వెయిట్ ఈజ్ ఓవర్ - 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ ఇదే
యశ్ టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ ఔట్ - ఆగస్టు 26న విడుదల చేయనున్నట్లు ఎనౌన్స్ చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ - ఫుల్ జోష్‌లో ఉన్న యశ్ ఫ్యాన్స్

Published : June 21, 2026 at 3:03 PM IST
|Updated : June 21, 2026 at 5:03 PM IST
Toxic Release Date : రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు ఈ మూవీ వాయిదాపడుతూ వస్తుండగా మేకర్స్ ఆదివారం రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 26న రీలీజ్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా అనౌన్స్ చేశారు. ఇందులో ఫాదర్స్ డే సందర్భంగా హానర్ థై ఫాదర్ (నీ తండ్రిని గౌరవించు) అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. దీంతో యశ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
కేవీఎన్ బ్యానర్లో స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన టాక్సిక్ చిత్రాన్ని ముందుగా మార్చి 19న విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా జూన్ 4కు పోస్ట్‌పోన్ చేశారు. కానీ దాన్ని కూడా వాయిదా వేస్తూ టాక్సిక్ చిత్ర నిర్మాణం పూర్తయిందని, అయితే ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్, పార్ట్‌నర్‌షిప్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలోనే మూవీ టీమ్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే తేదీకి టాక్సిక్ను రిలీజ్ చేసేలా కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. 'ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. ఆడియెన్స్ అంచనాలు అందుకునేలా కొంచెం టైమ్ తీసుకుని, బెస్ట్ ఔట్‌పుట్ అందించాలనుకుంటున్నాం" అని మూవీ టీమ్ గతంలో పేర్కొంది. ఎట్టకేలకు ఇవాళ కొత్త రిలీజ్ డేట్ ప్రకటన చేశారు. ఆగస్టు 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మరి ఈసారైనా అనుకున్న తేదీకి రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.
Honour Thy Father...#Toxic In Cinemas Worldwide from 26-08-2026#ToxicTheMovie#ToxicOn26thAug@TheNameIsYash#Nayanthara @advani_kiara #TaraSutaria @humasqureshi @rukminitweets #GeetuMohandas @VishalMMishra #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/FMstz2MY4R
— KVN Productions (@KvnProductions) June 21, 2026
మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో
మాఫియా బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ సినిమాలో ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్‌లో యశ్‌ను చూడనున్నాం. ఇందులో యశ్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కాగా రుక్మిణి వసంత్, నయనతార, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తెరకెక్కించారు. కేవీఎన్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని, యశ్ (మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ) తో కలిసి నిర్మించింది. ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్లలో విడుదల కానుంది.
జననాయగన్‌పై నో క్లారిటీ
కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించిన మరో భారీ బడ్జెట్ చిత్రం జననాయగన్. దళపతి విజయ్ హీరోగా ఈ సినిమాను హెచ్ వినోద్ తెరకెక్కించారు. అయితే ఇది 2026 జనవరి 09నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. దీనిపై మేకర్స్ కోర్టు దాకా వెళ్లినా అనుకూలంగా తీర్పు రాలేదు! ఇక ఆ తర్వాత తమిళనాడు ఎన్నికలు ఉండడంతో విజయ్ అటు బిజీ అయిపోయారు. అభిమానులు కూడా ఎలక్షన్ ముగిసిన తర్వాత రిలీజ్‌కు లైన్ క్లియర్ అవుతుందని భావించారు.
కానీ, నెలలు గడుస్తున్నా క్లారిటీ రావడం లేదు. జూన్ 19న విడుదల కానుందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అదీనూ జరగలేదు. దీంతో ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు. విజయ్ ఆఖరి సినిమా కావడంతో థియేటర్లలో సినిమా చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సంస్థ నిర్మించిన టాక్సిక్ విడుదల తేదీని ప్రకటించేశారు. కాబట్టి ఇక మిగిలింది జననాయకుడు మాత్రమే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌పై ఓ నిర్ణయం తీసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వాళ్ల వెయిటింగ్‌కు మేకర్స్ ఎప్పుడు తెరదించుతారో చూడాలి మరి!
KVN సంస్థకు కష్టకాలం- విజయ్, యశ్ సినిమాలకు వరుస అడ్డంకులు- అసలేం జరుగుతోంది?
యశ్ ‘టాక్సిక్’ వాయిదా- కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్

