ETV Bharat / entertainment

గ్లోబ్​ట్రాటర్ ఈవెంట్​ : వాళ్లకు నో ఎంట్రీ- రాజమౌళి స్పెషల్ వీడియో

గ్లోబ్​ట్రాటర్ ఈవెంట్​పై జక్కన్న స్పెషల్ వీడియో- అందరూ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

SSMB29
SSMB29 (Source : Rajamouli 'x' Video)
author img

By ETV Bharat Telugu Team

Published : November 13, 2025 at 1:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

Globetrotter Event : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం గ్లోబ్​ట్రాటర్ ఈవెంట్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ భారీ ఈవెంట్​కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్​లో వీడియో గ్లింప్స్, సినిమా టైటిల్, మహేశ్ పోస్టర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. రెండు రోజుల్లో ఈవెంట్​ ఉండగా, దర్శకుడు రాజమౌళి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈవెంట్​కు వచ్చే అభిమానులు పాటించాల్సిన రూల్స్ గురించి చెప్పారు.

ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం!
ఈ గ్లోబ్​ట్రాటర్ ఈవెంట్ ఓపెన్ ఈవెంట్ కాదని, ఫిజికల్ పాస్​లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని చెప్పారు. సోషల్ మీడియాలో పాస్​లు అమ్ముతున్నారని వస్తున్న ప్రచారం అబద్ధం అని, ఫేక్ న్యూస్​లు నమ్మవద్దని చెప్పారు. అందరి భద్రత దృష్యా అభిమానులు పోలీసులకు సహకరించాలని, పాస్​ తమవెంట తెచ్చుకోవడం మాత్రం తప్పనిసరి అన్నారు. చిన్న చిన్న తప్పుల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని జక్కన్న చెప్పారు.

ఎలా రావాలంటే?
ఈవెంట్‌కు ఎలా రావాలో కూడా రాజమౌళి వివరంగా చెప్పారు. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ మూసేసి ఉంటుందని అన్నారు. అందుకే విజయవాడ నుంచి వచ్చే వాళ్లు ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్‌కు ముందే లెఫ్ట్ తీసుకుని ఈవెంట్​కు చేరుకోవచ్చని, ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్లు అనాజ్​పుర్, సాంఘీ నహర్ మీదుగా రావొచ్చని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పాస్​పైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ చూపిస్తుందని, అది ఫాలో అయ్యి ఈవెంట్​ వద్దకు చేరుకోవచ్చని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఈవెంట్​కు రావొచ్చని చెప్పారు.

వాళ్లకు ఎంట్రీ లేదు!
అలాగే ఈ ఈవెంట్​కు 18ఏళ్ల లోపున్న వాళ్లకు, సీనియర్ సిటిజన్లకు ఎంట్రీ లేదని చెప్పేశారు. వాళ్లు వచ్చేందుకు పోలీసులు అనుమత నిరాకరించారని, ఇది గమనించి అందరూ సహకరించాలని కోరారు. అలాంటి వాళ్లు ఇంటి దగ్గర్నుంచే ఈవెంట్​ను లైవ్ స్ట్రీమింగ్​లో చూడాలని అన్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ జియోస్టార్​లో ఇది లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.

రెండు పోస్టర్లు రిలీజ్
ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే రెండు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. కీలక పాత్రలు పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ', ప్రియాంకా చోప్రా 'మందాకిని' పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక మహేశ్ బాబు పోస్టర్ రిలీజ్ చేయడమే బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ పోస్టర్​ను రెండు రోజుల్లో వదులుతారా? లేదా ఈవెంట్​లోనే బిగ్​ స్క్రీన్​పై రిలీజ్ చేస్తారా? అనేది చూడాలి!

గ్లోబ్​ట్రాటర్ అప్డేట్లు- ఇక మిగిలింది 'బాబు' పోస్టరే

'బిజ్జలదేవ నుంచి కుంభ దాకా'- టాలీవుడ్​లో కొత్త ట్రెండ్- ఈ విలన్లు మోస్ట్​ పవర్​ఫుల్​ బాబోయ్!