ETV Bharat / entertainment

విజయ్ 'జననాయగన్' బాలయ్య సినిమా రీమేకేనా?- కొత్త ప్రోమోతో హింట్!

జననాయగన్ సినిమా నుంచి ప్రోమో రిలీజ్- మళ్లీ ఆ ప్రచారం షురూ

Vijay Thalapathy Balakrishana
Vijay Thalapathy Balakrishana (Source : Movie Poster, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 9, 2025 at 8:50 AM IST

2 Min Read
Choose ETV Bharat

Vijay Thalapathy Jana Nayagan : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌- హెచ్‌. వినోద్‌ కాంబోలో 'జన నాయగన్‌' (జన నాయకుడు) సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మమితా బైజు, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది విజయ్ కెరీర్​లో ఆఖరి సినిమా అని ఇప్పటికే ఆయన ప్రకటించేశారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఇది నందమూరి బాలకృష్ణ నేషనల్ అవార్డ్ సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని తొలి నుంచీ ప్రచారం జరుగుతోంది. కానీ దీనిని మేకర్స్ తోసిపుచ్చారు.

అప్పట్లో అనిల్ క్లారిటీ!
గతంలో ఓ సినిమా ఫంక్షన్​లో 'భగవంత్ కేసరి' దర్శకుడు అనిల్ రావిపూడి కూడా విజయ్ 'జననాయగన్' కథ వేరు అని చెప్పారు. ఆయన భగవంత్ కేసరి, విజయ్​ తాజా చిత్రం జననాయగన్ స్టోరీ ఒకటి కాదని స్పష్టతనిచ్చారు. ఇక ఈ ఏడాది జూన్​ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి ఆయన లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపించారు. కత్తి పట్టుకొని విలన్లకు ఎదురెళ్తున్నట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు.

దీంతో అభిమానులు కూడా జననాయగన్​ను బాలయ్య భగవంత్ కేసరి రీమేక్​ కాదని అనుకున్నారు. ఎందుకంటే భగవంత్​ కేసరి సినిమాలో కీలక పాత్ర బాలయ్యది పోలీస్ క్యారెక్టర్ కాదు. కానీ, జననాయగన్​లో విజయ్ పోలీసు పాత్రలో పోస్టర్ రిలీజ్ చేసేసరికి ఈ రెండు సినిమాలు వేర్వేరు కథలని భావించారు. కానీ, తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఓ పాట ప్రోమోతో మళ్లీ రీమేక్ అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

ఈ ప్రోమోలో ఫీమేల్ లీడ్స్ పూజా, మమిత బైజుతో విజయ్ డ్యాన్స్ చేస్తున్నారు. ఓ వేడుకలో ఈ ముగ్గురు సంబరాలు చేసుకుంటున్నట్లు వీడియోలో ఉంది. అయితే బాలయ్య 'భగవంత్ కేసరి' లో ఇలాంటి వేడుకకు సంబంధించిన పాట ఉంది. ఇది కూడా అలాంటిదే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ప్రోమోతో ఇది భగవంత్ కేసరి రీమేక్ అని ప్రచారం మరోసారి మొదలైంది. అంతేకాదు మేకర్స్ కేవీఎన్ ప్రొడక్షన్స్ భగవంత్ కేసరి రీమేక్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుందని, ఒరిజినల్ స్టోరీకి కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

హెచ్ వినోద్ తెరక్కిస్తున్న ఈ సినిమాలో పూజా, మమితతోపాటు బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేవోల్, మోనిషా బ్లెసీ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 09న గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుంది.