'ఆజాద్ హింద్ ఫౌజ్'- OG యూనివర్స్ నుంచి గ్లింప్స్ ఔట్
ఓజీ యూనివర్స్ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసిన దర్శకుడు సుజీత్ - సోషల్ మీడియాలో ఫుల్ వైరల్

Published : September 2, 2026 at 4:42 PM IST
OG Universe Glimps : పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఓజీ యూనివర్స్' నుంచి డైరెక్టర్ సుజీత్ స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో పవన్ కల్యాణ్‌తో దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుకున్నట్లు చూపించారు. ఈ ముగ్గురు ఓజీ యూనివర్స్ గురించి చర్చించుకుంటున్నట్లు వీడియోలో ఉంది. 1.31 నిమిషాల రన్టైమ్తో ఉన్న గ్లింప్ల్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది.
ఇండియన్ ఆరిజిన్ - నార్త్ఈస్ట్ ఎమోషన్స్
ఓజీ సీక్వెల్ కథాంశం భారతీయ నేపథ్యంలో సాగుతూనే, సౌత్ఈస్ట్ తరహా భావోద్వేగాలు, వెస్ట్రర్న్ ప్రెజెంటేషన్‌తో ఉంటుందని తమన్ వీడియోలో పేర్కొన్నారు. దీనికి పవన్ కల్యాణ్ ఇచ్చిన రిప్లై యూనివర్స్‌పై అంచనాలు పెంచింది. ఇందులో సుభాశ్ చంద్రబోస్ పాత్రను చేర్చడం వల్ల సినిమాకు మరింత బలం చేకూరిందని పవన్ అన్నారు. అలాగే 'దీనికి మనం శాయశక్తులా కష్టపడదాం' అని అన్నారు. అలాగే ఓజీ నుంచి రానున్న సినిమాల్లో 'సమురాయ్' (జపనీస్ కత్తి విద్య) అనే అంశం కీలకంగా ఉండబోతోందనే విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌తోపాటు యానిమేటెట్ విజువల్స్‌ను చూపించారు. ఇందులోనే నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ఫొటో కూడా ఉంది. ఇది గ్లింప్స్‌కు హైలైట్ అయ్యింది. అభిమానులకు కూడా ఈ విజువల్స్ ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. ఈ లెక్కన ఈ యూనివర్స్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి ఇప్పటి కాలం దాకా జరిగిన సంఘటనలను చూపించనున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
From the #OGUniverse
— Sujeeth (@Sujeethsign) September 2, 2026
To the #OG…
ALL LOVE for everything so far…
And everything that begins from here :) 🧿🧿♥️♥️
Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk
షూటింగ్ ఎప్పుడు?
ఈ సీక్వెల్ పవన్ కల్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం స్ట్రిప్ట్ దశలో ఉన్న 'ఓజీ 2' వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ఫుల్‌టైమ్ పాలిటిక్స్‌లోనే ఉంటున్నారు. రీసెంట్గా ఆయన భుజానికి సర్జరీ కూడా జరిగింది. ఇందులోంచి పూర్తిగా కోలుకునేందుకు టైమ్ పట్టొచ్చు. అందుకే ఈ ఏడాది షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు లేనట్లే! తాజా వీడియోతో మ్యూజిక్ తమనే అందిస్తారని క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సీక్వెల్లో కొత్తగా ఇంకెవరెవరు నటీనటులు రానున్నారు? ఏయే పాత్రలు ఉండన్నాయో అనే వాటిపై మున్ముందు క్లారిటీ రావచ్చు! ఏదేమైనా ఈ అప్జేట్తో పవర్‌స్టార్ ఫ్యాన్స్‌లో మాత్రం కొత్త జోష్ వచ్చింది. ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఓజీ సీక్వెలే అని క్లారిటీ వచ్చినందుకు మరింత హ్యాపీగా ఉన్నారు.
కాగా, సుజీత్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన ఓజీ మంచి విజయం సాధించింది. ముంబయి మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. 2025 సెప్టెంబర్ 25న రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. దీంతో పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు అందుకున్న సినిమానూ ఇది రికార్డు కొట్టింది. ఇందులో ప్రియాంకా మోహన్ ఫీమేల్ లీడ్‌లో కనిపించగా, శ్రేయా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ అందించిన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తెలుగుతోపాటు హింది, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
'ఓజీ' యూనివర్స్‌లో సుభాష్ చంద్రబోస్- సుజీత్ వేరే లెవెల్ ప్లాన్- ఫ్యాన్స్‌కు పూనకాలే!
పవన్ ఫ్యాన్స్‌కు సుజీత్ సర్‌ప్రైజ్- ఓజీ నుంచి స్పెషల్ అప్‌డేట్

