ETV Bharat / entertainment

Divvela Madhuri Rules: బిగ్​బాస్​ హౌజ్​లో మాధురి రూల్స్​ - మాకేంటీ కర్మ అంటున్న ఆడియన్స్​!

- కంటెసెంట్స్​కు నేరుగా వార్నింగ్​! - ఆమె చెప్పింది పాటించాల్సిందేనట!

Divvela Madhuri Rules in Bigg Boss 9 Telugu
Divvela Madhuri Rules in Bigg Boss 9 Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 16, 2025 at 5:25 PM IST

3 Min Read
Choose ETV Bharat

Divvela Madhuri Rules in Bigg Boss 9 Telugu: "బిగ్​బాస్​ హౌజ్​లో వైల్డ్​కార్డ్​ కంటెస్టెంట్​గా అడుగుపెట్టిన దివ్వెల మాధురి ఓవర్​ యాక్షన్​ మామూలుగా లేదు. వచ్చినప్పటి నుంచి పూటకో గొడవ ఉండాల్సిందే అన్నట్టుగా బిహేవ్​ చేస్తోంది. ఎవరైనా ఇది తప్పు అని చెబితే వారిపై నోరేసుకోని పడిపోతోంది." ఇదీ సగటు ఆడియెన్స్​ ఫీలింగ్. మరికొంత మందైతే నెక్స్ట్​ ఎలిమినేషనల్​ పంపించేయండి సార్ అంటూ దూకుడులో బ్రహ్మానందం మాదిరిగా బిగ్​ బాస్​కు రిక్వెస్ట్​ చేస్తున్నారు కూడా! మరి, హౌస్​లో ఆమె తీరు ఎలా ఉందో.. దానిపై కంటిస్టెంట్స్ తోపాటు, సోషల్​ ట్రెండ్స్​ ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం.

హౌజ్​లో బిగ్​బాస్​ రాజు లెక్క. అతను చెప్పిందే వేదం. సీజన్​ ఏదైనా, కంటెస్టెంట్స్​గా ఎవరు వచ్చినా బిగ్​బాస్​ కనుసన్నల్లోనే మెలగాలి. వివరంగా చెప్పాలంటే ఆయన చెప్పే రూల్స్​ను తూచా తప్పకుండా పాటించాలి. దీనికి తగ్గట్టుగానే కంటెస్టెంట్స్​ మసులుకుంటారు. షో స్టార్ట్​ అయినప్పటి నుంచీ ఇదే పద్ధతి. ఒకవేళ బిగ్​బాస్​ చెప్పిన మాట వినలేదంటే పనిష్మెంట్​ కూడా ఉంటుంది. ప్రసుత్త సీజన్​లో కూడా కంటెస్టెంట్స్​ అందరూ బిగ్​బాస్​ మాట వింటున్నారు. కానీ వైల్డ్​ కార్డ్​గా అడుగుపెట్టిన మాధురి మాత్రం బిగ్​బాస్​ హౌజ్​ను తన ఇల్లు లెక్క ఫీలవుతోందని అంటున్నారు.

సందర్భం ఏదైనా గొడవ కచ్చితం అన్నట్టు ప్రవర్తిస్తోందనేది ప్రధాన కంప్లైంట్. దీంతో హౌజ్​మేట్స్​ ఆవిడ ముందు నోరెత్తాలంటే ఒకింత భయపడిపోతున్నారు కూడా! మరీ, ముఖ్యంగా దివ్య, నిఖితను ఆమె టార్గెట్​ చేసినట్లు కనిపిస్తోందంటున్నారు. ఆ అమ్మాయి కనిపిస్తే కయ్యానికి కాలుదువ్వుతుండడమే ఇందుకు కారణం! ఇలా తన బిహేవియర్​తో నెగెటివ్ షేడ్​ మూట గట్టుకుంటున్న మాధురి.. తాజాగా డోస్ పెంచింది. "నా హౌస్.. నా ఇష్టం" అన్నంతగా బిల్డప్ ఇస్తూ కొత్త ఆమె రూల్స్​ కూడా పెట్టేసింది! అంతేకాదు, "నా రూల్స్​ పాటించకపోతే హౌజ్​లో ఉండొద్దు" అని బాహాటంగానే చెబుతోంది. ఈ రూల్స్​ గురించే రీతూ చౌదరి, మాధురి మధ్య ఓ రేంజ్​లో గొడవ జరిగింది.

మాధురి రూల్స్​ ఇవే..

  • నాకు నచ్చినట్టు ఉంటా.. నచ్చినట్టు తింటా.. ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు. నేను తినేదానికి ఎవరి పర్మిషనూ​ అడగాల్సిన అవసరం లేదు.
  • రెండు కప్పుల పప్పు అందరికీ సరిపోవాలంటే బకెట్ నీళ్లు పోసి చేస్తా. చచ్చినట్టు తినాల్సిందే. కర్రీ సరిపోలేదు.. ఫుడ్ సరిపోలేదని నాకు చెప్పడానికి వీళ్లేదు.
  • స్నానం చేసి మాత్రమే వంట చేస్తా. నేను స్నానం చేసొచ్చి వంట చేసేవరకూ వెయిట్ చేయాల్సిందే. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోను.
  • బిగ్​బాస్​ లైట్స్​ ఆర్పిన వెంటనే అందరూ పడుకోవాలి. గుసగుసలు, చెవులు కొరుక్కోవడాలు, నవ్వడాలు లేదు. నైట్​ నుంచి మార్నింగ్​ సాంగ్​ వరకు సౌండ్​ రావొద్దు. ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే గార్డెన్​ ఏరియాకి వెళ్లాల్సిందే. ఈ రూల్​ ఫాలో కానివాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లొచ్చు.
  • ఫుడ్ మానిటర్‌గా దివ్య నచ్చలేదు తీసేయండి. ఆమె ఫుడ్​ మానిటర్​గా ఉంటే నేను తినను. బాండింగ్‌లు పెట్టుకోవడానికి వీళ్లేదు. కానీ నేను మాత్రం రాజా రాజా అని పిలుస్తా.
  • ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఆమె ఫ్రేమ్‌లో కనిపించిన ప్రతిసారీ.. గొడవలు, ఎదటివాళ్లని దూషించడం.. వాళ్ల గురించి బ్యాడ్‌గా మాట్లాడటం. ఇవి తప్పితే ఇప్పటివరకూ దివ్వెల మాధురిలో ఒక్క పాజిటివ్ కూడా కనిపించలేదంటున్నారు ఆడియెన్స్

అటు కంటెస్టెంట్స్​.. ఇటు ఆడియన్స్​కు తలనొప్పి: ఇక బిగ్​బాస్​ హౌజ్​లో మాధురి చేసే రచ్చ గురించి అటు కంటెస్టెంట్స్​, ఇటు ఆడియన్స్​ రకరకాలుగా ఫీల్​ అవుతున్నారు. దివ్య అయితే ఏకంగా మెంటల్​ గాళ్లను తెచ్చారు బిగ్​బాస్​ హౌజ్​కి అని అనేసింది. ఇక సోషల్​ మీడియాలో కామెంట్స్​కు లెక్కేలేదు. "ఏం కర్మా రా నాయన మాకు", 'ఆ నోటికి ప్లాస్టర్​ వెయ్యండి బాస్​", "ఇలాంటి వాళ్లను ఎలిమినేట్​ చేసేయండి బిగ్​బాస్​" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏదేమైనా హౌజ్​లోకి వచ్చి రెండు రోజులు కాకపోయినా తన ఓవర్​యాక్షన్, ఆటిట్యూడ్​, గొడవలతో అటు ఆడియన్స్​కు, ఇటు కంటెస్టెంట్స్​కు తలనొప్పిగా మారింది మాధురి. మరి, ఇప్పటికైనా ఆమె ఆట తీరు మార్చుకుంటుందా? వచ్చే వారం వెళ్లిపోతుందా? బిగ్​ బాస్​ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది చూడాలి.

Bigg Boss 9 Day 38 Review : కిచెన్​లో "అంట్ల గొడవ" - రీతూ, అయేషా సిగపట్లు!

Bigg Boss 9 Telugu Today Promo : స్టిక్కర్స్​ గురించి సంజనా, మాధురి గొడవ - ఫుడ్​ లిస్టుతో రమ్య షాక్!