ETV Bharat / entertainment

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో- సెన్సేషనల్ డైరెక్టర్​తో డెబ్యూ

సినీరంగంలోకి అడుగుపెట్టనున్న జయకృష్ణ - తిరుమల బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా!

Jaya Krishna Ghattamaneni New Movie
Jaya Krishna Ghattamaneni New Movie (BA Raju Team 'x' Post)
author img

By ETV Bharat Telugu Team

Published : November 9, 2025 at 1:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

Jaya Krishna Ghattamaneni New Movie : టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు, దివంగత నటుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ (ఘట్టమనేని జయకృష్ణ) తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టనున్నాడు. 'RX 100' ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ యంగ్ హీరోను పరిచయం చేయనున్నారు. కొన్నిరోజులుగా ఆయన అరంగేట్రంపై ప్రచారం జరగ్గా, ఇప్పుడు అధికారిక ప్రకటనతో దీనిపై స్పష్టత వచ్చింది.

స్వయంగా అజయ్ భూపతి సోషల్ మీడియా ద్వారా ఈ ఆసక్తికర విషయాన్ని షేర్​ చేసుకున్నారు. తిరుమల బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని ఆయన షేర్ చేసిన పోస్టర్ సూచిస్తోంది. టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

అయితే మహేశ్‌బాబు తొలి చిత్రం 'రాజకుమారుడు'ను కూడా నిర్మించింది అశ్వనీదత్‌యే కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జయకృష్ణ ఎంట్రీతో మరోసారి ఘట్టమనేని లెగసీ కొనసాగనుందా? అన్నది చూడాలి. అటు ఫ్యాన్స్​ కూడా ఆసక్తిగా ఉన్నారు.

జయకృష్ణ తన తాతయ్య కృష్ణ జయంతి రోజే తన కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. సూపర్ స్టార్ స్ఫూర్తితో రాబోతున్నారు. ఛార్మింగ్ లుక్స్​తో ఉన్న ఘట్టమనేని వారసుడు, ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ తో తెరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జయకృష్ణ లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, మూవీ లవర్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

సెప్టెంబర్​ నుంచి షూటింగ్!
అదే సమయంలో యాక్టింగ్ సహా పలు ఇతర అంశాలపై జయకృష్ణ ట్రైనింగ్ తీసుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ మూవీ టైటిల్​ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. సెప్టెంబర్​లో రెగ్యులర్ షూటింగ్​ను మొదలుపెట్టనున్నారని అప్పట్లో వైరల్​ అయ్యింది.కానీ దీనిపై ఎలాంటి అఫిషియల్​ సమాచారం రాలేదు. మరికొద్ది రోజుల్లో టైటిల్, నటీనటులు, ఇతర సిబ్బంది వివరాలను మేకర్స్ అఫీషియల్​గా వెల్లడించనున్నారు.

తండ్రి ఆశీస్సులతో!
కాగా, జయకృష్ణ తండ్రి రమేశ్ బాబు 1974లో చైల్డ్ ఆర్టిస్ట్​గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు వంటి అనేక సినిమాల్లో నటించారు. బాల నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత మొత్తం 17 సినిమాల్లో నటించారు. కొంత కాలం తర్వాత తన తమ్ముడు మహేష్ బాబు నటించిన అర్జున్, అతిథి సినిమాలకు వ్యవహరించారు. 2022లో అనారోగ్యంతో రమేశ్ బాబు మరణించారు. ఇప్పుడు ఆయన కుమారుడు జయకృష్ణ యంగ్​ హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

సూపర్ స్టార్ 'సూపర్' వారసుడి ఎంట్రీ- ఛార్మింగ్​ లుక్స్​కు అమ్మాయిలు ఫిదా!

హరిద్వార్​లో కృష్ణ అస్థికల నిమజ్జనం.. మనవడి చేతుల మీదుగా..