ETV Bharat / entertainment

'ఆడియెన్స్​ను పిండితే డబ్బులొస్తాయన్న ఫీలింగ్​లో ఉన్నాం- ఇండస్ట్రీపై వాళ్లకు విరక్తి పుడుతుంది!'- డైరెక్టర్ హాట్ కామెంట్స్

సమ్మర్ హాలీడేస్ టీజర్ రిలీజ్- ఈవెంట్​లో పాల్గొన్న దిల్​రాజు, సాయి రాజేశ్- ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితుల గురించి సంచలన వ్యాఖ్యలు!

Sai Rajesh
Sai Rajesh (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2026 at 5:25 PM IST

|

Updated : May 27, 2026 at 6:29 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sai Rajesh On Paid Reviews : 'యూట్యూబ్​లో వ్యూస్ కొనేస్తున్నాం', 'కామెంట్లు కొనేస్తున్నాం', 'ట్విట్టర్​లో నెగిటివ్​ను పాజిటివ్​ చేసేస్తున్నాం'. ఒక సినిమా ఈవెంట్​కు హాజరైన టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలివి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోయాయని, ఎలాంటి కథలను ప్రేక్షకులు ఆదరిస్తారో అనేది అస్సలు అర్థంకాకుండా పోయిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల గురించి పలు విషయాలు ఆయన ప్రస్తావించారు. అవేంటంటే?

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో బుధవారం జరిగింది. ఈ ఈవెంట్​కు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్​రాజు, దర్శకులు రాహుల్ రవీంద్రన్, సాయి రాజేశ్ చీఫ్ గెస్ట్​లుగా వచ్చారు. కార్యక్రమంలో సాయి రాజేశ్ ప్రస్తావించిన అంశాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏదీ జెన్యూన్​గా లేదని, వ్యూస్, కామెంట్స్ ఇలా అన్నింటినీ కొనేస్తున్నామని అన్నారు. ​

'సినిమా గురించి టీజర్లు, ట్రైలర్​లు, సాంగ్స్ ఇలా ఏ పబ్లిసిటీ కంటెంట్​ను రిలీజ్ చేస్తున్నా మాకు లోపల కాస్త ఆందోళనగానే ఉంటుంది. నిన్ననే మా చెన్నై లవ్​ స్టోరీ సినిమా నుంచి ఓ పాట రిలీజైంది. అయితే సినిమా ఆడియెన్స్​కు రీచ్ అయ్యిందా, ఓపెనింగ్స్ వస్తాయా, పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయా? లేదా? అనేది మాకు ఆందోళనగానే ఉంటుంది. మళ్లీ తీసేది లవ్ స్టోరీ సినిమాలే, పాటలు బాగుంటే ఓపెనింగ్స్ వస్తాయి. అస్సలు రిస్క్ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. యూట్యూబ్​లో వ్యూస్ కొనేస్తున్నాం. కామెంట్లు కొనేస్తున్నాం. ట్విట్టర్​లో నెగిటివ్ ట్రెండ్ ఉంటే దానిని పాటిజివ్​గా మార్చేస్తున్నాం'

'దీంతో జనాలకు ఏ కథ ఎక్కుతుంది? ఏది ఎక్కట్లేదు అనే విషయం అర్థం కాకుండా పోయింది. ఆడియెన్స్​కు ఇండస్ట్రీపై విరక్తి పుట్టేసింది. ప్రేక్షకులను పిండితే కలెక్షన్లు వస్తాయనే ఆలోచనలో ఉన్నాం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎలాంటి కథలు రాయాలి? ఏ సినిమాలు తీయాలి? అనే భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే కొన్ని జాన్రాలను మనమే చంపేశాం. ఇప్పుడు హర్రర్, థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, రొమ్ కామ్ అనే మూడు, నాలుగే ఉన్నాయి. అందుకే అది కాదు. అడియెన్స్​కు సినిమాపై ఆసక్తి కలిగించాలి. నేను తీసిన బేబీ (2023) ఇప్పుడు వచ్చి ఉంటే ఆ సినిమాకు అప్పుడు వచ్చినంతలో సగం వసూళ్లు రావు. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలుగుతున్నా' అని సాయి రాజేశ్ అన్నారు. అంటే ప్రస్తుతం ఇండస్ట్రీపై ఆడియెన్స్​లో నెలకొన్న ఆలోచనా ధోరణి పట్ల ఆయన ఆందోళన చెందుతున్నారు.

ఆడియెన్స్​ను థియేటర్​కు తీసుకురండి!
ఇదే ఈవెంట్​లో దిల్​రాజు మాట్లాడుతూ, చిన్న సినిమాలు చేస్తూ ఆడియెన్స్​ను థియేటర్లకు రప్పించాలని అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో పరిస్థితులు బాగా లేవని, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తేనే అన్నీ కుదురుకుంటాయని అన్నారు. 'ధైర్యంగా చెబుతున్నా, ఇవాళ ఇండస్ట్రీ పరిస్థితులు బాగా లేవు. ప్రేక్షకుడిని థియేటర్​కు తీసుకురావడమే మనందరిముందున్న అతి పెద్ద సవాల్. అందుకే చిన్న సినిమాలు తీసి సక్కెస్ కొట్టిన దర్శకులు ఇలాంటి మంచి సినిమాలు తీయాలి. అప్పుడే థియేటర్​కు ఫూట్​ఫాల్స్ పెరుగుతాయి. అలా జరిగితే సినిమాలు ఆడతాయి. బేబీ, లిటిల్ హార్ట్స్ సినిమాలు దర్శకులే ఇందుకు ఒక ఉదాహరణ. చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీ ఆరోగ్యంగా ఉంటుంది' అని దిల్​ రాజు పేర్కొన్నారు.

కాగా, ఈ సినిమాలో '#90's మిడిల్​క్లాస్ బయోపిక్' ఫేమ్ రోహన్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ నాయన్ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజీవ్ కనకాల, జయసుధ, వాసుకీ ఆనంద్ తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు.

తారక్​ బాటలోనే​ బాలీవుడ్ స్టార్ హీరోయిన్- 'ఆల్ఫా' కోసం హంతకురాలిగా ఆలియా​!

జపాన్​లో పెద్ది రిలీజ్ క్యాన్సిల్ - అభిమానులకు భారీ షాక్!

Last Updated : May 27, 2026 at 6:29 PM IST