'ఉస్తాద్ భగత్‌సింగ్'లో పొలిటికల్ రిఫరెన్స్?- క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ హరీశ్
జోరుగా 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమా ప్రమోషన్స్- ట్రెండింగ్‌లో 'ఆరా ఆఫ్ ఉస్తాద్'- హరీశ్ శంకర్ స్పెషల్ వీడియో రిలీజ్- ఆ విషయాలపై క్లారిటీ

Published : February 23, 2026 at 9:04 PM IST
Ustaad Bhagat Singh Political Reference : పవర్‌స్టార్ పవర్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వచ్చే నెల 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుండడంతో ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు పాటలు రిలీజ్ చేసేశారు. తాజాగా 'ఆరా ఆఫ్ ఉస్తాద్' అనే పాట రిలీజైంది. ఇందులో పవన్ మేనరిజాన్ని చూపించారు. దీంతో ఈపాట ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు హరీశ్ శంకర్ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చారు.
వీడియో గ్లింప్స్‌లో 'గాజు ముక్క', అలాగే ఈ పాటలో పవన్ మేనరిజం చూసి ఈ సినిమాలో పొలిటికల్ రిఫరెన్స్‌లు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కొంతమంది ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు, విమర్శలు లాంటివి ఇందులో ఉంటాయా? అని దర్శకుడు హరీశ్‌ను అడుగుతున్నారట! అందుకే ఈ అంశంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి ఎలాంటి రిఫరెన్స్‌లు ఉండవని స్పష్టం చేశారు. సినిమా అనేది కేవలం వినోదం కోసమే అని పేర్కొన్నారు.
'ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్‌కు రెస్పాన్స్ బాగుంది. కొంతమంది ఫ్యాన్స్ కొన్ని పదాలను ఎడిట్ చేసి పంపిస్తున్నారు. అది సంతోషాన్నిస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ అందరికీ చాలా థాంక్స్. ఇంతకుముందు పాటకు డ్యాన్స్ బస్టర్ అని పెట్టారు కదా, దీనికి ట్రాన్స్బస్టర్ పేరు పెట్టాలని నా ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. అయితే ఈ పాట పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండడంతో కొంతమంది ఆసక్తికర అంశాలు ప్రస్తావనకు తెచ్చారు. అందుకే ఈ వీడియో చేస్తున్నా'
'అన్నా సినిమాలో పొలిటికల్ డైలాగులు, రిఫరెన్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. కానీ, సినిమాలు- రాజకీయం వేర్వేరుగా చూడాలని పవన్ కల్యాణ్‌గారు మాకు తొలి రోజు నుంచీ చెబుతూ వస్తున్నారు. ఆయన అదే పాటిస్తారు. అందుకే సిద్ధాంతం పరంగా ప్రకాశ్‌రాజ్‌తో విభేదాలు ఉన్నప్పటికీ ఆయనతో కలిసి వకీల్‌సాబ్, ఓజీలో నటించారు. ఆయన ఎవరినీ పర్సనల్‌గా టార్గెట్ చేయరు. మన సినిమాలో ఓ డైలాగ్ కానీ, ఒక సన్నివేశం కానీ, రిఫరెన్స్ గానీ ఓ ఒక్క వ్యక్తిని చిన్నబుచ్చుకునేలా ఉండకూడదని నాతో అన్నారు'
'సినిమా అంటే వినోదం మాత్రమే. అందుకే అలాంటివి చేయొద్దు అని అన్నారు. అందుకే మన సినిమాలో గాజు డైలాగ్ పెట్టాం అంటే అది హీరో పాత్రకు ఎలివేషన్ ఇచ్చేందుకు మాత్రమే. అది ఇతరులను తక్కువ చేయడంగానీ, సెటైర్లు వేయడం కానీ, వెటకారం కానీ లేవు. ఉండవు. అన్ని పార్టీల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. వాళ్లు ఓట్లు ఎవరికి వేసినా సినిమా అంటే ఈయన దగ్గరికే వస్తారు. ఇంకా నేను థ్రిల్ అయిన విషయం ఏంటంటే, ఆయన ఫ్యాన్స్ 'రాజకీయాల రిఫరెన్స్ వద్దు అన్నా,అవి పెట్టొద్దు. మనకు కావాల్సింది వినోదమే' అని అన్నారు'
'కల్యాణ్ గారిని స్టైల్, శ్వాగ్ ఫాలో అవ్వడమే కాకుండా, ఆయన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారు. హ్యాట్సాఫ్. ప్రతీ ఒక్కరూ సినిమా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఏ పార్టీనో, ఏ వ్యక్తినో, ఓ ఒక్క వర్గాన్నో చిన్నబుచ్చుకునేలా, వెటకారపు ధోరణిలో సినిమా అస్సలు ఉండదు. అందుకే అందరూ థియేటర్‌కు వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి' అని హరీశ్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే, హరీశ్ శంకర్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రవిశంకర్ నిర్మిస్తున్నారు.
'గుర్తుందిగా- ఈసారి వినోదం మాత్రమే కాదు'- ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్
పవర్‌స్టార్‌తో డ్యాన్స్ చేయించిన DSP- ఈసారి వింటేజ్ పవన్‌ను చూస్తారు!

