'స్పిరిట్' నుంచి కొత్త పోస్టర్- మూవీలో విలన్ లుక్ రివీల్- సందీప్ రెడ్డి సర్ప్రైజ్
ప్రభాస్ స్పిరిట్ నుంచి సాలిడ్ అప్డేట్- క్రేజీ పోస్టర్ షేర్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి- క్షణాల్లో వైరల్!

Published : February 27, 2026 at 6:22 PM IST
Vivek Oberoi Spirit : టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా శుక్రవారం సోషల్ మీడియాలో అధికారికంగా షేర్ చేశారు. 'స్పిరిట్‌లో ప్రతినాయకుడిగా నటిస్తున్న మిస్టర్. వివేక్ ఆనంద్ ఒబెరాయ్‌ను పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అంటే ఈ సినిమాలో విలన్‌గా వివేకే నటిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది!
ఈ పోస్టర్లో వివేక్ లుక్ ట్రెండీగా ఉంది. చేతిలో తల్వార్, కళ్లకు గాగుల్స్, నోటిలో సిగార్‌తో మాస్ లుక్‌లో పోస్టర్ ఉంది. పొస్టర్‌లో ఆయన కుర్తా ధరించి, సోఫాపై ఓ కాలు వేసి నిల్చొని ఉన్నారు. పక్కనే ఓ అమ్మాయి కింద కూర్చొని ఉంది. మొత్తానికి ఈ పోస్టర్‌తో సందీప్ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది. అంతేకాకుండా ఇందులో కొరియన్ నటుడు డాన్ లీ విలన్ పాత్ర పోషిస్తున్నారంటూ ప్రచారం సాగింది. అయితే సందీప్ తాజాా అప్డేట్తో డాన్లీ నటించడంపై క్లారిటీ వచ్చేసింది.
Presenting you all, the antagonist of the film SPIRIT.
— Sandeep Reddy Vanga (@imvangasandeep) February 27, 2026
Mr. Vivek Anand Oberoi. pic.twitter.com/e0imSbSDmm
ఇప్పటిదాకా అధికారికంగా మేకర్స్ హీరోయిన్, విలన్ పాత్రలను మాత్రమే అనౌన్స్ చేశారు. ఇంకా సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేే దానిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రకాశ్ రాజ్ కూడా ఇందులో ఉన్నట్లు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, గతేడాది రిలీజైన గ్లింప్స్‌లో ఆయన వాయిస్ ఉండడంతో ప్రకాశ్ రాజ్ ఇందులో పక్కా నటించే అవకాశం ఉంది! దీంతోపాటుగా న్యూఇయర్ కానుకగా ఇటీవల ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా వదిలారు. ఇక రీసెంట్గా దర్శకుడు సందీప్ రెడ్డినే స్వయంగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్‌తోపాటు పలువురిపై చిత్రీకరణ జరుగుతోంది. ఇక రానున్న రోజుల్లో మరికొన్ని అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది.
వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి
కాగా, స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్ర పోషించనున్నారు. ఆయన మునుపెన్నడూ ఈ పాత్రలో కనిపించలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్తోపాటు టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, నటి కాంచన తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళీ, బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5వ తేదీన శుక్రవారం రోజున విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఎనిమిది భాష (తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మాండరిన్ (చైనీస్), జపనీస్, కొరియన్)ల్లో విడుదల కానుంది.
ఈ ఏడాదే మరో సినిమా
ప్రస్తుతం ప్రభాస్ షెడ్యూల్ ఫుల్ బిజీబిజీగా ఉంది. ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇదే సంవత్సరం ఆయన నుంచి మరో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభాస్ లీడ్ రోల్లో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ వారియర్‌లాగా కనిపించనున్నారు. దేశ భక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా దసరా పండగకు థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలతోపాటు రీసెంట్గా కల్కి సీక్వెల్ కూడా పట్టాలెక్కింది. అలా ప్రభాస్ కంటిన్యూగా సినిమాలు లైన్లో పెట్టారు.
స్పిరిట్ నుంచి మరో అనౌన్స్మెంట్కు సందీప్ రెడ్డి ప్లాన్స్- విలన్‌గా ఆ గ్లోబల్ స్టారేనా?
ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ ధమాకా- ఒకవైపు 'కల్కి 2', మరోవైపు 'స్పిరిట్'

