'షూటింగ్ ఆపేద్దామనుకున్నాం!- కానీ చరణ్ వద్దన్నారు'- పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు
పెద్ది రై రై రారా సాంగ్- యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండింగ్- గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్

Published : March 3, 2026 at 4:26 PM IST
|Updated : March 3, 2026 at 4:31 PM IST
Chiranjeevi On Rai Rai Raa Raa Song : మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 'పెద్ది' సినిమా నుంచి రీసెంట్గా రిలీజైన 'రై రై రా రా' పాటకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఈపాట టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇందులో లిరిక్స్, చెర్రీ డ్యాన్స్ స్టెప్పులు, ఎనర్జీకి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. చెర్రీ లుక్ కూడా రగ్గ్డ్గా ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో చెర్రీకి హై ఫీవర్ వచ్చిందట! దీంతో షూటింగ్ ఆపేద్దామని తాను అనుకుంటే, చరణ్ మాత్రం ఫుల్ డెడికేషన్‌తో 'వద్దు' అని చెప్పారని దర్శకుడు బుచ్చిబాబు పేర్కొన్నారు. పాట అదిరిపోయిందని మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన పోస్టుకు రిప్లై ఇస్తూ బుచ్చిబాబు ఈ విషయాన్ని వెల్లడించారు.
చిరంజీవి స్పెషల్ పోస్ట్
రయ్ రయ్ పాటపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పాట అదిరిపోయిందని టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు. 'రయ్ రయ్ రా రా పాటలో రామ్‌చరణ్ ఎనర్జీ, స్పీడ్ వేరే లెవెల్. తన పెర్ఫార్మెన్స్, గ్రేస్‌తో చెర్రీ అదరగొట్టాడు. తనను చూస్తే నాకు గర్వంగా ఉంది. బుచ్చిబాబు పిక్చరైజేషన్, ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రత్నవేలు DOP, అనంత శ్రీరామ్ లిరిక్స్ అన్నీ పవర్‌ప్యాక్డ్‌గా ఉన్నాయి. పెద్ది టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. మీరు ఇలాంటివి ఇంకెన్నో సాధించాలి' అని చిరు ఎక్స్‌లో ట్వీట్ వేశారు.
జ్వరం వచ్చినా- డెడికేషన్‌తో వర్క్
దీనికి బుచ్చిబాబు స్పందిస్తూ, చిరంజీవికి థాంక్స్ చెప్పారు. అలాగే ఈ సాంగ్ షూటింగ్ సమయంలో జరిగిన దాని ఓ సంఘటన గురించి గుర్తుచేసుకున్నారు. 'ఆరోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ BGM షూటింగ్ చేస్తున్నప్పుడు చరణ్ సర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. అందుకే మేం షూటింగ్ ఆపేద్దామనుకున్నాం. కానీ, ఆయన 'లేదు చేద్దాం' అని అన్నారు. అంత జ్వరంలో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు. ఆ డెడికేషన్, ఆ యాటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్' అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో చరణ్ డెడికేషన్‌కు ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Thank you sooo much Sirrrr
— BuchiBabuSana (@BuchiBabuSana) March 3, 2026
❤️❤️❤️🙏🙏🙏
ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ BGM షూటింగ్ చేస్తున్నప్పుడు Charan సర్కి High fever sir. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన “లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు.
ఆ డెడికేషన్, ఆ… https://t.co/QXAlEOwlGw
రెహమాన్ పాట- చెర్రీ ఆట
అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను రెహమాన్ స్వయంగా పాడారు. ఆయన వాయిస్, బుచ్చిబాబు విజువల్స్, చెర్రీ డ్యాన్స్ స్టెప్స్ అన్నీ హైలైట్‌గా ఉన్నాయి. ఇవి కొత్త వైబ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది చరణ్ డ్యాన్స్ గురించే. ఈ స్టెప్పులు ఫుల్ ఫేమస్ అవుతున్నాయి. ఇప్పటికే చికిరి చికిరిలో హుక్ స్టెప్‌కు ఫిదా అయిన ఆడియెన్స్‌ను ఇందులో స్పీడ్ అండ్ ఎనర్డిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఈపాట రిలీజ్ కాగా, 24 గంటలైనా కాకముందే దాదాపు 20 మినియన్ల వ్యూస్ సాధించింది. ఇక ఈ సినిమా నుంచి గతేడాదే రిలీజైన 'చికిరి', 'చికిరి' సాంగ్ ఫుల్ హిట్ అయ్యింది. ఈపాటకు నెటిజన్లు లక్షల్లో రీల్స్ చేశారు.
ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడస్టార్ శివకుమార్, బొమన్ ఇరానీ, దివ్యేందు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఓవర్సీస్లో 'పెద్ది' అంత మొత్తంలో రాబట్టాలా? అప్పుడే డీల్ ఫిక్స్ అయిందా?
బాబాయ్, అబ్బాయ్‌ల డేట్స్ ఖరారు - మరి బాస్ సినిమా ఎప్పుడు?

