ETV Bharat / entertainment

OTTలో టాప్​ ప్లేస్​లోకి 'భగవంత్​ కేసరి'- 'జన నాయకుడి' ఎఫెక్టేనా?

ఓటీటీలో ట్రెండింగ్‌లో టాప్‌1లోకి భగవంత్ కేసరి- అమెజాన్ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న బాలయ్య చిత్రం​

Janayakudu Vs Bhagavanth kesari
Janayakudu Vs Bhagavanth kesari (Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : January 5, 2026 at 11:17 AM IST

3 Min Read
Choose ETV Bharat

Janayakudu Vs Bhagavanth kesari: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్​ కథానాయకుడిగా ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా 'జన నాయగన్​' (తెలుగులో జన నాయకుడు). ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్​ డేట్​ను అనౌన్స్​ చేశారు మూవీ మేకర్స్​. అంతే కాకుండా ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం దీని విడుదలకు ముందు భగవంత్​ కేసరి సినిమా ఓటీటీలో ట్రెండింగ్‌లో టాప్‌ వన్‌లోకి వచ్చింది. అందులో బాలకృష్ట, శ్రీలీల కీ రోల్​లో నటించారు.

అయితే గత కొన్ని రోజులుగా 'జన నాయగన్‌' బాలకృష్ణ 'భగవంత్‌ కేసరి'కి రీమేక్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై రెండు సినిమాల దర్శకులు స్పందించినప్పటికీ వీటికి చెక్‌ పడలేదు. ఇప్పుడు ఈ ప్రచారం సాగుతున్నప్పటి నుంచి అందరూ 'భగవంత్‌ కేసరి' సినిమాను తెగ చూసేస్తున్నారు. దీంతో అమెజాన్‌ ప్రైమ్‌లో రెండేళ్ల క్రితం స్ట్రీమింగ్​కు వచ్చిన చిత్రం, ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో టాప్‌1లోకి రావడం గమనార్హం.

భగవంత్​ కేసరికి రీమేకేనా?
ఈ రీమేక్‌ వార్త ప్రచారం జరుగుతుండడంతో దర్శకుడు హెచ్‌.వినోద్‌ ఇటీవల స్పందించారు. 'నేను ఈ విషయాన్ని ధ్రువీకరించను. అలాగే కొట్టిపారేయను. ఇంతకుముందు కూడా మీకు ఈ విషయం చెప్పాను. ఇది దళపతి మూవీ. ఇది రీమేకా? లేదా ఏదైనా చిత్రం నుంచి స్ఫూర్తిపొంది తీశారా? అన్న విషయంపై ప్రేక్షకులు ఆందోళనపడాల్సిన అవసరం లేదు' అని అన్నారు.

అలాగే 'భగవంత్‌ కేసరి' దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా ఈ ప్రచారంపై మాట్లాడారు. 'విజయ్‌ను నేను రెండు, మూడుసార్లు కలిశాను. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. 'జన నాయకుడు' కథ ఏంటనేది ఆ సినిమా విడుదలైన తర్వాతే మీకు అర్థమవుతుంది' అని చెప్పారు. అంతేకాక ఈ చిత్రం విజయ్‌ చివరి సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఆ సినిమా రీమేకే అని అర్థమైపోతుంది. సినిమాలో మెయిన్ పాయింట్​నే ఇందులోనూ వాడేశారు. అందులో శ్రీలీల పాత్రను ఇందులో మమిత బైజు పోషించారు. పైగా ఆ పాత్ర పేరు కూడా అదే (విజ్జి) కావడం విశేషం. ఈ పాయింట్​తోపాటు ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో పోలికలు ఉన్నట్లు కనిపిస్తుంది.

సెకండ్​ హాఫ్​ పొలిటికల్​గా
కొన్ని థీమ్స్​ సేమ్​ ఉన్నప్పటికి అందులోని సెకండ్ హాఫ్ మాత్రం పొలిటికల్ టచ్​లో పూర్తి డిఫెరెంట్​గా ఉండనుంది. 'ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లో రమ్మంటే, దోచుకోడానికంట్రా రాజకీయాల్లోకి వచ్చేది' అనే డైలాగుతో అది క్లియర్​గా అర్థమవుతుంది. అలాగే 'ఐయామ్ కమింగ్' అంటూ విజయ్​ చెప్పిన డైలాగ్ ఆయన రియల్ లైఫ్​కు సూట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. విజయ్​ కూడా ఇటీవల సొంతగా పార్టీ ఓ స్థాపించి క్రీయాశీలక రాజకీయాల్లో ఉంటున్నారు. దీంతో ఈ సినిమా ఆయన పొలిటికల్ కెరీర్​కు కూాడా వర్కౌట్ అయ్యేలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా సిద్ధమవుతోన్న ఈ మూవీలో విజయ్‌ సరసన పూజాహెగ్డే కథానాయికగా కనిపించనున్నారు. మరి ఈ సినిమా థియేటర్లలో వచ్చాక ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

2023లో బ్లాక్​బాస్టర్​గా 'భగవంత్ కేసరి'
'భగవంత్ కేసరి' విషయానికొస్తే, ఈ సినిమా 2023లో బాక్సాఫీస్ వద్దకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే మొయిన్​ కాన్సెప్ట్​తోనే ఈ సినిమా కథాంశం ఉంటుంది. ఇందులో కాజల్ అగర్వాల్​తోపాటు శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. భారీ విజయం దక్కించుకున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు సైతం దక్కింది. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్​ అవుతోంది.

విజయ్ 'జననాయగన్' బాలయ్య సినిమా రీమేకేనా?- కొత్త ప్రోమోతో హింట్!

'జన నాయకుడు' మూవీ ట్రైలర్ రిలీజ్- రీమేక్​ ప్రచారంపై క్లారిటీ వచ్చేసినట్లే!