ETV Bharat / entertainment

'మేం ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం'- రష్మిక మాజీ బాయ్​ఫ్రెండ్ కామెంట్స్ వైరల్

విజయ్, రష్మికల పెళ్లి వేళ రక్షిత్ శెట్టి పాత కామెంట్స్ నెట్టింట వైరల్- ఆమె సక్సెస్​కు కారణాలు వెల్లడించిన కన్నడ హీరో- ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Rakshit Shetty - Rashmika Mandanna
Rakshit Shetty - Rashmika Mandanna (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 6:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rakshit Shetty On Rashmika : టాలీవుడ్ బ్యూటీఫుల్ జోడీ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ శుభ తరుణంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. గతంలో రష్మికతో ఎంగేజ్మెంట్ చేసుకున్న కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, ఆమె గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన క్లిప్స్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఆ వీడియోలో రక్షిత్ చాలా హుందాగా, సానుకూలంగా స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రక్షిత్ గతంలో ఆమె గురించి ఏమన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. ఆ పాత వీడియో క్లిప్స్​లో అతను చెప్పిన మాటలు వింటుంటే వీరిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది.

రక్షిత్ శెట్టి మాటలు వైరల్- అసలు ఏమన్నారంటే?
ఈ పెళ్లి సందడి మధ్యలో రక్షిత్ శెట్టి పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రష్మిక గురించి మాట్లాడుతూ "మేము ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం. ఆమె తన కెరీర్‌లో చాలా బాగా రాణిస్తోంది. తనకి ఎప్పుడూ పెద్ద కలలు ఉండేవి. ఇప్పుడు వాటిని సాధిస్తోంది. దానికి సంబంధించిన క్రెడిట్ కచ్చితంగా తనకే ఇవ్వాలి. తను సాధిస్తున్న విజయాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా సరే లైఫ్​లో ఎదుగుతుంటే చూసి సంతోషపడాలి" అని ఎంతో పరిణతితో చెప్పారు. రష్మిక తన కష్టంతోనే ఈ స్థాయికి చేరుకుందని ఇచ్చిన వివరణ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

రష్మిక మందన్నా కెరీర్ మొదట్లో రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉన్న విషయం, వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 'కిర్రాక్ పార్టీ' సినిమా సమయంలో వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడి నిశ్చితార్థం దాకా వెళ్లింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ఇరువురు స్నేహపూర్వకంగానే విడిపోయారు. అయినప్పటికీ వీరిద్దరూ ఎక్కడా ఒకరిపై ఒకరు నెగిటివ్​గా మాట్లాడకుండా చాలా హుందాగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు రష్మిక మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ రక్షిత్ పాత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఉదయపుర్‌లో 'విరోష్' వైభవం
రాజస్థాన్‌లోని ఉదయపుర్ వేదికగా ఫిబ్రవరి 26న విజయ్, రష్మికల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. "విరోష్" పేరుతో జరిగిన ఈ వేడుకను ఐటీసీ మెమెంటోస్ హోటల్​లో ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 26న ఉదయం 10.10 గంటలకు విజయ్ రష్మిక మెడలో తాళి కట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరు కుటుంబాల ఆశీస్సులతో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

పెళ్లిలో వినూత్న వేడుకలు
ఈ పెళ్లిలో ఒకే రోజు రెండు రకాల సంప్రదాయాలు కనిపించడం విశేషం. ఉదయం విజయ్ దేవరకొండ కుటుంబ ఆచారాల ప్రకారం తెలుగు సంప్రదాయంలో వేదమంత్రాల నడుమ పెళ్లి తంతు పూర్తి చేశారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు రష్మిక కుటుంబానికి చెందిన కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరిగింది. ముఖ్యంగా కొడవ పద్ధతిలో కత్తులతో కొబ్బరికాయలు కొట్టడం వంటి ఆచారాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. పెళ్లికి ముందు జరిగిన క్రికెట్ మ్యాచ్​లు, సంగీత్ వేడుకలు ఈ పెళ్లిలో మరో హైలైట్ ఎంటర్టైన్మెంట్స్.

తెలుగుంటి కోడలిగా రష్మిక- కెరీర్​పై ఫుల్ క్లారిటీ
రష్మిక మందన్నా అటు కన్నడలో, ఇటు టాలీవుడ్​, బాలీవుడ్​లో భారీ క్రేజ్ అందుకుని ఇప్పుడు తెలుగుంటి కోడలిగా మారిపోయింది. విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత కూడా ఆమె తన కెరీర్​ను మునుపటిలాగే కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ జంట రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే సినిమాలో సందడి చేయనుంది. నేషనల్ క్రష్​గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, పెళ్లి తర్వాత కూడా మరిన్ని మంచి ప్రాజెక్టులతో బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మార్చి 4న హైదరాబాద్​లో రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు అలాగే కన్నడ సెలబ్రిటీలు పాల్గొనే ఛాన్స్ ఉంది.

Mrs.విజయ్: పెళ్లి తర్వాతా ఫుల్ బిజీబిజీ- రష్మిక చేతిలో 8 సినిమాలు!

'కొడువ' పద్ధతిలో విజయ్- రష్మిక మళ్లీ పెళ్లి- ఈ సంప్రదాయంలో వధూవరులకు కఠిన పరీక్ష!