'క్లాప్ కూడా కొట్టలేదు, అప్పుడే OTT డీల్ క్లోజ్'- అనిల్ రావిపూడి బ్రాండ్ వ్యాల్యూ ఇది!
అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేశ్, కల్యాణ్ రామ్ మల్టీస్టారర్ - షూటింగ్ షురూ కాకముందే భారీ బిజినెస్!

Published : April 16, 2026 at 2:06 PM IST
|Updated : April 16, 2026 at 2:11 PM IST
Anil Ravipudi Latest Movie News : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా మేకింగ్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతి తక్కువ టైమ్‌లో, పరిమిత బడ్జెట్లోనే సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం అనిల్‌కే సాధ్యమవుతుంది. ఆయన ప్రొడ్యూసర్ల డైరెక్టర్ అని ఇండస్ట్రీలో అంటుంటారు. ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది. అనిల్ ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్- నందమూరి కల్యాణ్ రామ్ మల్టీస్టారర్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే మంచి బజ్ క్రియేటైంది. అయితే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కాకముందే అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం గురించి మాట్లాడితే చాలు ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగిపోతోంది.
అనిల్ బ్రాండ్ వ్యాల్యూ!
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి సినిమాలపై డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఉన్న క్రేజ్‌ను ఈ డీల్ స్పష్టం చేస్తోంది. ఆయన గత సినిమాలు ఇటు థియేటర్లలోతోపాటు అటు ఓటీటీలోనూ సూపర్ హిట్ సాధించి, అనేక రికార్డులు బద్దలు కొట్టాయి. అందుకే ఇప్పుడు ఈ మల్టీస్టారర్ పట్టాలెక్కకముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది! ఇది అనిల్ రావిపూడి బ్రాండ్ వ్యాల్యూను తెలియజేస్తుంది.
నిర్మాతల దర్శకుడు
మిగత దర్శకులలో పోలిస్తే అనిల్ మేకింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ పర్ఫెక్ట్గా సినిమా తీస్తుంటారు. ముందుగా అనుకున్న బడ్జెట్లోనే సినిమా పూర్తి చేసేలా ప్రయత్నిస్తారు. నిర్మాత పెట్టిన బడ్జెట్‌కు రెట్టింపు లాభాలు ఎలా తీసుకురావాలనిదే అనిల్ ఆలోచిస్తారు. అందుకే ఆయనను ఇండస్ట్రీలో నిర్మాతల డైరెక్టర్ అని అంటారు. ఆయన కెరీర్లో ఇప్పటిదాకా తీసిన తొమ్మిది సినిమాలు కూడా అలానే హిట్ అయ్యాయి. ప్రతీ సినిమాకు మంచి లాభాలు వచ్చాయి.
ఈ మల్టీస్టారర్‌లో దగ్గుబాటి వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ కాంబినేషన్‌కి మరో ప్రత్యేకత ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు. సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలపై ప్రేక్షకులు ఎప్పుడూ భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అనగానే మరో లెవల్లో ఉంటుందని సినీ ప్రియుల అభిప్రాయం.
2027 సంక్రాతికే
ఈ సినిమా 2026 జూన్ చివరి వారంలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. మూడు షెడ్యూల్స్‌లోనే చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబధింంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం ఏర్పాటు, ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో ఉత్సాహాకరమైన విషయమేమిటంటే ఈ సినిమాను 2027 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.
సంక్రాంతి అతి పెద్ద ఫెస్టివల్ సీజన్
తెలుగు సినిమాలకు సంక్రాంతి అతి పెద్ద ఫెస్టివల్ సీజన్. ఈ సమయంలో సినిమా రిలీజ్ చేస్తే పండగ అడ్వాంటేజ్ కలిసొస్తుందని మేకర్స్ నమ్ముతారు. అనిల్ రావిపూడి ఇప్పటికే పండుగ వాతావరణానికి సరిపోయే వినోదాత్మక కుటుంబ చిత్రాలను అందించడంలో సూపర్ స్పెషలిస్ట్‌గా మారారు. ఇది అనిల్ రావిపూడి వెంకటేశ్ మధ్య ఐదో సినిమా, వెంకటేశ్ గత నాలుగు చిత్రాలు అన్నీ విజయం సాధించాయి. అదే సమయంలో కల్యాణ్ రామ్‌తో కూడా అనిల్ రావిపూడి ఇంతకుముందే ఓ సినిమా తీసి హిట్ కొట్టారు.
రూట్ మార్చనున్న అనిల్ రావిపూడి- 'యానిమేటెడ్' మూవీ మేకింగ్‌కు ప్లాన్!
'తొమ్మిదిలో ఆ ఒక్క సినిమానే హై ఫీలింగ్ ఇచ్చింది - మిగిలినవి అంతంతే!'- అనిల్ రావిపూడి

