ETV Bharat / entertainment

హైకోర్టులో జననాయగన్​కు ఊరట- సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశం

సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ- శుక్రవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం

Relief for the film Jana Nayagan
Relief for the film Jana Nayagan (EENADU)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 11:16 AM IST

3 Min Read
Choose ETV Bharat

HC On Jana Nayagan : కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​. ఆయన యాక్ట్ చేసిన 'జన నాయగన్​' సినిమాకు మద్రాసు హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఈ సినిమాకు యూ/ఏ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని హైకోర్టు సీబీఎఫ్‌సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది.

డిసెంబర్​లో జన నాయగన్​ సినిమాను సెన్సార్​ కోసం పంపించారు.సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వాటిని మ్యూట్ చేయాలని సూచించింది. ఈ మేరకు మార్పులు చేసిన నిర్మాత మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపించగా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ సమయంలోనే కేవీఎన్​ ప్రొడక్షన్స్ తరపు నుంచి మద్రాస్​ హైకోర్ట్​లో అత్యవసర పిటిషన్​ దాఖలైంది. మొదటగా యూ/ఏ సర్టిఫికేషన్‌కు సిఫార్సు చేసిన సెన్సార్‌ బోర్డు ఆ తర్వాత సినిమాను రివ్యూ కమిటీకి పంపిందని నిర్మాణ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

దీనిపై వాదనలు విన్న హైకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్​ చేసింది. దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. హైకోర్టు తాజాగా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్​ను ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో 'జన నాయగన్​' విడుదలకు ఇపుడు ఎలాంటి సమస్య లేదు. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా జనవరి 14న మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోన్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

సినీ చరిత్రలోనే ఈ రిఫండ్ హయ్యెస్ట్
సెన్సార్​ సమస్య వల్ల కేవీఎన్​ ప్రొడక్షన్స్ జన నాయగన్​ మూవీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పటికే అడ్వాన్స్ బుకింగ్​ చేసుకున్న ప్రేక్షకులకు టికెట్ డబ్బులను వెనక్కి తిరిగి ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది. బుధవారం వరకూ బుక్​ మై షో ద్వారా 4.50 లక్షల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇప్పటివరకూ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇంత ఎక్కువ మొత్తాన్ని రిఫండ్ జరగలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హెచ్ వినోథ్​ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'జన నాయగన్‌'. విజయ్​ హీరోగా నటించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ పూజా హెగ్డే, మలయాళ బ్యూటీ మమితా బైజు, ప్రకాశ్ రాజ్‌, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

విజయ్​కు పెరిగిన సపోర్ట్
జన నాయగన్‌ వాయిదా పడటంతో సినీ ఇండస్ట్రీ నుంచి విజయ్‌కు మంచిమద్దతు లభించింది. ఇప్పటికే పలువురు దర్శకులు, నటులు దళపతి సినిమాకు సపోర్ట్​ను తెలిపారు. పెద్ద సినిమాల పరిస్థితి ఇలా ఉంటే చిన్న సినిమాల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనంటూ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ విచారం వ్యక్తం చేశారు. ఒక సినిమా విడుదలకు ముందు ఇలా జరగడం సరైనదని కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వినోద రంగంలో ఓటీటీ, శాటిలైట్‌ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో థియేటర్‌ను మరింత ప్రోత్సహించాలన్నారు. ఇది ఫిల్మ్స్‌ మేకర్స్‌పై మరింత ఒత్తిడిని పెంచుతుందన్నారు.

ఇదే లాస్ట్​ మూవీ
విజయ్ దళపతి కెరీర్​లో ఈ సినిమానే ఆఖరిది కానుంది. ఆయన ఇకపై పూర్తిగా రాజకీయాల్లో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో 'జన నాయకుడు' తన ఆఖరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన ఫ్యాన్స్​ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అడ్వాన్స్​గా టికెట్లు భారీగా కొనుగోలు చేశారు.

'జన నాయగన్​' రీఫండ్ ప్రక్రియ మొదలు​- సినీ చరిత్రలోనే ఇదే హెయ్యెస్ట్

విజయ్‌ 'జననాయగన్‌'కు సెన్సార్‌ కష్టాలు- హైకోర్టుకు మూవీ టీమ్