ETV Bharat / entertainment

'ది కేరళ స్టోరీ 2' రిలీజ్​కు కోర్టు గ్రీన్ సిగ్నల్!- స్టే ఎత్తివేసిన డివిజన్ బెంచ్

కేరళ స్టోరీ 2 సినిమాపై స్టే ఎత్తివేత - స్టే ఎత్తివేసిన కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్‌

Kerala story 2
Kerala story 2 (Movie : Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 4:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kerala story 2 : 'ది కేరళ స్టోరీ 2' సినిమా మేకర్స్​కు ఊరట లభించింది. ఈ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్‌ విధించిన స్టే ను, తాజాగా డివిజన్ బెంచ్‌ ఎత్తివేసింది. 15 రోజులపాటు సినిమా రిలీజ్​ను నిలిపివేస్తూ గురువారం కురియన్ థామస్ ఇచ్చిన స్టే ను, శుక్రవారం జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ బాలకృష్ణన్లతో కూడిన ధర్మాసనం ఎత్తివేసింది. దీంతో సినిమా రిలీజ్​కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లైంది.

వాస్తవానికి ఫిబ్రవరి 27 (శుక్రవారం) సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమాలో పలు సీన్లు మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, అందుకే సినిమా విడుదలను ఆపాలంటూ కొందరు ఇటీవల కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను గురువారం విచారించిన జస్టిస్ కురియన్ థామస్ విడుదలను 15 రోజులు నిలిపివేస్తూ స్టే ఇచ్చారు. సీబీఎఫ్‌సీ తీర్పునూ తప్పుబడుతూ సినిమాను పునఃపరిశీలించాల్సిందిగా ఆదేశించారు. ఈ తీర్పును సవాల్​ చేస్తూ చిత్ర బృందం డివిజన్​ బెంచ్​ను ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలను వింది. ఆ తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. సినిమాపై విధించిన స్టేను ఎత్తివేస్తూ చిత్ర బృందానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

రిలీజ్​ ఎప్పుడో?
ఇప్పుడు డివిజన్‌ బెంచ్‌ క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ముందు అనుకున్న విధంగానే శుక్రవారమే రిలీజ్ అవుతుందా అనేది సందిగ్ధంగానే ఉంది. ఎందుకంటే సాయంత్రం తీర్పు రావడం వల్ల థియేటర్ల సర్దుబాటు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు. నిర్మాతలు ఈ సినిమా విడుదల గురించి కొత్త తేదీని శుక్రవారమే ప్రకటించే అవకాశం ఉంది. రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా విషయానికొస్తే 2023లో విడుదులైన 'ది కేరళ స్టోరీ'కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ విడదుల సయమంలోనూ పలు వివాదాలు తలెత్తాయి. చివరికి థియేటర్​లో విడుదలై ప్రేక్షుకులను మెప్పించింది. ఇప్పుడు దాని సీక్వెల్​గానే 'ది కేరళ స్టోరీ 2' రూపొందింది. దీనికి కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. విపుల్ అమృత్​లాల్ షా నిర్మించారు. ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా కీలక పాత్రలో నటించారు. తమ ప్రేమ నిజమని నమ్మి కన్నవాళ్లను కూడా ఎదురించి మరి ప్రియుడిని పెళ్లి చేసుకుంటారు. మొదట్లో బాగానే ఉన్న రోజలు గడిచిన కొద్దీ ఇదంతా పెద్ద మోసమని తెలుసుకుంటారు. ఆ సమయంలో వారు అనేక బాధలు అనుభవిస్తారు. అలాంటి నిజజీవత కథాతో 'ది కేళ స్టోరీ 2'ను తెరకెక్కించారు. ఈసినిమాను తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

సినిమాపై సీఎం విమర్శలు
ఇదిలా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కూడా ది కేరళ స్టోరీ 2పై గతంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సనిమాను ప్రజలు బాయ్​కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ చిత్రం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ట్రైలర్​లోని సన్నివేశాలు కేరళ సంప్రదాయం, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సినిమాలకు సెన్సార్స్ ఎలా ఇస్తారంటూ బోర్డుపై ఫైర్ అయ్యారు. కేరళపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, తమ రాష్ట్ర లౌకిక సంప్రదాయాన్ని అవమానించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందించారని అని ఆయన విమర్శించారు. సీఎంతో పాటు పలువురు ప్రముఖులు కూడా ది కేరళ స్టోరీ 2పై విమర్శలు గుప్పించారు.