'క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది- రాసిపెట్టుకోండి'- ప్యారడైజ్‌పై ఆయాషేర్ లిరిసిస్ట్ క్రేజీ అప్డేట్
ప్యారడైజ్ క్లైమాక్స్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కాసర్ల శ్యాం- ఫుల్ ఖుషీలో ఉన్న నాని ఫ్యాన్స్

Published : July 8, 2026 at 4:24 PM IST
kasarla Shyam on Paradise : ప్యారడైజ్ మూవీ గురించి అటు నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్, ఇటు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మూవీపై ఎటువంటి అప్డేట్స్ లేవు. రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. ఆగస్టు 21న సినిమాను విడుదల చేస్తామని మూవీటీమ్ చెప్పినప్పటికీ అనుకున్న డేట్‌కు వచ్చేలా లేదు! దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆ చిత్రంలో 'ఆయా షేర్' సాంగ్ రాసిన లిరిసిస్ట్ కాసర్ల శ్యాం ఎక్స్‌లో ప్యారడైజ్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే?
రీసెంట్‌గానే ప్యారడైజ్ సినిమా షూటింగ్ సెట్స్‌కు వెళ్లినట్లు శ్యాం తెలిపారు. 'ప్యారడైజ్ మూవీ క్లైమాక్స్ షూటింగ్‌కి వెళ్లొచ్చాను. మూవీలో క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉండనుంది. నేను చేసిన ట్వీట్‌ను అందరూ మార్క్ చేసుకోండి. ఎందుకంటే మూవీ రిలీజైన తర్వాత మీకే అర్థమవుతుంది. అంతలా అందరినీ ఆకట్టుకునే విధంగా క్లైమాక్స్ ఉండబోతుంది. అందుకే ఆపుకోలేక ట్వీట్ పెడుతున్నా' అని ఈ సందర్భంగా లిరిసిస్ట్ కాసర్ల శ్యాం ఎక్స్‌లో రాసుకొచ్చారు. దీంతో నాని ఫ్యాన్స్‌లో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. క్లైమాక్స్ సీన్స్‌లో నాని చేసే విధ్వంసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Climax #Paradaise ..
— Kasarla Shyam (@LyricsShyam) July 7, 2026
Mark my tweet …
Just came from the Shoot
ఆపుకోలేక పెడుతున్నా ... #DhoomdhoomTahataha @odela_srikanth @NameisNani @SLVCinemasOffl pic.twitter.com/HEdRAXMqNT
ట్వీట్‌తో కీలక అప్డేట్
శ్యాం తాజా ట్వీట్‌తో ప్రేక్షకులకు, అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందని చెప్పడంతో చిత్రీకరణ ఆఖరి దశకు వచ్చేసినట్లే! దీంతో ఇదే నెలలో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన ముందుగా చెప్పినట్లు ఆగస్టు 21న సినిమాను విడుదల చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మేకర్స్ అనౌన్స్ చేసిన తేదీకి ఇంకా 42 రోజుల సమయం ఉంది. ఒకవేళ ఇదే ఆఖరి షెడ్యూల్ షూటింగ్ అయితే త్వరలోనే చిత్రీకరణ కంప్లీట్ చేయొచ్చు. ఆ తర్వాత పోస్టు ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్‌కు కూడా కావాల్సిన టైమ్ దొరుకుంటుంది.
ఇక సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నందన ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయాల్సిన అవసరం లేదు. నాని జడల్ గ్లింప్స్, మోహన్ బాబు శింకజ మాలిక్ విలన్ పాత్రలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పైగా దసరా సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తుండడంతో సినిమాకు కావాల్సినంత హైప్ ఇప్పటికే వచ్చేసింది. ఇక ఆయా షేర్ పాటకు దక్కిన రెస్పాన్స్ వేలే లెవెల్. ఈపాటకు నెటిజన్లు లక్షల్లో రీల్స్ చేశారు. మరి మేకర్స్ ప్లాన్ ఏంటి? ఎలా ముందుకెళ్తారో అనేది ఆసక్తిగా ఉంది. ఏదేమైన రిలీజ్ డేట్, షూటింగ్ అప్డేట్లపై మూవీటీమ్ స్పందిస్తేనే ఓ క్లారిటీ వస్తుంది.
ఆయా షేర్
ఈ మూవీలో 'ఆయాషేర్' పాటకు కాసర్ల శ్యాం సాహిత్యాన్ని అందించారు. గతంలో రిలీజైన ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభించింది. యూట్యూబ్, స్పాటిఫై, ఇతర సామాజిక మాధ్యమాలన్నింటిలో ఈ పాట సంచలనం సృష్టించి, టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా పాటలో ఉండే లిరిక్స్ విన్న ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఆయా షేర్ సాంగ్ 188 మిలియన్ల పై చిలుకు వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
కాగా ఈ సినిమా కథ సికింద్రాబాద్ నేపథ్యంలో ఉండనుంది. ఇందులో నాని జడల్ పాత్రలో కనిపించనున్నారు. మోహన్ బాబు శికంజ మాలిక్, రాఘవ్ జుయల్ విక్రమ్ మాలిక్ పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లకు సంబంధించిన వీడియో గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
'ది ప్యారడైజ్' మూవీ మళ్లీ వాయిదా! - ఆ వీడియోతో హింట్ ఇచ్చారా?

