ETV Bharat / entertainment

'ఇలాంటి స్టోరీతో ఇప్పటిదాకా ఏ సినిమా రాలేదు'- 'ధురంధర్​'పై ఆర్జీవీ రివ్యూ

'ధురంధర్' సినిమాపై ఆర్జీవీ రివ్యూ- నమ్మలేకపోతున్నానంటూ దర్శకుడి రిప్లై

RGV on Dhurandha
RGV on Dhurandha (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : December 19, 2025 at 3:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

RGV on Dhurandhar Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్- ఆదిత్య ధార్ కాంబోలో తెరకెక్కిన 'ధురంధర్‌' సూపర్ హిట్ టాక్​తో దూసుకెళ్తుంది. డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమాకు ఆల్​ఓవర్ పాటిజివ్ రెస్పాన్స్ అందింది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్ వర్మ ఈ సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. ధురంధర్ భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేసిందని అన్నారు. కొంతమంది ఫిల్మ్ మేకర్లు ధురంధర్ చూసి కొన్ని విషయాలు నేర్చువాలని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్​లో పోస్ట్​ షేర్ చేశారు.

'డైరెక్టర్ ఆదిత్య ధార్ ఈ సినిమాతో భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశారు. ఇది నార్త్ లేదా సౌత్ భాషల్లో తెరకెక్కిందనే దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఇది భారతీయ సినిమా. ఎందుకంటే ఇందులో సన్నివేశాలు ప్రతీ ప్రేక్షకుడి మనసును హత్తుకుంటాయి. ఇలాంటి కథతో ఇప్పటిదాకా ఏ సినిమా రాలేదు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతోపాట ఆడియెన్స్​ మనసులను ఈ మూవీటీమ్ గెలుచుకుంది. అదే వాళ్లు సాధించిన పెద్ద విజయం'

'ప్రారంభం నుంచి చివరి దాకా ప్రతీ సన్నివేశాన్ని ఎప్పటికీ గుర్తుండేలా తెరకెక్కించారు. హాలీవుడ్‌ సినిమాలలాగా కాకుండా మన నేటివిటీకి దగ్గరగా అంతర్జాతీయ స్థాయిలో సినిమా తీయవచ్చు అని దర్శకుడు ఆదిత్య నిరూపించారు. సినిమా మొత్తం చూసిన తర్వాత మన మనసుల్లో ఏదో తెలియని ఎమోషన్​ నిండిపోతుంది. అదంతా దర్శకుడి గొప్పతనం' అని ఆర్జీవీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

నమ్మలేకపోతున్నాను : అదిత్య
అయితే ఆర్జీవీ రివ్యూ పోస్ట్‌పై దర్శకుడు ఆదిత్య ధర్‌ స్పందించారు. ఈ సినిమా విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఇక నుంచి తాను ఏ చిత్రాన్ని తెరకెక్కించినా ఈ పోస్ట్‌ను చూసి తీస్తానన్నారు. 'నేను కొన్నేళ్ల కిందటే చిన్న సూట్‌కేస్‌తో ఎన్నో కలలతో ముంబయికి వచ్చాను. రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్​గా చేసినా చాలు అనుకున్నాను. అలాంటిది ఈరోజు ఆయనే నా సినిమాపై పోస్ట్‌ పెట్టడం నమ్మలేకపోతున్నాను' అని ఆదిత్య రిప్లై ఇచ్చారు.

కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. రెండు వారాల థియేట్రికల్ రన్ ముగించుకొని, మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.479.50 కోట్లు గ్రాస్ సాధించింది. మరో ఒకట్రెండు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్​లో చేరడం పక్కా! అలాగే రానున్న వారంలో క్రిస్మస్ హాలీడేస్, వీకెండ్ కలిసిరావడంతో ఈ సినిమా ఇంకా వసూళ్లు సాధించే అవకాశం ఉంది.