'ఇరుముడి' ప్రభంజనం- 55 లక్షలకుపైగా టికెట్ సేల్స్- రూ.200 కోట్ల క్లబ్ వైపు పరుగులు!
రవితేజ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్ల దిశగా 'ఇరుముడి' - మూవీలోని ఎమోషన్ సీన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్న ఆడియెన్స్

Published : August 30, 2026 at 10:42 AM IST
Raviteja Irumudi Collections : బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' మూవీ ర్యాంపేజ్ కొనసాగుతోంది. టికెట్ సేల్స్ పరంగా ఈ చిత్రం జోరు చూపిస్తోంది. రెండో శనివారం ఒక్కరోజే బుక్ మై షో యాప్‌లో ఏకంగా 3,77,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఒక్కరోజే ఇన్ని టికెట్లు సేల్స్ కావడం ఓ రికార్డ్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
టికెట్ సేల్స్‌లో ఇరుముడి రికార్డ్
బుక్‌మైషోలో టికెట్ల విక్రయాలు ఈ స్థాయిలో జరుపుకున్న సౌత్ ఇండియన్ ఎలైట్ చిత్రాల లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రంగా ఇరుముడి నిలవడం విశేషం. రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే బుక్ మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా 55 లక్షలకు పైగా టికెట్ల సేల్స్ జరిగి ఇరుముడి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రూ. 150+ కోట్లకు పైగా వసూళ్లు
ఇక రవితేజ ఇరుముడి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఆ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో హీరో రవితేజ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్ల దిశగా అడుగులు వేస్తోంది. నాలుగు రోజులకే రూ.100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన మూవీగా మరో మైలురాయిని అధిగమించింది. రూ.150+ కోట్లకు పైగా వసూళ్లు దక్కినట్లు తాజాగా మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇందులో ఒక్క నైజాం ప్రాంతం నుంచే ఆ సినిమాకు రూ. 50 కోట్ల వరకూ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
చాలా రోజుల తర్వాత హౌస్బోర్డులు
సాధారణంగా రోజులు గడుస్తున్న కొద్దీ సినిమాలకు కలెక్షన్స్ తగ్గడం సాధారణం. కానీ ఇరుముడి విషయంలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. టికెట్ సేల్స్ పరంగా, థియేటర్ ఆక్యుపెన్సీ పరంగా అన్ని రకాలుగా ఈ సినిమా ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమా రన్ అవుతున్న సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లు అనే తేడా లేకుండా చాలా రోజుల తర్వాత అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇరుముడి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. రిపీటెడ్‌గా ఆడియెన్స్ సినిమాను ఎక్కువగా చూడటం, దగ్గర్లో పెద్ద సినిమాల రిలీజ్లు ఏమీ లేకపోవడంతో ఆ లోటును ఇరుముడి భర్తీ చేస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా సాలిడ్ థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేస్తుంది.
పండగ వాతావరణంలో థియేటర్లు
ఆంధ్రా తెలంగాణలో అన్ని ప్రధాన నగరాల్లో గత 9 రోజులుగా ఆ సినిమాకు వస్తున్న వసూళ్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రవితేజ మాస్ ఇమేజ్‌కు పవర్ఫుల్ కంటెంట్ తోడైతే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆ మూవీ నిరూపించిందని రవితేజ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా రోజులు తర్వాత థియేటర్లలో పండుగ వాతావరణంలో ఉందని డిస్ట్రిబ్యూటర్లు ఈ సందర్భంగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మల్లెపూల పల్లకి సాంగ్‌కు థియేటర్లో ఆడియెన్స్ హారతులు పడుతున్న విజువల్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీని ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లు ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు దక్కుతాయనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సాధారణ ఆడియెన్స్‌లో కూడా ఆసక్తికరంగా మారింది. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఈ సినిమాతో ఏకంగా తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో రవితేజ జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా, కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటించి మెప్పించారు. డైరెక్టర్ శివ నిర్వాణ దీన్ని డైరెక్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దీన్ని వా. రవిశంకర్,నవీన్ ఎర్నేని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
యూఎస్‌లో పుష్పగాడి రూల్- వైల్డ్ ఫైర్ దెబ్బకు 45 వేల ప్లస్ టికెట్స్ సేల్!

