విజయ్ 'జననాయగన్'కు సెన్సార్ కష్టాలు- హైకోర్టుకు మూవీ టీమ్
సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్న సెన్సార్ బోర్డ్ - అడ్వాన్స్ బుకింగ్స్‌పై ఎఫెక్ట్!- హైకోర్టుకు చిత్రబృందం

Published : January 6, 2026 at 7:22 PM IST
Jana nayakudu Movie Facing Censer Troubles: కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, హెచ్. వినోద్ కాంబోలో తెరకెక్కనున్న మూవీ 'జన నాయగన్'. తెలుగులో 'జన నాయకుడు' పేరుతో విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇదే చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ విషయంపై మూవీ మేకర్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
'జన నాయకుడు' ఇంకొన్ని రోజుల్లో థియేటర్లోకి రానున్న వేళ కొన్ని రోజుల ముందే మూవీ టీమ్ ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్‌కు సమర్పించింది. కానీ ఇప్పటికి వరకు సెన్సార్ బోర్డ్ నుంచి ఎటువంటి సర్టిఫికేట్ రాలేదు. దీంతో థియేటర్లలో ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవడం కష్టంగా మారింది. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం, విజయ్ టీం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం అభిమానులను కలవర పెడుతోంది.
మద్రాస్ హైకోర్ట్‌లో పిటిషన్
సర్టిఫికేట్ ప్రాసెస్ ఆలస్యం అవుతున్నందున మూవీ మేకర్స్ మద్రాస్ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ సర్టిఫికేట్‌ను వీలైనంత తొందరగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉండటం వల్లే ఆలస్యమవుతోందని ప్రచారం సాగుతోంది. మరి దీనిపై హైకోర్టు ఏం చెబుతోంది చూడాలి.
సినిమా రిమేక్‌పై క్లారిటీ
గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా 'భగవంత్ కేసరి'కి రిమేక్ అని ప్రచారం సాగింది. ఈ విషయంపై ఇరు దర్శకులు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ దీని ట్రైలర్ విడుదలయ్యాక బాలయ్య చిత్రానికి రీమేక్ అని క్లియర్‌గా అర్ధమవుతోంది. ఆ సినిమాలోనీ కీ పాయింట్‌నే దీంట్లోనూ వాడటం, ఇందులోని మమిత బైజు పాత్రకు (విజ్జి) అనే పేరు పెట్టడం ఇవాన్నీ చూస్తే ఆ సినిమాతో పోలికలు ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ట్రైలర్ రిలీజైన నిమిషాల్లోనే లక్షల కొద్దీ వ్యూస్‌లో ఇది ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. 'భగవంత్ కేసరి'లోని కొన్ని సన్నివేశాలతో పోలికలు ఉన్నప్పటికి ఈ సినిమా సెకండ్ పార్ట్‌ను మాత్రం దర్శకుడు డిఫెరెంట్‌గా రూపొందించారు. దాంట్లో మూవీని మొత్తం పొలిటికల్‌గా చూపించారు. సెకండ్ పార్ట్‌లో విజయ్ చెప్పే కొన్ని డైలాగ్స్‌తో అది పొలిటికల్ టచ్‌లో ఉండనుందని క్లియర్‌గా అర్థమవుతోంది.
ఆఖరి సినిమాగా జన నాయకుడు
మరోవైపు 'జన నాయకుడు' విజయ్ కేరీర్‌లోనే ఆఖరి సినిమా కానుంది. సినిమాలను పూర్తిగా విడిచిపెట్టి మొత్తం రాజకీయల్లోనే గడపనున్నారు. ఈ మేరకు మూవీమేకర్స్ ప్రకటించారు. అయితే ఇదే లాస్ట్ ఫిలీం కావడంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రీసెంట్గా దీని ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రాన్ని తమిళ్‌తోపాటు తెలుగు, హిందీ భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కించారు.
నటీనటులు
ఇక సినిమా విషయానికొస్తే బాబీ డియోల్ విలన్ పాత్రలో పోషించనున్నారు. విజయ్‌కు జంటగా పూజ హెగ్దే నటించనున్నారు. వీరితో పాటు గౌతమ్ వసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, సునీల్, ప్రియమణి, నారాయణ్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేయనున్నారు. అంతే కాక ఈ సినిమా ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ నిర్మించారు.
OTTలో టాప్ ప్లేస్‌లోకి 'భగవంత్ కేసరి'- 'జన నాయకుడి' ఎఫెక్టేనా?
'జన నాయకుడు' మూవీ ట్రైలర్ రిలీజ్- రీమేక్ ప్రచారంపై క్లారిటీ వచ్చేసినట్లే!

