ETV Bharat / entertainment

ఘట్టమనేని జయకృష్ణ సినిమా టైటిల్ రిలీజ్- ఇంట్రెస్టింగ్​గా ఫస్ట్ పోస్టర్

ఘట్టమనేని జయకృష్ణ సినిమా టైటిల్​ను విడుదల చేసిన మూవీ టీమ్ - పోస్టర్​లో ఏముందంటే?

Ghattamaneni Jayakrishna
Ghattamaneni Jayakrishna (BA Raju Team 'x' Post)
author img

By ETV Bharat Telugu Team

Published : November 27, 2025 at 1:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ghattamaneni Jayakrishna Movie Title : టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు, దివంగత నటుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ (ఘట్టమనేని జయకృష్ణ) తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టనున్నాడు. 'RX 100' ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ యంగ్ హీరోను పరిచయం చేయనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్​​డేట్​ బయటికి వచ్చింది. టైటిల్​ ప్రకటిస్తూ ఒక పోస్టర్​ను విడుదల చేశారు. మరి సినిమా టైటిల్ ఏంటంటే?

శ్రీనివాస మంగాపురంలో ఘటమనేని వారసుడు
ఘట్టమనేని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఘట్టమనేని జయకృష్ణ టాలీవుడ్​లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవలే దీనిపై అఫిషియల్​ కన్ఫర్మేషన్​ను మూవీటీమ్​ ప్రకటించింది. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్​ పోస్టర్​తో పాటు, హీరో ప్రీ లుక్​ను కూడా ప్రేక్షకుల కోసం రివీల్​ చేశారు. భక్తి, రహస్యం, ఇతిహాస నాటకానికి సంబంధించిన వాగ్దానంలో పాతుకుపోయిన శక్తిమంతమైన పేరు "శ్రీనివాస మంగాపురం". ఇదే ఈ చిత్రానికి టైటిల్​గా ప్రకటించారు.

పోస్టర్​ ఎలా ఉందంటే!
సోషల్​ మీడియాలో విడుదల చేసిన పోస్టర్​లో అతనితో పాటు అతని ప్రియురాలు చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అతని చేతికి గాయమై ఉంది. అదే చేత్తో గన్​ను పైకి ఎత్తి పట్టుకున్నాడు. అందులో అతని ఆపుతున్నట్లు కనిపిస్తుంది. వారి ప్రేమకు ఎదురైన ప్రమాదం గురించి హింట్​ ఇస్తున్నట్లు తెలుస్తుంది. బ్యాగ్​డ్రాప్​లో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు, ప్రశాంతమైన కొండలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్​ ఫ్రేమ్​ ఎలా ఉందంటే ప్రతీకవాదం, లోతును ప్రతిబింబిస్తున్నాయి.

పోస్టర్​కు హీరో క్యాప్​షన్​
ఈ పోస్టర్​ను ట్యాగ్​ చేస్తూ ఘట్టమనేని జయకృష్ణ దానికి సంబంధించిన వివరాల్ని వర్ణిస్తూ క్యాప్​షన్​ను పెట్టారు. అందులో 'రెండు జీవితాలు- ఒకే ప్రయాణం. రెండు చేతులు- ఒకే వాగ్దానం. రెండు హృదయాలు - ఒక విధి' అంటూ వివరించారు. అలానే AB4 అనేది శ్రీనివాసమంగపురం అంటూ హ్యాష్​ట్యాగ్​ జోడించారు. ప్రేమకథల ప్రపంచంలో శాశ్వతమైన అధ్యాయంగా నిలిచే ఒక కల్ట్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రేక్షకులకు తెలిపారు. సినిమాకు సంబంధించిన షూటింగ్​ పనులు క్రమంగా జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్​తో పాటు మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో విడుదల చేస్తామంటూ పోస్ట్​లో తెలిపారు.

మూవీ టీమ్​ గురించి
అశ్విని దత్, నిర్మాత పి కిరణ్‌లు కలిసి చందమామ కథలు బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయ కృష్ణ సరసన రాషా తడా నటిస్తున్నారు. ఈ ఫిల్మ్​ హీరోయిన్​ డెబ్యూ ఫిల్మ్​ కావడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి వరుస అప్​డేట్లను మూవీ టీమ్​ విడుదల చేస్తుంది. త్వరలోనే ఈ చిత్రం నుంచి ఫుల్ పోస్టర్​ను విడుదల చేయనున్నారు.

తండ్రి ఆశీస్సులతో!
కాగా, జయకృష్ణ తండ్రి రమేశ్ బాబు 1974లో చైల్డ్ ఆర్టిస్ట్​గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు వంటి అనేక సినిమాల్లో నటించారు. బాల నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత మొత్తం 17 సినిమాల్లో నటించారు. కొంత కాలం తర్వాత తన తమ్ముడు మహేష్ బాబు నటించిన అర్జున్, అతిథి సినిమాలకు వ్యవహరించారు. 2022లో అనారోగ్యంతో రమేశ్ బాబు మరణించారు. ఇప్పుడు ఆయన కుమారుడు జయకృష్ణ యంగ్​ హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో- సెన్సేషనల్ డైరెక్టర్​తో డెబ్యూ

సూపర్ స్టార్ 'సూపర్' వారసుడి ఎంట్రీ- ఛార్మింగ్​ లుక్స్​కు అమ్మాయిలు ఫిదా!