'ఏ పురుష దర్శకుడికీ అంత ధైర్యం లేదు!' - టాక్సిక్ డైరెక్టర్ గీతూపై ఆర్జీవీ ప్రశంసలు
టాక్సిక్ గ్లింప్స్‌పై రామ్‌గోపాల్ వర్మ రియాక్షన్- డైరెక్టర్ గీతూపై ఆర్జీవీ ప్రశంసల వర్షం- పురుష దర్శకులు సైతం పోటీ పడలేదని కితాబు!

Published : January 9, 2026 at 1:16 PM IST
RGV Comments On Toxic Glimps: కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమాను ఉగాది కానుకగా 2026 మార్చి 19న విడుదల చేయనున్నారు. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తున్న వీడియోను మూవీ మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ గ్లింప్స్‌పై స్పందించారు. డైరెక్టర్ గీతూమోహన్దాస్ను అభినందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రశంసలు కురిపించిన ఆర్జీవీ
తాజాగా రిలీజైన గ్లింప్స్ చాలా బోల్డ్‌గా ఉంది. మునుపెన్నడు లేని విధంగా యశ్ ఇందులో కనిపించారు. దీంతో ఈ గ్లింప్స్‌ను తెరకెక్కించిన విధానం తనను విపరీతంగా ఆకట్టున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ గీతూమోహన్ దాస్‌పై ప్రశంసలు కురిపించారు. ఆమె విజన్, మేకింగ్ స్టైల్‌ను మెచ్చుకుంటూ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. 'టాక్సిక్ ట్రైలర్ గ్లింప్స్ చూశాక, మహిళా సాధికారతకు గీతూ మోహన్‌దాస్ నిదర్శనమని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కలేదు. ఇలాంటి సీన్స్ చేయడానికి ఈమెకున్న ధైర్యం ఏ పురుష దర్శకుడికి లేదు. అలాంటి ఆ సీన్ ఈమె ఎలా చిత్రీకరించిందో నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను' అని అర్జీవీ ట్వీట్లో రాసుకొచ్చారు.
After seeing the @TheNameIsYash starring trailer of #Toxic I have no doubt that @GeethuMohandas_ is the ultimate symbol of Women Empowerment ..No Male director is Man enough in comparison to this Woman .. I still can’t believe she shot this 👇🏻 😳 https://t.co/ZxyxU8Da40 pic.twitter.com/qzFUcv9JIb
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2026
గ్లింప్స్ విషయానికొస్తే శ్మశానవాటిక సీన్‌తో స్టార్ట్ అవుతుంది. హై ప్రొఫైల్ కలిగిన ఓ తండ్రి తన కొడుకు అంత్యక్రియలను చేయడానికి అక్కడికి వస్తాడు. అతని చుట్టూ గన్లను పట్టుకుని చాలా మంది ఉంటారు. ఆ సమయంలో ఎలాంటి అక్కడ ఉన్నవాళ్లన్ని బలవంతంగా పంపిస్తారు. ఎవరూ రావొద్దని శ్మశనవాటిక గేట్లను మూసేసి తుపాకులు పట్టుకొని కాపలాగా నిలబడి ఉంటారు. అంతలోనే అక్కడికి ఓ కారు వచ్చి చెట్టును ఢీ కొంటుంది.
కొంత సమయం తర్వాత శ్మశానవాటికలో బాంబు పేళుళ్లతో విధ్వంసం జరుగుతుంది. ఆ టైంలోనే కారు నుంచి ఓ వ్యక్తి బయటకు వస్తాడు. ఆసక్తికరమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మంటల మధ్య నుంచి అతను నడుచుకుంటూ వస్తుంటాడు. తనకు ఎదురొచ్చిన వాళ్లనూ కాల్చుకుంటూ స్టైల్‌గా సిగరేట్ తాగుతూ చేతిలో గన్ పట్టుకుని పొగల మధ్య నుంచి కనిపిస్తాడు రాకింగ్ స్టార్ యశ్. డ్యాడీస్ హోమ్ అనే యశ్ డైలాగ్‌తో ఎండ్ అవుతాయి గ్లింప్స్.
మూవీ టీమ్
టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ కీలక పాత్ర పోషించనున్నారు. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ బ్యానర్స్‌పై యశ్, వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. జాన్ విక్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ కొన్ని యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సేమ్ టైమ్‌లో రిలీజ్ కానుంది. అంతేకాక హిందీ, మలయాళం, తెలుగు, తమిళంతో పాటు ఆరు భారతీయ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ విడుదల కానుంది.
టాక్సిక్ @100- యశ్ కొత్త లుక్ అదిరిపోయింది!
ఇంటర్నేషనల్ లెవెల్లో 'టాక్సిక్' రిలీజ్ - డిసెంబర్ కల్లా థియేటర్లలోకి!

