ETV Bharat / entertainment

మూవీలో మూవీ- దుల్కర్ 'కాంత' ఎలా ఉందంటే?

కాంత మూవీ రివ్యూ

Kaantha Movie Review In Telugu
Kaantha Movie Review In Telugu (dulquer salmaan twitter)
author img

By ETV Bharat Telugu Team

Published : November 14, 2025 at 7:53 AM IST

3 Min Read
Choose ETV Bharat

Kaantha Movie Review In Telugu : పీరియడ్ సినిమాల జోరు కొనసాగుతున్న ఈ సమయంలో వచ్చిన మరో ప్రయత్నమే 'కాంత'. గత శతాబ్దం నాటి వాతావరణాన్ని తెరపై నిజంగా నిలబెట్టే కథలకే దుల్కర్‌ సల్మాన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఆ జాబితాలో రానా దగ్గుబాటి కూడా తోడయ్యారు. ఇద్దరూ కలిసి నటించడం మాత్రమే కాదు, నిర్మాతలుగా కూడా చిత్రం మొత్తం భుజాన వేసుకున్నారు. తమిళనాడులో కాంతకు సంబంధించిన కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ, భారీ ప్రచారం మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మరి ఇందులో కథ ఏమిటి? సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ ఏమిటి?
అయ్య (సముద్రఖని) ప్రముఖ దర్శకుడు. తన తల్లి నిజజీవితాన్ని ఆధారంగా చేసుకుని 'శాంత' అనే సినిమా తీయాలనుకుంటాడు. తన శిష్యుడు మహదేవన్ (దుల్కర్ సల్మాన్)‌నే హీరోగా తీసుకుంటాడు. అయితే మధ్యలో వస్తున్న సమస్యలతో సినిమా ఆగిపోతుంది. కొన్నేళ్ల తరువాత తిరిగి అదే ప్రాజెక్ట్ పునఃప్రారంభం అవుతుంది. ఈసారి కూడా మహదేవనే హీరో, కానీ ఒక షరతుతో తాను చెప్పిన క్లైమాక్స్‌తోనే సినిమా తీయాలి. అలాగే సినిమా పేరును కాంతగా మార్చాలని సూచిస్తాడు. మనసులోని ఒక్క కోరిక తన తల్లి కథను తెరపై చూడాలన్న ఆరాటంతో అయ్య అంగీకరిస్తాడు. అయితే సెట్లో దర్శకుడికీ, హీరోకీ అసలు కలిసిరాదు. వీళ్లిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించే పాత్ర కుమారి (భాగ్యశ్రీ బోర్సే). ఆఖరి దశలో సినిమా దాదాపు పూర్తవుతుంది అనేసరికి ఒక్కసారిగా షాకింగ్ ట్విస్ట్. యూనిట్‌లో కీలక వ్యక్తి హత్యకు గురవుతాడు. దోషి ఎవరు? ఎందుకు హత్య జరిగింది? గురువు శిష్యుల మధ్య పెరిగిన విభేదాల వెనుక నిజం ఏమిటి? ఈ కేసు విచారణకు ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. ఇదే కథకు మలుపు.

ఏముంది సినిమాలో?
సినిమా పరిశ్రమలో జరిగే సంఘటనల్ని పట్టుకొని తెరపై చూపించే చిత్రాలు అరుదు. ఆ అరుదును నిలబెట్టిన సినిమానే 'కాంత'. 1950ల సినీ ప్రపంచం, సెట్ల వాతావరణం, నటుల లీనమై నటించే తీరు ఇవన్నీ దర్శకుడు అద్భుతంగా పునఃసృష్టించారు. విజువల్స్ చూసే సరికి ఆ కాలంలో జీవిస్తున్నామనే అనిపిస్తుంది. మొదటి భాగంలో గురుశిష్యుల మధ్య సృజనాత్మక ఘర్షణలు ఆసక్తికరంగా సాగుతాయి. వారి మధ్య పెరిగే ఈగోలు, కళ గురించే ఉన్న పట్టుదల కథను బలంగా నిలబెడతాయి. దుల్కర్ సముద్రఖని మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాలో హైలైట్. అయితే హత్య జరిగాక కథ థ్రిల్లర్ మోడ్‌లోకి మారుతుంది. రానా ఎంట్రీతో పరిశోధన భాగం మొదలైనా, ఆ ట్రాక్ కాస్త సుదీర్ఘంగా సాగిన భావన కలిగిస్తుంది. అయినా చివరి 20 నిమిషాలు కట్టిపడేసేలా ఉంటాయి. హత్య వెనుక ఉన్న నిజం, పాత్రల ప్రవర్తనకు ఉన్న కారణాలు ఇవన్నీ మంచి ఇంపాక్ట్ ఇస్తాయి.

నటుల అభినయం
దుల్కర్ సల్మాన్ మహదేవన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. పాతకాలం హీరోయిజాన్ని సహజంగా ఒదిగించుకున్న తీరు ప్రత్యేకం. మోనోలాగ్ సన్నివేశాల్లో అతని నటన పీక్స్‌లో ఉంటుంది. సముద్రఖని అయ్య పాత్రలో గట్టిగా నిలబడ్డారు. దర్శకుడిగా, తల్లిపట్ల భావోద్వేగాలతో ఉన్న కుమారుడిగా రెండు కోణాల్లోనూ పాత్రను సమర్థంగా మోశారు. రానా దగ్గుబాటి రెండో భాగంలో బలమైన ఉనికిని చూపించారు. పాత్ర పీరియాడిక్ ఫ్రేమ్‌కు ఎక్కువగా తగ్గకపోయినా, స్క్రీన్ ఎనర్జీ పెంచారు. భాగ్యశ్రీ బోర్సే సాదాసీదాగా కనిపించే పాత్రలో మంచి స్థాయి నటనను చూపింది. దుల్కర్‌తో కెమిస్ట్రీ బావుంది.

టెక్నికల్ టీమ్
డానీ సాంచెజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీ అద్భుతం. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లినట్లుగా ఉన్న విజువల్స్ సినిమాకే ప్రధాన బలం. జేక్స్ బెజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ నడకను ఇస్తుంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కథనాన్ని చక్కగా అల్లాడు.

బలాలు

  • దుల్కర్, సముద్రఖని నటన
  • కథలో ట్విస్టులు
  • అద్భుతమైన విజువల్స్

బలహీనతలు– హత్య విచారణ ఎపిసోడ్స్ కొంచెం లాగినట్టు అనిపించవచ్చు
ముగింపు- కాంత సినిమా లోపల సినిమా- పీరియడిక్ డ్రామాలను ఇష్టపడేవారికి తప్పకుండా నచ్చే చిత్రం.

గ్లోబ్​ట్రాటర్ ఈవెంట్​ : వాళ్లకు నో ఎంట్రీ- రాజమౌళి స్పెషల్ వీడియో

రజనీ- కమల్ హాసన్ సినిమాకు బిగ్ షాక్- ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న డైరెక్టర్!