ETV Bharat / entertainment

టాలీవుడ్​లో తీవ్ర విషాదం- 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' అధినేత ఆర్​బీ చౌదరి కన్నుమూత

టాలీవుడ్​లో తీవ్ర విషాదం- నిర్మాత ఆర్​బీ చౌదరి మృతి!

RB Choudary
RB Choudary (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2026 at 7:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

RB Choudary Passed Away : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్​ అధినేత ఆర్​బీ చౌదరి (81) కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. రాజస్థాన్​లోని స్వస్థలానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ఉదయ్​పుర్​లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చౌదరి మృతిచెందారు. ఆయన మరణ వార్తతో సినీ లోకం​ దిగ్బ్రాంతికి గురైంది. ఆర్​బీ చౌదరి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఎవర్​గ్రీన్ సినిమాలు
కాగా, సూపర్ గుడ్ ఫిల్మ్స్ (Super Good Films) అనే బ్యానర్​ను స్థాపించిన చౌదరి 90వ దశకంలో అనేక హిట్ సినిమాలు రూపొందించారు. ఈ బ్యానర్​పై తెలుగుతోపాటు తమిళం, మళయాళం, కన్నడ సహా పలు భాషల్లో ఆయన సినిమాలు నిర్మించారు. ఆర్‌బీ చౌదరి 90కి పైగా సినిమాలు నిర్మించిన ఆయన ఎందరినో దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ బ్యానర్​పై తెలుగులో అనేక క్లాసిక్​ సినిమాలు రూపొందాయి. అందులో 'సుస్వాగతం', 'సూర్యవంశం', 'రాజా' 'నువ్వొస్తావని', 'నిన్నే ప్రేమిస్తా', 'స్నేహమంటే ఇదేరా', 'ప్రియమైన నీకు', 'సింహరాశి', 'శివరామరాజు', 'సంక్రాంతి', 'భీమిలి కబడ్డీజట్టు' లాంటి ఎవర్ గ్రీన్​ సినిమాలను చౌదరి నిర్మించారు.

అలా సినిమాల్లో ఎంట్రీ
తమిళనాడు చెన్నైలో ఆర్​బీ చౌదరి జన్మించారు. ఆయనది రాజస్థానీకి చెందిన కుటుంబం. ఆర్​బీ చౌదరి పూర్తి పేరు రతన్‌లాల్‌ భగత్‌రామ్ చౌదరి (RB Choudhary). తొలుత మలయాళ సినిమాతో నిర్మాతగా సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1989లో కోలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత 'సూపర్' బ్యానర్​తో సినిమాలు రూపొందించిన ఆయన, తర్వాత ఆ బ్యానర్​ను 'సూపర్ గుడ్ ఫిల్మ్స్​' గా మార్చారు. ఆయన నిర్మించిన వసంతం (తమిళం), రాజా (తెలుగు), ఆనందం (తమిళం) సినిమాలకుగానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. అలాగే నాటామై, సూర్యవంశం, తుల్లాధ మనముమ్ తుల్లుం సినిమాలతు తమిళనాడు స్టేట్ అవార్డులు దక్కించుకున్నారు.

కుమారుడూ హీరోనే
ఆర్​బీ చౌదరికి నలుగురు కుమారులు. అందులో ఒక కుమారుడు కోలీవుడ్​ హీరో జీవా. ఆయన రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. 2011లో వచ్చిన ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి విజయం అందుకుంది. ఇంకో కుమారుడు జితన్ రమేశ్ కూడా సినిమాల్లో ఉన్నారు. ఆయన పిజ్జా 2, రీసెంట్​గా ఐశ్వర్య రాజేష్‌ లీడ్​లో వచ్చిన ఫర్హానా సినిమాల్లో నటించారు. మిగిలిన ఇద్దరు వ్యాపార రంగాల్లో ఉన్నారు.

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత

టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబు కన్నుమూత