'ఫౌజీ గురించి జనాలు ఏం ఊహించుకుంటున్నారో తెలియట్లేదు!'- ప్రభాస్ సినిమాపై నాగవంశీ కామెంట్స్
ప్రభాస్ 'ఫౌజీ'పై రోజురోజుకూ పెరుగుతున్న అంచనాలు- చిన్న ఫుటేజ్ చూసి సినిమాపై కామెంట్స్ చేసిన నిర్మాత నాగవంశీ - సోషల్ మీడియాలో వైరల్

Published : July 5, 2026 at 6:25 PM IST
Naga Vamsi On Prabhas Fauzi : పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఇది 'హిట్టు బొమ్మ' అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజాగా ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
ఏమనుకుంటున్నారో తెలియదు!
నాగవంశీ నిర్మాతగా వ్యవహరించిన లెనిన్ మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈనేపథ్యంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని ఈ సినిమాతోపాటు ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితులపై మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అప్‌కమింగ్ ఫౌజీ ప్రాజెక్ట్‌పై కీలక కామెంట్స్ చేశారు. రీసెంట్గా ఆయన సినిమాలో కొంత పుటేజ్ చూశానని, దీని గురించి జనాలు ఏం ఊహించుకుంటున్నారో తెలియట్లేదుగానీ, ఫౌజీ మాత్రం అదిరిపోతుందని అన్నారు. తాను చూసిన సన్నివేశాలు ఎంతో ఆకట్టుకున్నాయని, ప్రేక్షకులు ఊహించిన దానికంటే చాలా గొప్ప స్థాయిలో ఉండనుందని ఆయన చెప్పారు. "రవి అన్న (నిర్మాత) మొన్న నాకు ఫౌజీ పుటేజీ చూపించాడు. ఈ సినిమా గురించి ప్రేక్షకుల అంచనాలు ఎంత ఉన్నాయో నాకు తెలియదు. కానీ 'ఫౌజీ' నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని నేను చూసిన ఫుటేజ్ ఆధారంగా చెప్పగలను. దీనిని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇది ప్రేక్షకులు ఊహించిన దానికంటే మంచి అనుభూతిని అందిస్తుంది" అని నాగవంశీ అన్నారు.
అంచనాలు డబుల్
నాగవంశీ తాజా కామెంట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫౌజీ నిర్మాణంతో ఆయనకు సంబంధం లేకపోయినా, ఈ ఇంటర్వ్యూలో ఎలివేషన్ ఇవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు సినిమాపై కాన్ఫిడెన్స్ లెవెల్స్ డబుల్ అయిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. హను మార్క్ యాక్షన్ సీన్స్ చూడబోతున్నామంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
पद्मव्यूह विजयी पार्थः
— Hanu Raghavapudi (@hanurpudi) October 23, 2025
पाण्डवपक्षे संस्थित कर्णः।
गुरुविरहितः एकलव्यः
जन्मनैव च योद्धा एषः॥
Happy Birthday to our dearest #Prabhas garu ❤️🔥
Taking pride in presenting you as #FAUZI, this journey so far has been unforgettable and only promises to get bigger from here!
FAUZI -… pic.twitter.com/uLHVBEH7ib
టాలీవుడ్ నుంచి బిగ్ మూవీస్
ఇదిలా ఉండగా, రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ సినిమాలతో థియేటర్లు కళకళలాడుతాయని నాగవంశీ ఆశించారు. వచ్చే ఏడాదిన్నరలో రానున్న భారీ సినిమాలు పక్కా సూపర్ హిట్ అవుతాయని అన్నారు. 'ఫౌజీ', 'డ్రాగన్', 'వారణాసి', 'స్పిరిట్', 'వృషకర్మ', కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ చిత్రం వంటి భారీ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొస్తాయని అభిప్రాయపడ్డారు. కొత్తదనం ఉన్న కథలు, విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ఈ చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయని నాగ వంశీ పేర్కొన్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా
ఇక ఫౌజీ విషయానికొస్తే, భారత్‌కు స్వాతంత్య్రం రాకముందు 1940 నాటి కథతో ఫౌజీ రూపొందుతుంది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. బ్రిటీష్ కాలం నాటి అంశాలను కూడా టచ్ చేస్తున్నారు. ఇందులో గతంలో ఎప్పుడూ చూడని పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఆయనతోపాటు బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను 2026 చివరి నాటికి థియేటర్లలోకి తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
స్పిరిట్పైనా భారీ అంచనాలు
ఫౌజీ తర్వాత ప్రభాస్ కంప్లీట్ టైమ్‌ను తన అప్‌కమింగ్, మోస్ట్ వైలెంట్ డ్రామా స్పిరిట్‌కు కేటాయించనున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనిని తెరకెక్కిస్తుండంతో దీనిపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ నుంచి పోస్టర్, ఆడియో గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా కనిపించనుంది. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లకు తీసుకురావడమే లక్ష్యంగా మూవీటీమ్ పనిచేస్తుంది.
ప్రభాస్ ట్రిపుల్ ధమాకా- ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్‌కు ప్లాన్!
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ అప్డేట్- ఇక మిగిలింది యుద్ధమే!- ఈ ఏడాదే రిలీజ్‌కు ప్లాన్!

