Mega 158 : చిరు- బాబీ సినిమాపై క్రేజీ అప్డేట్- ఆ రోజే సెట్స్‌పై వెళ్లనున్న ప్రాజెక్ట్!
టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్‌గా చిరు- బాబీ సినిమా - ఈ కాంబోపై ఫ్సాన్స్లో భారీ ఆసక్తి- సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమైన మూవీటీమ్!

Published : March 4, 2026 at 7:21 PM IST
Chiru Bobby Movie Update : 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ వస్తున్న ఆయన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉండేలా సెలెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్‌ను మెప్పించే మాస్ ఎలిమెంట్స్, అలాగే కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగ సన్నివేశాలు సినిమాలో ఉండేలా చూసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు బాబి కొల్లితో చేయనున్న కొత్త సినిమాపై కొత్త ప్రచారం షురూ అయ్యింది.
స్ట్రిప్ట్ లాక్!
మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తాజాగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఫైనల్ స్క్రిప్ట్‌ను బాబి లాక్ చేశారట. ఇది పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు సమాచారం. ఇందులో చిరును కొత్త క్యారెక్టర్లో చూపించేందుకు బాబీ రెడీ అయ్యారని టాక్ వినిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, హ్యూమర్ అన్నీ కలిసిన ప్యాకేజ్‌గా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. పాత తరహా కమర్షియల్ సినిమాల ఫీల్‌ను మోడన్ టెక్నాలజీతో బాబీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి స్టైల్, పవర్‌ఫుల్ డైలాగ్స్, శ్వాగ్ ఎంట్రీ సీన్, అభిమానులు ఈలలు వేసే సన్నివేశాలు, ఫైట్లు అన్ని అంశాలను ఈ చిత్రంలో ఉండేలా బాబి చూసుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్.
Thank you so much our dearest Megastar!
— Bobby (@dirbobby) August 1, 2021
A memorable birthday with the blessings from my idol himself @KChiruTweets garu, A fan in the millions to the man to direct you. It's truly a dream come true moment to me and I'm very thankful for this!
Special thanks for the gift, sir!❤️ pic.twitter.com/eEqcmX1wcI
ఆరోజు పూజా కార్యక్రమాలు!
అయితే తాజా సమాచారం, ప్రకారం వచ్చే వారం మార్చి 14న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నారని సమాచారం. దీంతో మార్చి షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? హీరోయిన్ ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు? అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ సమాచారం మాత్రం ఇంకా బయటికి రాలేదు. కానీ ఈ వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ టీజర్లు, పోస్టర్లు విడుదల చేస్తూ సందడి చేస్తున్నారు.
Megastar Chiranjeevi × Bobby Kolli 🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 3, 2026
After blockbuster #WaltairVeerayya, Director Bobby has penned a typical character for Megastar and locked the Final Script of#ChiruBobby.
He will be presented in a very stylish way in this emotional action entertainer which will have big… pic.twitter.com/TBPnrQLbFI
రెండో ప్రాజెక్ట్
అభిమానులకు మెగాస్టార్ సినిమా అంటే అది కేవలం ఒక చిత్రమే కాదు, అది ఒక సెలబ్రేషన్. చిరంజీవి తెరపై కనిపించే ప్రతి సీన్ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు కొత్త సినిమాపైనా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే బాబీతో చిరు వాల్తేరు వీరయ్య సినిమా చేశారు. 2023లో రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్ల వసూల్ సాధించింది. మెగా ఫ్యాన్స్‌కు మాస్ యాక్షన్ ట్రీట్ ఇచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో చిరు విశ్వరూపం చూపించారు. ఇప్పుడు 158 సినిమాలోనూ అలాంటి ఎపిసోడ్లు ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
కెరీర్ హైయ్యెస్ట్!
సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిరంజీవి కెరీర్లో వసూళ్ల పరంగా టాప్‌లో నిలిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం మంచి విజయం అందుకొని చిరుకు బూస్ట్ ఇచ్చింది. ఇది వరల్డ్‌వైడ్‌గా రూ.350+ కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఆయన సుదీర్ఘ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మన శంకరవరప్రసాద్ గారు రికార్డ్ కొట్టింది.
అనిల్ రావిపూడి స్ట్రాటజీని ఫాలో కానున్న బాబీ- చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో!
చిరంజీవి సినిమాలో తమిళ స్టార్ హీరో- డైరెక్టర్ బాబి ప్లాన్ ఏంటో?

