Telangana Panchayat Elections Results2025

ETV Bharat / entertainment

మహారాణిగా నయనతార- బాలయ్య సరసన నాలుగోసారి- మరో హిట్ పక్కానా?

నాలుగోసారి బాలయ్యతో వర్క్ చేయనున్న నయనతార

Nayanatara In NBK 111
Nayanatara In NBK 111 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 18, 2025 at 12:27 PM IST

|

Updated : November 18, 2025 at 12:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

Nayanatara In NBK 111 Project : సౌత్​ ఇండియన్ లేడీ సూపర్​ స్టార్​ హీరోయిన్​ నయనతార వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ- గోపీచంద్ మలినేని​ కాంబోలో NBK 111 నుంచి రానుస్తున్న మూవీలో హీరోయిన్​గా నటిస్తున్నారు. తాజాగా ఆమె బర్త్​డే సందర్భంగా మూవీ టీమ్ ఒక స్పెషల్​ అప్డేట్​ ఇచ్చారు. అందులో బాలయ్యకు జంటగా నటిస్తున్న నయన్​కు సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్​ను విడుదల చేశారు.

రాణిలా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది
ఈ స్పెషల్​ గ్లింప్స్​లో నయన్​ మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు ప్రొడక్షన్​ టీమ్​ అనౌన్స్​ చేసింది. అందులో హీరోయిన్​ లుక్​ ఎలా ఉందంటే సముద్రమంత ప్రశాంతత, తుపాను అంత బీభత్సం తనలో మోసే రాణిలా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుందంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మూవీకి సంబంధించిన అన్ని అప్​డేట్స్​ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల కోసం రిలీజ్​ చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. అలానే 2025 నవంబర్​ 26న సినిమా పూజా కార్యాక్రమాలతో మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

వీరిద్దరి నాలుగో కాంబో
ఇప్పటికే బాలకృష్ణ - నయనతార కాంబినేషన్​లో మూడు సినిమాలు వచ్చాయి. ఇవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇది వీరిద్దరి నాలుగో కాంబో. దీనిపై ఇద్దరి ఫ్యాన్స్​ ఎన్నో అంచనాలను పెట్టుకుంటున్నారు. అయితే బాలయ్య, నయన్ ఇప్పటికే చేసిన 'సింహా', 'జైసింహా', 'శ్రీరామరాజ్యం'లా ఉండనుందా, లేదా ఫుల్​ కమర్షియల్​గా ఉండనుందా అంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చిత్రంపై భారీ ఆసక్తి
ఇక డైరెక్టర్​ గోపీచంద్​- బాలయ్య కాంబోలో 'వీరసింహారెడ్డి' వచ్చి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్​ను అందుకుంది. ఇప్పుడు ఆ ముగ్గురి కలయిక ఈ చిత్రంపై భారీ ఆసక్తిని నెలకొల్పుతున్నాయి. అయితే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్​లో శక్తిమంతమైన యాక్షన్‌ డ్రామాలో బాలయ్య రెండు డిఫరెంట్​ యాంగిల్స్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

నయనతార బిజీ షెడ్యూల్​ ఎలా ఉందంటే?

  • టాక్సిక్: ఇది యశ్​ సరసన నయనతార నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం. ఈ సినిమా మార్చి 19, 2026న విడుదల కానుంది.
  • మూకుత్తి అమ్మన్ 2: 2020లో విడుదలైన విజయవంతమైన 'మూకుత్తి అమ్మన్' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
  • డియర్ స్టూడెంట్స్: ఇది మలయాళ చిత్రం, ఇందులో నివిన్ పౌలీతో పాటు నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
  • రక్కయ్యీ: ఈ చిత్రం 2025లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు.
  • మన్నాంగాట్టి సిన్స్ 1960: ఈ పీరియడ్ డ్రామాలో యోగి బాబుతో పాటు నయనతార కీలక పాత్రలో నటిస్తున్నారు.
  • మన శంకరవరప్రసాద్​ గారు: మెగాస్టార్​ చిరంజీవి- నయనతార కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనికి అనిల్​ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ టీమ్​ అనౌన్స్​చేసింది. ఈ చిత్రం షూటింగ్​ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

నయనతార డివోర్స్ రూమర్స్- పోస్ట్​తో హీరోయిన్ క్లారిటీ!

సినిమాల్లోనే కాదు.. ఈ బ్యూటీలు బిజినెస్​లోనూ టాపే.. సూపర్ లాభాలతో..

Last Updated : November 18, 2025 at 12:54 PM IST