fauzi Update : రెబల్‌స్టార్ ప్రభాస్ నుంచి రానున్న తదుపరి సినిమా 'ఫౌజీ'. హను రాఘవపూడి దర్శకత్వంలో దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి టైటిల్, ఫస్ట్ పోస్టర్ మినహా ఎలాంటి అప్డేట్లు రావడం లేదు. తాజాగా ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?
ఫౌజీ సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకున్నట్లు తెలిసింది. కీలకమైన టాకీ పార్ట్ కూడా పూర్తయ్యిందట. ఇక కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. ఇది యుద్ధానికి సంబంధించిందట! ఈ యాక్షన్ నీన్స్ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం దాదాపు 100 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ఎన్ని రోజులు షూటింగ్లో పాల్గొంటారనేది క్లారిటీ లేదు. అయితే ఈ మిగిలిన షూటింగ్‌కు సంబంధించిన పనులను నిర్విరామంగా కొనసాగిస్తూ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
రిలీజ్ అప్పుడే?
అలాగే ఈ యాక్షన్ చిత్రీకరణ పూర్తైన తర్వాత విడుదల తేదీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఇదే ఏడాది దసరాకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారని టాక్. ప్రభాస్ భారీ లైనప్ ప్రకారం ఈ ఏడాది రిలీజ్ చేస్తేనే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే సందీప్‌రెడ్డి వంగాతో స్పిరిట్ ప్రారంభించారు. ఆ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు చెప్పేశారు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 ఉన్నాయి. అందుకే 2026లోనే ఫౌజీని థియేటర్లలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.
ఇందులో ప్రభాస్‌ను కొత్త పాత్రలో చూడనున్నాం. ఆయన మునుపెన్నడూ కనిపించని క్యారెక్టర్ చేస్తున్నారు. గతేడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులోనే ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో క్లూ ఇచ్చారు. 'పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు, గురువు లేని ఏకలవ్యుడు, పుట్టుకతోనే అతను ఒక యోధుడు' అని మేకర్స్ సంస్కృతంలో పేర్కొన్నారు. ఈ అప్డేట్తో సినిమాపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది.
पद्मव्यूह विजयी पार्थः
— Hanu Raghavapudi (@hanurpudi) October 23, 2025
पाण्डवपक्षे संस्थित कर्णः।
गुरुविरहितः एकलव्यः
जन्मनैव च योद्धा एषः॥
Happy Birthday to our dearest #Prabhas garu ❤️🔥
Taking pride in presenting you as #FAUZI, this journey so far has been unforgettable and only promises to get bigger from here!
FAUZI -… pic.twitter.com/uLHVBEH7ib
సినిమా రాసేందుకే ఏడాది!
గతంలో డైరెక్టర్ హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో ఫౌజీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సినిమా స్టోరీ రాయడానికే ఆయను ఏడాది పట్టిందని అన్నారు. అయితే ఇంతవరకు చూడని స్టోరీని ఇందులో చూపించనున్నట్లు చెప్పారు. ప్రభాస్ అభిమానుల అంచనాలు తాను ఆందుకుంటానని చెప్పారు. థియేటర్లలో సినిమా చూసినప్పుడు ఆడియెన్స్ తప్పుకుండా సర్ప్రైజ్ ఫీల్ అవుతారని హను అన్నారు.
కాగా, ఈ సినిమా పాన్ఇండియా లెవల్తోపాటు తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మరోవైపు ప్రభాస్ స్పిరిట్ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి 05న రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్గా సందీప్‌రెడ్డి ప్రకటించేశారు.
ప్రభాస్, హను రాఘవపూడి 'ఫౌజీ' అప్డేట్ - షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందంటే?

