ETV Bharat / entertainment

'పండక్కి అల్లుడొచ్చేస్తున్నాడు రెడీగా ఉండండి'- 'అనగనగా ఒక రాజు' ట్రైలర్

అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్- నవ్వులు పూయిస్తున్న నవీన్ పొలిశెట్టి- మొత్తం కథ సంక్రాంతికే!

Anaganaga Oka Raju
Anaganaga Oka Raju (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 1:15 PM IST

|

Updated : January 8, 2026 at 1:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

Anaganaga Oka Raju Trailer : యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి- మీనాక్షి చౌదరి జంటగా నటించిన కొత్త చిత్రం 'అనగనగా ఒక రాజు'. దర్శకుడు మారి ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్​ జాన్రాలో తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం హైదారాబాద్​లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్​ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్​లో ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. నవీన్ స్టైల్ మార్క్ కామెడీ, పంచులు అదిరిపోయాయి. ఓ పల్లెటూరిలోని జమీందారి కుంటుంబానికి చెందిన నవీన్ ఏడు తరాలు గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే మీనాక్షితో లవ్​వో పడడం, ఫ్యామిలీ ఒప్పించడంలాంటి సన్నివేశాలు ఉన్నాయి. హీరోయిన్​తో లవ్ ట్రాక్ చూపించారు. మొత్తం విలేజ్ బ్యాక్​డ్రాప్​లో పండక్కి సెట్ అయ్యే బ్యాక్​డ్రాప్​లోనే సినిమా రూపొందించారు. విజువల్స్ సింపుల్​గా ఉన్నా ఆకట్టుకుంటున్నాయి.

కాగా, 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత భారీ అంచనాలతో నవీన్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ సినిమా కాస్త అలస్యం కావడంపై ఆయన ఈవెంట్​లో క్లారిటీ ఇచ్చారు. ప్రేక్షకులు మెచ్చేలా స్క్రిప్ట్​ను సిద్ధం చేయడం, అలాగే తనకు చిన్న ప్రమాదం కావడంతో సినిమా లేట్ అయ్యిందని అన్నారు. కథ రాసుకునేందుకు టైమ్ ఇచ్చి, ఎంతో సహకరించిన నిర్మాత నాగవంశీకి నవీన్ థాంక్స్ చెప్పారు.

అలాగే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్​లో నిర్మాత నాగవంశీ తన స్పీచ్​తో ఆకట్టుకున్నారు. ట్రైలర్​లో కామెడీ, పంచ్​లు, డైలాగులు బాగున్నాయా అంటూ ఫ్యాన్స్​ను అడిగారు. సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్​గా ఉంటుందని చెప్పారు. ​సింపుల్ కథే కానీ, రెండు గంటలు ప్రేక్షకులను ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు.

'పంచ్​లు ఎక్కడా తగ్గినట్లు అనిపించలేదు కదా. నవీన్ చెప్పినట్లు ఇది 10 శాతమే. ఆఖరి 15 నిమిషాలు మినహా, సినిమాలో ప్రతీసీన్​లో పంచ్ ఉంటుంది. ప్రేక్షకులను నిరాశ పర్చకూడదనే నవీన్ రెండేళ్లు ఈ స్క్రిప్ట్​పై పని చేశారు. అన్ని ఎలిమెంట్స్​ కూడా ఇందులో కవర్ చేశారు. ఇప్పటిదాకా చెప్పలేదు కానీ ఇందులో ఒక ఎలక్షన్ సీన్ కూడా ఉంటుంది. కచ్చితంగా ఆడియెన్స్ నిరాశపడరని అనుకుంటున్నా. థియేటర్​కు వచ్చి సినిమా చూడండి' అని నాగవంశీ అన్నారు.

ఇక ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించింది హీరో నవీన్ కావడం విశేషం. సినిమా రెండేళ్ల కిందటే ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. అయితే ప్రేక్షకులను నిరాశ పర్చకూడదనే ఉద్దేశంతో నవీన్ స్క్రిప్ట్​ను పర్ఫెక్ట్​గా రాశారు. ఆయన రాసిన స్క్రిప్ట్​ను డైరెక్టర్ మారి తెరకెక్కించారు. ఆయనకు ఇదే తొలి సినిమా కావడం గమనార్హం.

ఫుల్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్​గా ఈ సినిమా తెరకెక్కింది. గ్లింప్స్​, పాటలతో ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డ నేపథ్యంలో తాజా ట్రైలర్ కూడా అలరిస్తుంది. ఇది ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. సినిమా ఎంత ఎంటర్టైన్​గా ఉండనుందో ఈ ట్రైలర్​తో డైరెక్టర్ చూపించారు. సితారా బ్యానర్​పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.

'ఆ కారణం వల్లే నా సినిమాలు లేట్ అవుతాయి'- నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ స్పీచ్!

నవీన్‌ ఈజ్ బ్యాక్ - నవ్వులు పూయిస్తున్న ప్రీ వెడ్డింగ్ వీడియో! - మీరు చూశారా?

Last Updated : January 8, 2026 at 1:22 PM IST