'విజయ్ దేవరకొండ నా ప్రాణాలు కాపాడాడు'- బ్రిటీష్ నటుడు ఎమోషనల్
విజయ్ వివాహ వేడుక సందర్భంగా జేసన్ షా కీలక వ్యాఖ్యలు - విజయ్ తన ప్రాణాలు కాపాడాడని పొగడ్తలతో ముంచెత్తుతున్న బ్రిటీష్ నటుడు!

Published : February 26, 2026 at 12:23 PM IST
Jason Shah Praises VD: ప్రస్తుతం విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న తమ వివాహ వేడుకల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు వీరిద్దరూ జంటగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న 'రణబాలి' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్లో విడుదల కానుంది. దీంతో మూవీ టీమ్ సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ తన ప్రాణాలు కాపాడాడని జేసన్ షా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులందరూ ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు గూగుల్‌ను తెగ వెతికేస్తున్నారు.
దాదాపు మరణం అంచులదాకా
విజయ్ దేవకొండను పొగుడుతూ బ్రిటన్ నటుడు జేసన్ షా కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'రణబాలి' సినిమా షూటింగ్ చేసే సమయంలో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, తన ప్రాణాలు కాపాడడని తెలిపారు. "సినిమా సెట్లు ఇలా ఉంటాయి, అలా ఉంటాయి అని ప్రేక్షకులు ఎన్నో అంచనాలు వేసుకుంటారు. కానీ అవి వారు అనుకున్న దాని కంటే చాలా విరుద్ధంగా ఉంటాయి. ప్రతి పాత్ర షూటింగ్ సమయంలో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. 'రణబాలి' షూటింగ్ సమయంలోనూ నేనే దాదాపు ప్రాణాలో పోయే పరిస్థితి వచ్చింది." అంటూ చిత్ర నిర్మాణంలో జరిగిన ఘటన గురించి వివరించడం మొదలు పెట్టారు.
విజయ్ నా ప్రాణాలు కాపాడారు
ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో తను స్పృహ కోల్పోయాడని, విజయ్ డార్క్ చాక్లెట్ ఇచ్చి తన ప్రాణాలు కాపాడాడని జేసన్ భావోద్వేగానికి లోనయ్యారు. "ఒక సీన్ కోసం తీవ్రమైన ఎండలో గంటల తరబడి షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో నాపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో దాదాపు నేను స్పృహ తప్పిపడిపోయాను. కానీ ఆ రోజు విజయ్ తన క్యారా వ్యాన్‌లో ఉన్న కొన్ని డార్క్ చాక్లెట్స్ నాకు ఇవ్వకపోయి ఉంటే, ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. ఆ రోజు ఆయన నా ప్రాణాలు కాపాడారు," అంటూ విజయ్ను ప్రశంసించారు.
Jason Shah slays in slays dashing fit at an event 🔥👮! #buzzzooka_events #jasonshah #bollywood #celebrity pic.twitter.com/ksxCWVBsqg
— Buzzzooka Prime (@Buzzzookaprime) November 18, 2024
'రణబాలి' విషయానికి వస్తే
విజయ్ కాంబినేషన్లో వచ్చే సీన్‌ను ప్రేక్షకులు థియేటర్లో చూసి ఆశ్చర్యపోతారని జేసన్ తెలిపారు. విజయ్-రష్మిక వివాహం తర్వాత కలిసి నటించే తొలి చిత్రంగా ఈ చిత్రం నిలుస్తుందని అన్నారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విజయ్ కెరీర్‌కు చాలా కీలకమైన సినిమా అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అతను నటించిన చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా పూర్తిగా విభిన్న జాన్రాలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ టైటిల్ పాత్రలో నటిస్తే, రష్మికా జయమ్మగా కనిపించనున్నారు.
'రౌడీ జనార్ధన్'లో కీర్తి
ఇదిలా ఉండగా గతంలో VD15కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ముగించుకున్నారు. ఆ సినిమాకి రౌడీ జనార్ధన్ అనే పేరును ఖాయం చేశారు. విజయ్‌కు జంటగా ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ మొదటిసారి స్క్రీన్‌పై కనిపించనుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్, దిల్ రాజు కాంబోలో మరోసారి జతకానున్నారు. గతంలో ఈ బ్యానర్‌లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకోలేకపోయింది. ఈసారి విజయ్ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
'Vijay Deverakonda Saved My Life': Jason Shah Recalls Passing Out On Ranabaali Set During Action Sequence#VijayDeverakonda #JasonShah #Ranabaali #ViRash #action #BehindTheScenes #BTS #SouthCinema #HeroicActhttps://t.co/5wfEFxZjRO
— ETV Bharat (@ETVBharatEng) February 25, 2026
గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రౌడీ జనార్ధన ' గ్లింప్స్- ఫుల్ వైలెంట్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ
'రౌడీ జనార్ధన్' సినిమా షురూ- హీరోయిన్గా నేషనల్ అవార్డ్ విన్నర్!

